అన్వేషించండి

River Indie vs Ather 450X: రివర్ ఇండీ vs ఏథర్‌ 450ఎక్స్‌; ధర, మైలేజీ, ఫీచర్లలో ది బెస్ట్ ఏదీ? 

River Indie vs Ather 450X:రివర్స్‌ఇండీ, ఏథర్‌ 450ఎక్స్‌ మధ్య కంపారిజన్. ధర, మైలేజీ, స్టోరేజ్‌, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మీకు సరిగా సరిపోతుందో తెలుసుకోండి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రివర్ ఇండీ రూ. 1.45 లక్షలు, ఏథర్ 450ఎక్స్ రూ. 1.55-1.57 లక్షలు.
  • ఇండీ 161 కిమీ రేంజ్, ఏథర్ వాస్తవంగా 112 కిమీ రేంజ్ ఇస్తుంది.
  • రెండు స్కూటర్లు 90 కిమీ/గం వేగం, ఇండీ ఎక్కువ టార్క్ అందిస్తుంది.
  • ఇండీ 43 లీటర్ల స్టోరేజ్, ఏథర్ 22 లీటర్ల స్టోరేజ్ అందిస్తుంది.

River Indie vs Ather 450X:భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాటరీ విషయంలో ఉన్న అపోహలు తొలగిపోతున్న వేళ వినియోగదారులు ఈవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్లతోపాటు సాధారణ స్కూటర్లు కూడా కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అందుకే ఫేమస్ కంపెనీలు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం ఉన్న టాప్ జాబితాలో రివర్ ఇండీ, ఏథర్‌ 450ఎక్స్‌ ప్రజలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ధరతోపాటు ఇతర ఫీచర్ల విషయంలో ఉన్న తేడాలు ఏంటీ, ఎవరు ఏ స్కూటర్ తీసుకోవాలో చూద్దాం. 

ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగం పెరగడంతో కంపెనీలు, కేవలం మైలేజీకి పరిమితం కాకుండా యూజర్ల అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. అందుకే కొత్త కొత్త అప్‌డేట్స్‌తో స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. అలా అప్‌డేట్ అవుతున్న వాటిలో ఏథర్‌ తన 450క్స్ మొదటి స్తానంలో ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుస్తూ ఉంది. మరోవైపు రిర్ కంపెనీ తన ఇండీ మోడల్‌ను ఏథర్‌కు పోటీగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

వాహనం కొనేటప్పుడు వినియోగదారుడు మొదట గమనించేది ధర. అందుకే వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. రివర్ ఇండీ సగటు ఎక్స్‌షోరూమ్‌ ధర 1,45,124 రూపాయులుగా ఉంది. ఇది ప్రస్తుతం ఒకే ఒక వేరియంట్‌లో, ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఏథ్‌ 45ఎక్స్‌ ధర వేరియంట్‌ బట్టి మారుతుంది. ఇది సుమారు 1.55 లక్షల నుంచి 1.57 లక్షల వరకు ఉంటోంది. ఏథర్‌ మొత్తం నాలుగు వేరియంట్లలో, ఎనిమిది విభిన్న రంగుల్లో లభిస్తోంది. అంటే ఇక్కడ ధర పరంగా చూస్తే ఏథర్ కంటే రివర్ ఇండీ సుమారు 9వేల వరకు తక్కువ ధరకు లభిస్తుంది. 

పనితీరు, రైడింగ్‌ రేంజ్‌

ఎలక్ట్రిక్ స్కూటర్లలో మైలేజీ అత్యంత కీలకమై అంశం. ధర తర్వాత ఎక్కువ మంది ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో రివర్ ఇండీ గరిష్టంగా 161 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్‌ చేస్తోంది. ఆన్‌రోడ్‌పై చూస్తే ఇది 135 నుంచి 146 కిలోమీటర్ల వరకు వస్తుందని చెబుతున్నారు. ఏథర్‌ 450ఎక్స్‌ కూడా 161 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని చెబుతున్నారు. కానీ  వాస్తవంగా ఇది 112 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని రివ్యూలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఏథర్‌ 450ఎక్స్‌లో 2.9 KWh వెర్షన్‌ మాత్రమే 126 కిలోమీటర్ల రేంజ్‌  అందిస్తోంది. 

రెండు స్కూటర్లు కూడా గరిష్టంగా గంటలకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అయితే ఏథర్‌ 450ఎక్స్‌ కేవలం 3.3 సెకన్‌లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. రివర్‌ ఇండీ ఇదే వేగాన్ని అందుకోవడానికి మూడు నుంచి ఏడు సెకన్లు పడుతుంది. రెండు స్కూటర్లు కూడా 26Nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. పవర్‌ ప రంగా చూస్తే రివర్ ఇండీ గరిష్ట పవర్‌ 6.7kW అయితే ఏథర్‌ 450 ఎక్స్‌ వాహనం 6.4 kW పవర్‌ ఇస్తోంది. 

