అన్వేషించండి

నెలకు 25,000 జీతంతో Hunter 350 కొనడం సాధ్యమేనా?

Royal Enfield Hunter 350 Engine: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 349 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. కంపెనీ లెక్క ప్రకారం, ఈ బండి లీటరుకు 36 km మైలేజీ ఇస్తుంది.

Royal Enfield Hunter 350 Price Price, Mileage And Features: భారతదేశంలోనే కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులకు ప్రపంచమంతా డైహార్డ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండితో రోడ్డుపై చక్కర్లు కొడుతుంటారు. ఈ బ్రాండ్‌లో హంటర్ 350 కూడా బాగా ఆకట్టుకుంది. దీని స్టైలిష్ లుక్‌కు యువతలో చాలా క్రేజ్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బాహ్య రూపం స్లీక్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని షార్ప్ హెడ్‌ల్యాంప్స్‌ & ఎయిరోడైనమిక్ ఫెయిరింగ్స్‌ ఈ మోటార్‌ సైకిల్‌కు దూకుడైన రూపాన్ని ఇస్తాయి. మెటాలిక్ ఫినిష్‌తో కూడిన ఫ్యూయల్ ట్యాంక్‌ & క్లాసిక్ ఎగ్జాస్ట్ డిజైన్ ఈ బైక్‌తో మెసిరిపోతుంది. ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌, స్టైల్‌గా ఉండే అలాయ్ వీల్స్ హంటర్ 350కు ప్రత్యేక ఫీల్‌ అందిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ధర 
తెలుగు రాష్ట్రాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో, బేస్ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 స్టాండర్డ్‌ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.91 లక్షలు. దీనిలో, బండి రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.81 లక్షలు. మీరు ఈ బైక్‌ కొనాలనుకుంటే, ఒకేసారి ఇంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

విజయవాడలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్ కొనడానికి మీకు రూ. 1.56 లక్షల వరకు లోన్ లభిస్తుంది. హంటర్ 350 తాళంచెవిని మీ చేతుల్లోకి తీసుకోవడానికి, ముందుగా మీరు రూ. 25,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. బ్యాంక్‌ 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో మీకు రూ. 1.56 లక్షల లోన్‌ మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, మీరు రూ. 25,000 జీతంతో ఈ మోటార్‌ సైకిల్‌ను కొనగలరా, నెలకు EMI ఎంత అవుతుందో చూద్దాం.

4 సంవత్సరాల కోసం ఈ లోన్‌ తీసుకుంటే, 48 నెలల పాటు నెలకు రూ. 4,405 EMI చెల్లించాలి.

3 సంవత్సరాల రుణ కాలపరిమితి ఎంచుకుంటే, 36 నెలల పాటు నెలకు రూ. 5,484 EMI చెల్లించాలి.

2 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే, 24 నెలల పాటు నెలకు రూ. 7,643 EMI చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే, 12 నెలల పాటు నెలకు రూ. 14,121 EMI చెల్లించాలి.

మీ జీతం రూ. 25 వేలు అయితే, అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత మీ దగ్గర కనీసం రూ. 6000 మిగులుతుంటే, 3 సంవత్సరాల రుణ కాల పరిమితితో ఈ బైక్ కొనుగోలును పరిశీలించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ మైలేజ్
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్‌ 349 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 20.2 bhp పవర్‌ను & 27 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది, బలంగా పరుగు తీస్తుంది. అదే సమయంలో, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సున్నితమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఇస్తుంది. ఈ బండికి 13-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. కంపెనీ లెక్క ప్రకారం. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్‌ లీటరు పెట్రోల్‌కు 36.2 కి.మీ.ల మైలేజీ ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget