అన్వేషించండి

Car Sales Report: సెప్టెంబర్ అమ్మకాల్లో ఎస్‌యూవీల ఆల్ టైమ్ రికార్డు - భారీ స్థాయిలో అమ్మకాలు!

2023 సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాలు బాగా వృద్ధిని సాధించాయి.

September 2023 Car Sales Report: 2023 సెప్టెంబర్‌లో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సుమారు 3.62 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో మంచి గ్రాఫ్‌ను నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే రెండు శాతానికి పైగా వృద్ధిని, ఈ సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే 0.7 శాతం వృద్ధిని చూసింది. పండుగ సీజన్‌లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అగ్రస్థానంలో మారుతీ సుజుకి
భారతదేశపు అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి... బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్నీ వంటి మోడళ్లతో దేశంలోని ప్రముఖ ఎస్‌యూవీ తయారీదారుగా అగ్రస్థానంలో ఉంది. ఈ ఇండో-జపనీస్ వాహన తయారీ సంస్థ 2022 సెప్టెంబర్‌లో 1,48,380 యూనిట్లు విక్రయించగా... 2023 సెప్టెంబర్‌లో ఆ సంఖ్య కాస్త పెరిగి 1,50,812 యూనిట్ల రిటైల్ విక్రయాలను నమోదు చేసింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. మొత్తంగా 54,241 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. ఈ స్థాయి అమ్మకాలను సాధించడానికి క్రెటా, వెన్యూ, ఎక్సెటర్  ప్రధాన సహకారాన్ని అందించాయి. అయితే టాటా మోటార్స్ అమ్మకాలు సంవత్సరానికి 6.0 శాతం క్షీణించాయి. కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో 47,655 యూనిట్లను విక్రయించింది. కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్‌కు అది 44,810 యూనిట్లకు తగ్గింది. హారియర్, సఫారీ కొత్త మోడళ్ల రాక కోసం వేచి ఉండటమే టాటా అమ్మకాలు తగ్గడానికి కారణం అని చెప్పవచ్చు.

41,267 యూనిట్ల మొత్తం అమ్మకాలతో మహీంద్రా నాలుగో స్థానాన్ని పొందింది. ఎక్స్‌యూవీ700 దాని అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా అద్భుతమైన పనితీరును కొనసాగించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో టయోటా కిర్లోస్కర్ 22,168 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే 44 శాతం వృద్ధిని సాధించింది.

ఆల్ టైమ్ రికార్డు అమ్మకాలు సాధించిన ఎస్‌యూవీలు
గత నెలలో ఎస్‌యూవీ అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2022 సెప్టెంబర్‌లో టాటా నెక్సాన్ 14,518 యూనిట్లు విక్రయించగా... 2023 సెప్టెంబర్‌లో 15,325 యూనిట్లతో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. దీని అమ్మకాలు ఏకంగా ఆరు శాతం పెరిగింది. మారుతీ సుజుకి బ్రెజా 15,001 యూనిట్లతో అమ్మకాలలో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఈ కాలంలో టాటా పంచ్ మొత్తం 13,036 యూనిట్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు నాయకత్వం వహించింది. 2023 సెప్టెంబర్‌లో హ్యుందాయ్ క్రెటాకు సంబంధించి 12,717 యూనిట్లు అమ్ముడుపోయాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన నాలుగో ఎస్‌యూవీగా నిలిచింది. 12,204 యూనిట్లతో హ్యుందాయ్ వెన్యూ ఐదో స్థానంలో ఉంది.

మరోవైపు మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో ఈవీఎక్స్ కాన్సెప్ట్‌ను తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ప్రదర్శించింది. 2023 టోక్యో మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రెడీ ప్రివ్యూ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

ఇ-క్లచ్‌తో Rebel 300, Rebel 500 - క్లచ్‌ నొక్కే పని లేదు, గేర్‌ మార్చుకుంటూ దూసుకెళ్లడమే!
బాబర్‌ స్టైల్‌లో అదిరిపోయిన Honda Rebel 300, Rebel 500 - త్వరలోనే లాంచ్‌!
2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు
కొత్త Maruti Brezza ఎంత మైలేజ్‌ ఇస్తుంది? - మీ డబ్బులు ఆదా చేసే వేరియంట్‌ ఇదే!
E20తో పాటు E85 ఇంధనంతోనూ నడిచే హోండా ADV160 - ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
బైక్‌ లాంటి హోండా కొత్త మాక్సీ స్కూటర్‌ - అడ్వెంచర్‌ లుక్‌తో ADV160 అదుర్స్‌!
Tata Tiago on EMI: ₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?
₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget