అన్వేషించండి

6 airbags in cars : ఆ పని అక్టోబర్ ఒకటి కల్లా చేయలేం - లబోదిబోమంటున్న కార్ల కంపెనీలు

అక్టోబర్ ఒకటి నుంచి 8 సీట్లు ఉన్న కార్లన్నింటికీ ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఆ డెడ్‌లైన్‌లోపు మార్పులు చేయడం సాధ్యం కాదని కార్ల కంపెనీలు చెబుతున్నాయి.


 
6 airbags in cars  : ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యమున్న కార్లన్నింటికీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కారు తయారీ దారులకు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే కార్ల తయారీ దారులు మాత్రం ఈ డెడ్ లైన్ అందుకోవడం కష్టమని అంటున్నారు. నిజానికి చిన్న కార్లకు రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలనే నిబంధనను కేంద్రం పెట్టింది.  గత ఏడాది మార్చి నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ, ఉత్పత్తిదారులు ఏడాదికి సరిపడా ముడిపదార్థాలను ముందే సమకూర్చుకోవడం.. డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రాడక్టులు దొరికే అవకాశాలు తక్కువ కావడం వల్ల అమలు చేయలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆ లక్ష్యాన్ని అందుకోగలిగారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆరు బ్యాగ్‌లు అంటే... అదీ కూడా అక్టోబర్ నుంచే అంటే సాధ్యం కాదని చెబుతున్నాయి.  

కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 800 సీసీ అయినా.. అంతకు మించిన సామర్థ్యం ఉన్న కార్లయినా.. ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ ఆరు ఎయిర్ బ్యాగ్‌ల నిబంధనల వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యం ఉన్న కార్లన్నీ ఈ కెటగిరీ కిందకు వస్తాయి.  డ్రైవర్‌ సీటుకు స్టీరింగ్‌ పైభాగంలో, ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు డ్యాష్‌బోర్డుకు అనుసంధానంగా ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. కేంద్రం తీసుకు వచ్చిన  తాజా నిబంధనలో.. వెనక వరసల్లో కూర్చొనే వారికి సైడ్‌ కార్నర్‌ నుంచి, ముందు నుంచి కూడా నాలుగు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాలి. ప్యాసింజర్ల పక్క వైపు సైడ్‌ కర్టైన్‌ లేదా ట్యూబ్‌ తరహా ఎయిర్‌బ్యాగులను అమర్చాల్సి ఉంటుంది.

రోడ్డు ప్రమాదాల్లో.. కార్లలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకుని, డ్రైవర్లు, ముందువరసలోని ప్యాసింజర్లు క్షేమంగా బయటపడ్డా.. వెనక సీట్లలో కూర్చొనేవారు చనిపోయిన ఉదంతాలున్నాయి. 
ఇప్పుడున్న రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనతో.. వాహనాల ముందు/వెనక భాగంలో ప్రమాదం జరిగితేనే సెన్సార్లు యాక్టివేట్‌ అయ్యి ఎయిర్‌బ్యాగులు తెరుచుకుంటాయి. పక్కవైపున ప్రమాదం జరిగితే.. సెన్సార్లు లేకపోవడం వల్ల ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడం లేదు. అందుకే.. సైడ్‌ కర్టైన్‌/ట్యూబ్‌ ఎయిర్‌బ్యాగులను కేంద్రం తప్పనిసరి చేస్తోంది.

కార్ల తయారీ కంపెనీలు ఓ వైపు ఎయిర్ బ్యాగ్‌ల ముడిపదార్థల సమస్యతో బాధపడుతున్నారు. మరో వైపు ధరలు కూడా భారీగా పెంచాల్సి రావొచ్చంటుంచున్నారు.  ఉత్పత్తిదారుడి వద్దే రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఆ ఖర్చు వినియోగదారుడికి చేరేసరికి రూ. 50 వేల దాకా అవుతుందని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ నిబంధన కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే ఉద్దేశంలో ఆటోమోబైల్ కంపెనీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx on Road Price Hyderabad: మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
కొత్త డిజైన్, తక్కువ బరువు, మరింత పవర్ ఫీల్ - KTM 790 Dukeకు భారీ అప్‌డేట్
సైన్స్ ఫిక్షన్ మూవీ బైక్‌లా KTM 790 Duke - అప్‌డేటెడ్ లుక్ అదిరింది బ్రదర్‌!
Bajaj Freedom 125: లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!
Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్
జంటగా షికార్లు చేయడానికి Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ - కొత్త లుక్‌తో యూత్‌కు ఫుల్ కిక్!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget