రోజూ బైక్‌పై తిరిగేవారికి బెస్ట్ ఆప్షన్‌గా వచ్చిన Raida UrbanR రైడింగ్ షూస్ - ఫుల్ రివ్యూ
Raida UrbanR రైడింగ్ షూస్ రోజువారీ రైడింగ్‌కు ఎలా పనికొస్తాయి? కంఫర్ట్, ప్రొటెక్షన్, మెష్ వెంటిలేషన్, బిల్డ్ క్వాలిటీ, ప్రైస్ వాల్యూ - అన్నింటిపై పూర్తి రివ్యూని ఇక్కడ చదవండి.

Raida UrbanR Riding Shoes Review: బైక్ రైడింగ్‌లో సేఫ్టీ అనేది ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం. మోటార్‌సైకిల్ మీద తిరిగేవాళ్లకు మంచి షూస్ మంచి రక్షణ అందిస్తాయి. కానీ.. రోజూవారీ పనుల్లో, ఎక్కువగా సిటీ రైడింగ్ చేసే రైడర్లకు హెవీ టూరింగ్ బూట్స్ ధరించడం కాస్త కష్టమే. అలాంటి సందర్భాల్లో సాధారణ కేజువల్ లుక్‌తో పాటు రైడింగ్‌కు అవసరమైన ప్రొటెక్షన్ కూడా ఇచ్చే షూస్ అవసరం. ఇదే పాయింట్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన మోడల్ - Raida UrbanR రైడింగ్ షూస్.
నెల రోజుల అనుభవం
ఒక రైడర్, ఈ షూస్‌ను గత ఒక నెల రోజులుగా వాడిన అనుభవం ప్రకారం చూస్తే, ఇవి రైడింగ్ గేర్‌లా అనిపించకుండా చాలా నేచురల్‌గా డైలీ రొటీన్‌లో కలిసిపోతాయి. Raida వెబ్‌సైట్ సూచించినట్టుగా ఒక సైజ్ తక్కువగా తీసుకుంటే బాగా సరిపోతాయి, వాడే సమయంలో ఇది నిజమేనని అనిపిస్తుంది. బ్రేకిన్ టైమ్ కూడా దాదాపుగా లేదు, రెండో రోజుకే ఫిట్ చాలా నేచురల్‌గా మారుతుంది.
సిటీ రైడర్లకు సూటబుల్
రైడా అర్బన్ ఆర్ షూస్ సిటీ రైడింగ్‌కు బాగా సరిపోతాయి. ఎక్కువగా నగరంలో కమ్యూటింగ్ చేయేవారికి ఇవి కంఫర్ట్ ఇస్తాయి. హైవేపై కూడా డీసెంట్‌గా పనికొస్తాయి. అయితే.. అధిక వేగంతో చేసే స్పిరిటెడ్ రైడింగ్, ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ఇవి సరిపోవు. కొన్ని బైక్‌లలో రియర్-సెట్ పెగ్స్ ఉంటే.. ఈ షూ పైభాగం షిన్ మీద కొద్దిగా డిగ్ అవుతుందనే చిన్న ఇబ్బంది ఉంటుంది.
వెంటిలేషన్
వెంటిలేషన్ విషయంలో UrbanR నిజంగా బెటర్‌గా పని చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లాంటి వేడి, ఉక్కపోత ఉన్న వాతావరణాల్లో కూడా ఈ మెష్ గాలి తీసుకునేలా పని చేస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే... ఏంకిల్, హీల్, టో ప్రాంతాల్లో రీ–ఇన్‌ఫోర్స్‌మెంట్ ఉంది. అంతేకాదు, SAS-TEC EN13634 రేటెడ్ ఏంకిల్ ఇన్సర్ట్స్ ఉండటం వీటిని నగర రైడింగ్‌కి మంచి ఆప్షన్‌గా నిలబెడుతుంది. టూరింగ్ బూట్స్‌లా హెవీ ప్రొటెక్షన్‌ను ఇవి ఇవ్వకపోయినా, డైలీ యూజ్‌కు సరిపడే స్థాయిలో ఉంటాయి.
గ్రిప్
లేసింగ్ సిస్టమ్‌లో ఉన్న ATOP డయల్ + వెల్క్రో స్ట్రాప్ ఉండడం వల్ల దీనిని వాడటం చాలా సులభం. గ్లోవ్స్ వేసుకుని కూడా ఒక చేతితో ఈ లేసింగ్ సిస్టమ్‌ను ఆపరేట్ చేయచ్చు. గ్రిప్ విషయానికి వస్తే, పొడి రోడ్డుపై బాగానే ఉంటుంది. అయితే తడి టైల్స్, పేవ్‌మెంట్‌లపై గ్రిప్ అంతగా కనిపించదు.
వర్షాకాలంలో..
నీటి నిరోధకత విషయంలో, ఇవి కేవలం చిన్నపాటి జల్లుల వరకు మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎక్కువ వర్షం పడితే నీరు లోపలికి వస్తుంది.
బిల్డ్ క్వాలిటీ మాత్రం ఆశ్చర్యంగా బాగుంది. ఈ నెల రోజుల వాడకంలో ఎక్కడా స్కఫ్స్ రావడం, మెటీరియల్ ఊడిపోవడం లాంటి సమస్యలు కనిపించలేదు. క్లీన్ చేయడమూ చాలా సులభం.
ధర
వీటి ధర 6,999 రూపాయలు. ఈ ధరకు ఇవి చాలా విలువైన ఆప్షన్. మార్కెట్లో ఉన్న మరిన్ని రైడింగ్ బూట్స్ ఈ ధరకు రెట్టింపు రేటుకు గానీ దొరుకడం లేదు. స్నీకర్ లాంటి లుక్, కంఫర్ట్‌తో పాటు సరైన రైడింగ్ ప్రొటెక్షన్ కూడా ఈ షూస్ ఇస్తున్నాయి.
పై భాగం కొంచెం బల్బీగా కనిపించడం వల్ల లుక్ కొద్దిగా హెవీగా అనిపిస్తుందనేది ఒక చిన్న ఫిర్యాదు. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. రోజూ బైక్‌పై తిరిగే కమ్యూటర్లు, క్యాజువల్ రైడర్లు, ఎక్కువ సేపు నడిచే వారికి Raida UrbanR రైడింగ్ షూస్ ఒక మంచి, ప్రాక్టికల్ ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