బ్యాటరీ- ఛార్జింగ్ టైం

వినియోగదారులు చూసే మరో కీలకమైన అంశం ఛార్జింగ్‌, బ్యాటరీ కెపాసిటీ. ఈ విషయంలోనే చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే వీటిపై కూడా ఈ రెండు సంస్థలు చాలా క్లారిటీ ఇచ్చాయి. రివర్‌ ఇండీ 4kWh లిథియం- అయాన్ బ్యాటరీ ఇస్తుంది. దీన్‌ని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు పడుతుంది. ఏథర్‌ 450 ఎక్స్‌లో 2.9kWh  అండ్‌ 3.7kWh  అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు అందిస్తోంది.  మొదటి రకం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4.3 గంటలు, రెండో వెర్షన్ ఛార్జ్ చేయడానికి 5.45 గంటల సమయం పడుతుంది. 

స్టోరేజీ సామర్థ్యం 

రివర్‌ ఇండీలో అండర్‌ సీట్ స్టోరేజ్‌ అకంగా 43 లీటర్లు ఉంది. దీనికి అదనంగా ముందు భాగంలో స్టోరేజీ బాక్స్ కూడా ఉంది. ఏథర్‌ 450ెక్స్‌లో కేవలం 22 లీటర్ల స్టోరేజ్‌ మాత్రమే ఉంది. రివర్ ఇండీ 293 కిలోల బరువును మోయగలదు. ఏథర్‌ కేవలం 175 కిలోలను మాత్రమే తీసుకెళ్లగలదు. రివర్ ఇండీ 14 ఇంచ్‌ల అల్లాయ్‌వీల్స్‌ను ఉపయోగిస్తుండగా, ఏథర్‌ 12 అంగుళాల చక్రాలను కలిగి ఉంది. పెద్ద చక్లా వల్ల ఇండీ గతుకల రోడ్లపై స్థిరంగా ఉంటుంది. 

టెక్నాలజీ ఫీచర్లలో ఎవరు టాప్ 

రివర్ ఇండీలో 6 అంగుళాల ఎస్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఏథర్‌ 450ఎక్స్‌లో ఏడు అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఉంది. రెండింటిలో కూడా బ్లూటూత్, జీపీఎస్‌ నావిగేషన్ ఉన్నాయి. ఏథర్‌లో ఓటీఏ అప్‌డేట్‌, కాల్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. రివర్ ఇండీ బ్యాటరీ, మోటరుపై 3ఏళ్ల లేదా, 30వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. ఏథర్‌ 450ఎక్స్‌ కూడా బ్యాటరీపై 3 ఏళ్లు 30వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. కానీ ఏథర్‌ స్టాక్‌ ప్రో ప్యాకేజీతో దీనిని ఐదేళ్లకు లేదా 60 కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. 

ఎవరికి ఏ వాహనం సరిపోతుంది?

మీరు కుటుంబ అవసరాలకు అంటే సరకుల రవాణాకు, లేదా ఎక్కువ సామాగ్రిని రవాణా చేయడానికి ప్రాధాన్య ఇస్తామంటే ఇండీ చాలా మంచిది. ఈ విషయంలో ఈ వాహనానికి మంచి రేటింగ్ ఉంది. మీకు స్పీడ్, టెక్నాలజీ, తేలికపాటి వాహనం కావాలంటే మాత్రం ఏథర్‌ మంచి ఆప్షన్ అవుతుంది.

Frequently Asked Questions

రివర్ ఇండీ మరియు ఏథర్ 450X మధ్య ధర తేడా ఏమిటి?

రివర్ ఇండీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹1,45,124. ఏథర్ 450X ధర ₹1.55 లక్షల నుండి ₹1.57 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, రివర్ ఇండీ ఏథర్ కంటే సుమారు ₹9,000 తక్కువకు లభిస్తుంది.

రివర్ ఇండీ మరియు ఏథర్ 450X లలో ఏది ఎక్కువ రేంజ్ ఇస్తుంది?

రెండు స్కూటర్లు గరిష్టంగా 161 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయని చెబుతున్నాయి. అయితే, ఆన్-రోడ్ రివర్ ఇండీ 135-146 కి.మీ. ఇస్తే, ఏథర్ 450X వాస్తవంగా 112 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుందని రివ్యూలు తెలుపుతున్నాయి.

బ్యాటరీ ఛార్జింగ్ సమయం మరియు సామర్థ్యం ఎలా ఉన్నాయి?

రివర్ ఇండీలో 4kWh బ్యాటరీ ఉంది, దీనికి పూర్తి ఛార్జింగ్ 6 గంటలు పడుతుంది. ఏథర్ 450X లో 2.9kWh (4.3 గంటలు) మరియు 3.7kWh (5.45 గంటలు) బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

స్టోరేజ్ మరియు బరువు మోసే సామర్థ్యం విషయంలో తేడా ఏమిటి?

రివర్ ఇండీలో 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ తో పాటు ముందు భాగంలో కూడా స్టోరేజ్ ఉంది. ఇది 293 కిలోల బరువును మోయగలదు. ఏథర్ 450X లో కేవలం 22 లీటర్ల స్టోరేజ్ మాత్రమే ఉంది మరియు 175 కిలోల బరువును మోయగలదు.

టాప్ హెడ్ లైన్స్

Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget