అన్వేషించండి

టోల్‌ చెల్లింపులను పెండింగ్‌లో పెడితే తోలు తీస్తారు - మీ వెహికల్‌ను ట్రాన్స్‌ఫర్‌ ఆపేస్తారు, ఎలాంటి పర్మిట్లు ఇవ్వరు

పెండింగ్‌ టోల్‌ డ్యూస్‌ ఉంటే వాహన ట్రాన్స్‌ఫర్‌, ఫిట్‌నెస్‌, పర్మిట్‌ రెన్యువల్‌ కుదరదు. MLFF టోల్‌ సిస్టమ్‌ అమలుకు ముందు కేంద్రం కొత్త రోడ్డు నిబంధనలు తీసుకువచ్చింది.

New Toll Gate Rules India: మన దేశంలోని జాతీయ రహదారులపై బారియర్‌-లెస్‌ టోలింగ్‌ సిస్టమ్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వాహనదారుల కోసం కీలకమైన & కఠినమైన కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద పెండింగ్‌ టోల్‌ బకాయిలు ఉంటే, ఆ వాహనానికి RC ట్రాన్స్‌ఫర్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పర్మిట్‌ రెన్యువల్‌ లాంటి సర్వీసులు అందుబాటులో ఉండవు.

కొత్త నిబంధనలు చేరుస్తూ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ‘Central Motor Vehicles Rules, 2026’లో మార్పులు చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించిన వాహనాల టోల్‌ ఫీజులు వసూలు చేయడంలో పారదర్శకత తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.

టోల్‌ బకాయిలు ఉంటే ఏమవుతుంది?

కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపిన ప్రకారం, ఏ వాహనానికైనా టోల్‌ బకాయిలు ఉంటే 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌' (No Objection Certificate / NOC) ఇవ్వరు. NOC లేకపోతే వాహనాన్ని మరో రాష్ట్రానికి లేదా జిల్లాకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అలాగే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌, వాణిజ్య వాహనాలకు పర్మిట్‌ రెన్యువల్‌ వంటి పనులు కూడా నిలిచిపోతాయి.

"అన్‌పెయిడ్‌ యూజర్‌ ఫీజ్‌"కు కొత్త నిర్వచనం

సవరించిన నిబంధనల్లో, "అన్‌పెయిడ్‌ యూజర్‌ ఫీజ్‌" ‍(Unpaid User Fee) అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ETC) సిస్టమ్‌ ద్వారా వాహనం జాతీయ రహదారి సెక్షన్‌ను దాటినట్లు రికార్డ్‌ అయ్యి, సంబంధిత టోల్‌ ఫీజు చెల్లించకపోతే, దాన్ని పెండింగ్‌ టోల్‌గా పరిగణిస్తారు.

Form 28లో కీలక మార్పులు

వాహన బదిలీకి అవసరమైన Form 28లో కూడా మార్పులు చేశారు. ఇకపై దరఖాస్తుదారు తన వాహనంపై ఏవైనా పెండింగ్‌ టోల్‌ డిమాండ్లు ఉన్నాయో, లేదో చెప్పాలి, ఉంటే వాటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. డిజిటల్‌ విధానాలను ప్రోత్సహిస్తూ, Form 28ను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌గా జారీ చేసే సౌకర్యం కూడా కల్పించారు.

MLFF టోల్‌ సిస్టమ్‌ ఏమిటి?

రాబోయే రోజుల్లో అమల్లోకి రానున్న మల్టీ-లేన్‌ ఫ్రీ ఫ్లో (Multi-Lane Free Flow / MLFF) టోల్‌ సిస్టమ్‌ ద్వారా వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ANPR కెమెరాలు, AI అనలిటిక్స్‌, FASTag RFID సిస్టమ్‌ సహాయంతో వాహనాన్ని గుర్తించి, టోల్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు

టోల్‌ చెల్లించని వాహనదారులకు ఈ-నోటీసులు పంపిస్తారు. అవి కూడా పట్టించుకోకపోతే FASTag సస్పెన్షన్‌, VAHAN సంబంధిత పెనాల్టీలు విధించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఏమంటోంది?

జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ నిబంధనలు కీలకమని కేంద్రం చెబుతోంది. 2026లో దేశవ్యాప్తంగా బారియర్‌-లెస్‌ టోలింగ్‌ను ప్రాధాన్యత అంశంగా అమలు చేస్తామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇప్పటికే స్పష్టం చేశారు. టోల్‌ వసూలు ఖర్చు ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గుతుందని కూడా ఆయన వెల్లడించారు.

వాహనదారులు ఏం చేయాలి?

మీ వాహనానికి సంబంధించిన FASTag టోల్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవడం, పెండింగ్‌ బకాయిలు ఉంటే వెంటనే క్లియర్‌ చేయడం ఇప్పుడు చాలా అవసరం. లేదంటే భవిష్యత్తులో వాహన బదిలీ, ఫిట్‌నెస్‌, పర్మిట్‌ విషయంలో సమస్యలు తప్పవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget