అన్వేషించండి

SUV మార్కెట్‌లో కొత్త సంచలనం - Renault Kiger Facelift లాంచ్‌, షేక్‌ చేసే కొత్త ఫీచర్లున్నా ధర తక్కువే!

Renault New Car 2025: రూ. 6.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి ప్రారంభమైన కొత్త రెనాల్ట్‌ కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ఆకట్టుకునే లుక్‌, కొత్త ఫీచర్లు, మెరుగైన భద్రత ప్రమాణాలతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

Renault Kiger Facelift 2025 Price, Features In Telugu: భారత కాంపాక్ట్‌ SUV మార్కెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. మారుతి సుజుకీకి పోటీగా, కామన్‌ మ్యాన్‌కు బడ్జెట్‌ కార్లను అందించే రెనాల్ట్‌, జనానికి ప్రియమైన మోడల్‌ 'కిగర్‌'లో ‍‌(New Renault Kiger) ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ లాంచ్‌ విడుదల చేసింది. కేవలం రూ. 6.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వెర్షన్‌.. రూపంలోనూ, ఫీచర్లలోనూ బోలెడన్ని మార్పులు తెచ్చింది. ఎంట్రీ లెవల్‌ SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు, ముఖ్యంగా ఈ పండుగ సీజన్‌లో బడ్జెట్‌ కారు కొనాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

డిజైన్‌లో కొత్త లుక్‌
కొత్త కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మొదటి చూపులోనే ఆకర్షిస్తుంది. ముందు బంపర్‌, క్రోమ్‌ టచ్‌తో గ్రీల్‌, షార్ప్‌ LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, స్పోర్టీ డే-టైమ్ రన్నింగ్ లైట్స్‌ వాహనానికి స్టైలిష్‌ అప్‌గ్రేడ్‌ ఇస్తున్నాయి. కొత్తగా డిజైన్‌ చేసిన 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఈ కాంపాక్ట్‌ సైజ్‌ SUVకి మరింత డైనమిక్‌ లుక్స్‌ ఆపాదించాయి. వెనుక వైపు LED టెయిల్‌ల్యాంప్స్‌, బంపర్‌లో చేసిన చిన్న మార్పులు కూడా ఈ కారును మరింత ఆధునికంగా నిలబెట్టాయి.

ఇంటీరియర్‌లో కొత్త మెరుగులు
అంతర్గతంగా కూడా కిగర్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. డ్యుయల్‌ టోన్‌ డాష్‌బోర్డ్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి టెక్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా చేర్చిన వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఆంబియంట్‌ లైటింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు డ్రైవర్‌కు, ఇతర ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

రక్షణ మరింత బలోపేతం
భారత మార్కెట్లో ఇప్పుడు కార్లు భద్రత ప్రమాణాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. రెనాల్ట్‌ కిగర్‌ కూడా ఈ అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంది. అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవింగ్‌ సమయంలో సేఫ్టీపై ఎలాంటి సందేహం లేకుండా నమ్మకంగా ముందుకు సాగవచ్చు.

ఇంజిన్‌ ఎంపికలు మారలేదు
ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి, కొత్త కిగర్‌ వెర్షన్‌లో మెకానికల్‌గా పెద్ద మార్పులు చేయలేదు. గత మోడల్‌ లాగే 1.0 లీటర్‌ నేచురల్‌ పెట్రోల్‌, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు లభిస్తున్నాయి. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో 5 స్పీడ్‌ మాన్యువల్‌, AMT, CVT లభ్యమవుతాయి. వీటిలో కస్టమర్‌ తన అవసరాల ప్రకారం సరైనదానిని ఎంపిక చేసుకోవచ్చు.

ధరలు & వేరియంట్‌లు
కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ బేస్‌ వేరియంట్‌ రూ. 6.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి మొదలవుతుంది. మిడ్‌ లెవల్‌ వేరియంట్‌లు సుమారు రూ. 7.5 లక్షల నుంచి 8.5 లక్షల వరకు ఉండగా, టాప్‌ వేరియంట్‌ ధర రూ. 11.29 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలతో కిగర్‌ కొత్త మోడల్‌ Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Nissan Magnite వంటి బలమైన పోటీదారులతో సేల్స్‌ రేస్‌ కొనసాగిస్తుంది.

తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు ప్రత్యేకం
రెనాల్ట్‌ కిగర్‌, ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో మరింత ఫ్రెష్‌గా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్కెట్‌లోకి వచ్చింది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఎంట్రీ లెవల్‌ SUV కొనాలనుకునే వినియోగదారులకు కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మంచి ఆప్షన్‌. SUV లుక్‌, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ, సేఫ్టీ, చౌకైన ధర - అన్నీ బెస్ట్‌ క్వాలిటీస్‌తో రెనాల్ట్‌ మరోసారి యువతను ఆకర్షించేందుకు ముందుకు వచ్చింది. యూత్‌కు మాత్రమే కాకుండా ఎంట్రీ లెవల్‌ SUV కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీలు కూడా దీనిని ఖచ్చితంగా పరిశీలించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget