Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వచ్చేసింది - కేవలం 25 యూనిట్లు మాత్రమే - డిజైన్ సూపర్!
Royal Enfield Shotgun 650 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.4.25 లక్షలుగా ఉంది.
Royal Enfield New Bike: గోవాలో జరిగిన వార్షిక రైడర్ మానియా ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 450 డ్యూయల్ పర్పస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ ఈ ఈవెంట్‌లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇది 2021 EICMA మోటార్ షోలో డిస్‌ప్లే చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కాన్సెప్ట్‌కు సంబంధించిన ప్రొడక్షన్ మోడల్.
కేవలం 25 యూనిట్లు మాత్రమే
ఫొటోల్లో చూపిన మోటార్‌సైకిల్ ఫ్యాక్టరీ ఫ్రెండ్లీ మోడల్. కేవలం 25 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి కానున్నాయి. ఇది ప్రొడక్షన్ స్పెక్ మోడల్ స్టైలింగ్‌ను ప్రివ్యూ చేస్తుంది. షాట్‌గన్ మోటోవర్స్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.25 లక్షలుగా ఉంది. ఈ 25 యూనిట్ల డెలివరీ 2024 జనవరిలో ప్రారంభం అవుతుంది. ఈ 25 మంది కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా షాట్‌గన్ 650కి మొదటి యజమానులు అవుతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 అనేది కంపెనీ లాంచ్ చేసిన నాలుగో 650సీసీ ట్విన్ సిలిండర్ మోటార్‌సైకిల్. అయితే ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటోర్ 650 ఇప్పటికే ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 స్పెసిఫికేషన్లు
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 సూపర్ మెటోర్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కోసం ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌పై బేస్ అయి ఉంటుంది. ఇది గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 647.95సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ను పొందే అవకాశం ఉంది. 47.65 పీఎస్ పవర్, 52 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఈ బైక్ ఉత్పత్తి చేయనుంది. ఇది షోవా సోర్స్డ్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌ను పొందుతుంది. బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటాయి.
లీకైన సమాచారం ప్రకారం కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 పొడవు 2170 మిల్లీ మీటర్లుగానూ, వెడల్పు 820 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1105 మిల్లీమీటర్లుగానూ ఉండనుంది. అయితే అధికారిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. సూపర్ మెటోర్ 650తో పోలిస్తే, ఈ బైక్ కాంపాక్ట్, ఎక్కువ సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ వీల్‌బేస్ 1465 మిల్లీమీటర్లుగా ఉంది.
డిజైన్ ఇలా..
ఈ మోటార్‌సైకిల్ షాట్‌గన్ 650 కాన్సెప్ట్‌ని తరహాలో ఉంది. పెద్ద ఇంధన ట్యాంక్, సింగిల్ సీట్ సెటప్ కూడా కాన్సెప్ట్ డిజైన్ లాగానే ఉంది. ఈ మోటార్‌సైకిల్ డ్యూయల్ టోన్ బ్లాక్, లైట్ బ్లూ కలర్‌లో లాంచ్ అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్, షాట్‌గన్ లోగోను పసుపు రంగులో రూపొందించారు. బైక్ ఇతర భాగాలు నలుపు రంగులో ఉన్నాయి. ఇది ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మిడ్ సెట్ ఫుట్ పెగ్‌లు, పొడవైన సీటుతో మరింత సౌకర్యవంతమైన సీట్ పొజిషనింగ్‌ను అందిస్తుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!