Royal Enfield: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - మూడు కొత్త మోడల్స్‌తో రెడీ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో మూడు కొత్త బైకులను భారత దేశ మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Royal Enfield: ఇటీవలే హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400 మిడిల్ వెయిట్ మోటార్‌సైకిళ్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. దీని కారణంగా ఈ విభాగంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ రెండు మోడల్స్ కంపెనీ లాంచ్ చేసిన బడ్జెట్ బైక్స్‌లో ఉన్నాయి. హార్లే డేవిడ్సన్ ఎక్స్440 అనేది హీరో, హార్లే మధ్య జాయింట్ వెంచర్ ద్వారా లాంచ్ అయిన మొదటి బైక్. ఇక ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ బజాజ్ ఆటో, ట్రయంఫ్ మధ్య జాయింట్ వెంచర్ ద్వారా లాంచ్ అయిన ఫస్ట్ ప్రొడక్ట్. ఈ రెండు బైక్‌లకు పోటీగా బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మీటోర్ 350, హిమాలయన్ 400 మోడల్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని ప్రస్తుత కలెక్షన్‌కు అదనంగా 350సీసీ, 450 సీసీ రేంజ్‌లో మూడు కొత్త మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయడానికి రెడీ అయింది. దీని ద్వారా ఆటో రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 2023 ప్రారంభంలో కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దాని తర్వాత కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కావచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 440ని కూడా కంపెనీ సిద్ధం చేస్తుంది. ఈ బైక్ వచ్చే ఏడాది నాటికి మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని కంపెనీ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తుంది. ఇందులో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఈ బైక్ డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించనున్నాయి. ఇది మెరుగైన లంబార్ సపోర్ట్‌తో కొత్త సింగిల్-పీస్ సీట్ సెటప్, హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ క్రోమ్ ట్రీట్‌మెంట్, టెయిల్‌ల్యాంప్స్, రియర్‌వ్యూ మిర్రర్స్, టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వైర్-స్పోక్ వీల్స్ మరియు సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ క్యానిస్టర్‌ను అందించనున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 440 ఎయిర్/ఆయిల్ కూల్డ్ 440 సీసీ ఇంజన్‌తో మార్కెట్లోకి రానుంది. కానీ ఈ ఇంజన్ పవర్, టార్క్ అవుట్‌పుట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయన్ 450 కంటే చాలా తక్కువగా ఉంటుంది. కంపెనీ రాబోయే కొద్ది నెలల్లో దీనిని లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 440 ఇటీవల విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440తో పోటీపడనుంది. ఇది మూడు వేరియంట్‌లు, మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మనదేశంలో ఉన్న బ్రాండ్ వాల్యూ వినియోగదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యూత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మంచి క్రేజ్ ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial