Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?
పోర్షే తన రూ.1.21 కోట్ల విలువ చేసే పనమేరా కారును రూ.14 లక్షలకే లిస్ట్ చేసింది.
![Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది? Porsche Panamera Listed For 124k cny By Mistake Company Gave Clarity Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/98731373098080d006834ebed1534a781675340078902252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Porsche Panamera: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత చవకైన పోర్షే కారు ధర కూడా రూ.80 లక్షలకు పైనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.15 లక్షలకే పోర్షేను కొనుగోలు చేయవచ్చని స్వయంగా కంపెనీ యాడ్ ఇస్తే బుకింగ్స్ కోసం జనాలు ఎగబడ్డారు. పోర్షేను కేవలం రూ.15 లక్షలకే కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రకటన విడుదల చేసింది. వెంటనే లక్షల మంది ఆ కారును బుక్ చేసుకున్నారు. అయితే కంపెనీ అందించిన ప్రకటనలో తప్పుడు ధర ఉందని గ్రహించి, బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు క్షమాపణలు చెప్పి, వారి బుకింగ్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసింది. అయితే, ప్రకటన ఇచ్చిన కారు వాస్తవ ధర రూ.1.21 కోట్లు.
ఉత్తర చైనాలోని యిన్‌చువాన్ అనే నగరంలోని ఒక పోర్షే డీలర్ 124,000 యువాన్లకు (సుమారు రూ.15.15 లక్షలు) అత్యంత ప్రజాదరణ పొందిన 2023 పనమేరా మోడల్‌ను లిస్ట్ చేశారు. ఇది కారు అసలు ధరలో ఎనిమిదో వంతు మాత్రమే. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం ఈ రిపోర్టు చూసిన వెంటనే, ఈ కారును కొనడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. డీలర్‌ను కూడా చేరుకున్నారు, అప్పుడు ఇది నకిలీ ప్రకటన అని ప్రజలకు తెలిసింది.
క్షమాపణ చెప్పిన పోర్షే
ఈ ప్రకటన చూసి వందలాది మంది ఈ కారు కోసం బుకింగ్స్ చేయడంతోపాటు 911 యువాన్ల అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. "ఈ లిస్టింగ్ రిటైల్ ధర కంపెనీ చేసిన తీవ్రమైన పొరపాటు." అని పోర్షే వెల్లడించింది. పోర్షే కంపెనీ ప్రతినిధులు ఈ ప్రకటనను వెంటనే తొలగించారు. అయితే ఇప్పటికీ పోర్షేను చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో చాలా ట్రోల్ చేస్తున్నారు.
పోర్షే పనమెరా 8 2899 cc, 2999 cc, 3996 cc, 2894 cc పెట్రోల్ ఇంజిన్ మోడల్స్‌లో లాంచ్ అయింది. వీటన్నింటితో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి పనమేరా మైలేజ్ 10.75 లీటర్ల వరకు ఉండనుంది. పనమేరా ఒక ఫైవ్ సీటర్ కారు.
పోర్షే ఇటీవలే మనదేశంలో రెండు కార్లను లాంచ్ చేసింది. వీటిలో ఒకటి కొత్త మకాన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కాగా, రెండోది టేకాన్ ఎలక్ట్రిక్ క్రాస్ టురిస్మో/స్పోర్ట్స్ సెడాన్. ఇందులో మకాన్ మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ. దానికి కొన్ని అప్‌గ్రేడ్స్ చేసి దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చిన మకాన్ రేంజ్‌లో మకాన్, మకాన్ ఎస్, మకాన్ జీటీఎస్ కార్లు ఉన్నాయి.
మకాన్ జీటీఎస్‌లో 195 కేడబ్ల్యూ టర్బో చార్జ్‌డ్ 4 సిలిండర్ ఇంజిన్ అందించారు. మకాన్ ఎస్‌లో 2.9 లీటర్ వీ6 డెవలపింగ్ 280 కేడబ్ల్యూ అయితే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలోనే అందుకోగలదు. అన్నిటికంటే వేగవంతమైన మకాన్ జీటీఎస్‌లో 2.9 లీటర్ వీ6 ఇంజిన్ అందించారు. దీని టాప్ స్పీడ్ 272 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో సెవన్ స్పీడ్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లు ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
దీని ఎక్స్‌టీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌ను ఇందులో అందించారు. ఈ కొత్త మకాన్ ధర రూ.83.21 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ముందు వెర్షన్‌తో పోలిస్తే మరింత స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌ను ఇందులో అందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)