Mahindra Scorpio N: వివాదాల్లోకి స్కార్పియో ఎన్ - దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన మహీంద్రా!
స్కార్పియో ఎన్‌పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌కు మహీంద్రా ప్రూఫ్‌తో రిప్లై ఇచ్చింది.
Mahindra & Mahindra: కొన్ని రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోఒక మహింద్రా స్కార్పియో - ఎన్ యూజర్ తన ఎస్‌యూవీని జలపాతం కిందకు తీసుకువెళ్లారు. అప్పుడు దాని సన్‌రూఫ్ ద్వారా క్యాబిన్‌లోకి చాలా నీరు ప్రవేశించింది. దీని కారణంగా ఈ ఎస్‌యూవీ గురించి చాలా ప్రతికూల విషయాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు మహీంద్రా అదే జలపాతం కింద తెల్లటి స్కార్పియో-ఎన్‌ను తీసుకువెళ్లి వాహనం లోపల నీరు లీక్ కాలేదని నిరూపించడం ద్వారా ఈ వివాదాలకు సమాధానం ఇచ్చింది.
విషయం ఏమిటి?
కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబర్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను తన మహీంద్రా స్కార్పియో - ఎన్‌ని ఉత్సాహంగా దారిలో ఉన్న జలపాతం నుండి క్రిందికి తీసుకువెళ్లాడు. ఇందులో క్యాబిన్ లైట్ ప్యానెల్ నుంచి సన్‌రూఫ్ ద్వారా చాలా నీరు కారు క్యాబిన్ లోపలికి రావడం కనిపిస్తుంది. అయితే నీటి లీకేజీకి గల కారణాలపై స్పష్టత రాలేదు. దీనిపై నిపుణులు మిశ్రమ స్పందనను వ్యక్తం చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కానీ అంచనాల ప్రకారం ఇది ఈ కారు వారంటీని రద్దు చేయవచ్చు.
వివాదానికి తెర దించిన మహీంద్రా
మహీంద్రా మొత్తం విషయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ యూట్యూబర్ చేసిన అదే 'స్టంట్'ని పునరావృతం చేసింది. కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "ఈ వీడియో ప్రొఫెషనల్ మార్గదర్శకత్వంలో రూపొందించారు. వీక్షకులు దీన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించవద్దు" అని సలహా ఇచ్చారు.
Just another day in the life of the All-New Scorpio-N. pic.twitter.com/MMDq4tqVSS
— Mahindra Scorpio (@MahindraScorpio) March 4, 2023
Mahindra to sach mein adventurous hai 😀 Meri SUV andar se gandi ho gayi thi, gaadi ne self wet cleaning kar di. 🫠@anandmahindra sir I’m still enjoying my Spiti trip. 🔥s pic.twitter.com/bwVYaoltYI
— Arun Panwar (@arunpanwarx) February 28, 2023
ప్రముఖ వాహనాల తయారీదారు కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన స్కార్పియో ఎస్‌యూవీని గత సంవత్సరం కొత్త వెర్షన్‌లో లాంచ్ చేసింది. దీంతో పాటు కొత్త SUV స్కార్పియో-N కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇది స్కార్పియో క్లాసిక్ కంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో వచ్చింది. ఈ రెండు ఎస్‌యూవీ కార్లు ప్రస్తుతం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే, కొత్త స్కార్పియో ఎన్ వచ్చిన తర్వాత కూడా స్కార్పియో క్లాసిక్‌కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.
కొత్త ఆర్‌డీఈ ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీ తన స్కార్పియో క్లాసిక్‌లోని ఇంజిన్‌లను త్వరలో అప్‌గ్రేడ్ చేస్తుంది. దీంతో పాటు మహీంద్రా ఈ SUV కోసం మిడ్-స్పెక్ వేరియంట్ S5 ను కూడా విడుదల చేస్తుంది. ఈ కొత్త S5 వేరియంట్ దాని దిగువ వేరియంట్ S, టాప్ వేరియంట్ S11 మధ్యలోకి రానుంది. ప్రస్తుతం ఇది బేస్ వేరియంట్‌లో 9-సీట్ల ఆప్షన్‌ను మాత్రమే పొందుతుంది. అయితే దాని కొత్త S5 వేరియంట్ 7, 9 సీట్ల ఆప్షన్లలో వస్తుంది.