అన్వేషించండి

నిస్సాన్‌ గ్రావైట్‌ రివీల్‌ డేట్‌ ఫిక్స్‌: 7 సీటర్‌ MPVల్లో లేటెస్ట్‌ ఆప్షన్‌, రెనాల్ట్‌ ట్రైబర్‌కు కాపీ మోడల్‌

నిస్సాన్‌ గ్రావైట్‌ ఫిబ్రవరి 17న రివీల్‌ కానుంది. ట్రైబర్‌ ఆధారంగా వచ్చే ఈ 7 సీటర్‌ MPVలో ఫీచర్లు, ధర అంచనాలు, ఇంజిన్‌ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త నిస్సాన్ గ్రావైట్ 7-సీటర్ MPV ఫిబ్రవరి 17, 2026న విడుదల.
  • రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా, నిస్సాన్ ప్రత్యేక డిజైన్ తో రానుంది.
  • 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఫీచర్లు అందించబడతాయి.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, భద్రతా ఫీచర్లు మెరుగుపరచబడ్డాయి.

Nissan Gravite Launch Date: భారత ఆటో మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిస్సాన్‌ కీలక అడుగు వేస్తోంది. 7-సీటర్‌ MPV సెగ్మెంట్‌కు కొత్త నిస్సాన్‌ గ్రావైట్‌ (Nissan Gravite)ను పరిచయం చేయబోతోంది. జనవరిలోనే రివీల్‌ కావాల్సిన ఈ కారు, కొన్ని కారణాల వల్ల ఆ తేదీని తప్పించుకుంది. ఇప్పుడు, అధికారికంగా ఫిబ్రవరి 17, 2026న ప్రపంచానికి పరిచయం కానుంది. ఈ విషయాన్ని నిస్సాన్‌ తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరించింది.

ట్రైబర్‌ ఆధారంగా కొత్త MPV

నిస్సాన్‌ గ్రావైట్‌ ఒక కాంపాక్ట్‌ 7 సీటర్‌ MPVగా మార్కెట్‌లోకి రానుంది. ఇది రెనాల్ట్‌ ట్రైబర్‌తో ప్లాట్‌ఫామ్‌, ఇంజిన్‌ పరంగా చాలా సమానంగా ఉంటుంది. బాడ్జ్‌ ఇంజినీరింగ్‌ మోడల్‌ అయినప్పటికీ, డిజైన్‌, బ్రాండ్‌ ఐడెంటిటీ విషయంలో నిస్సాన్‌ తన ప్రత్యేకత చూపించేందుకు సిద్ధమైంది. ఈ సెగ్మెంట్‌లో ట్రైబర్‌కు ఇది నేరుగా పోటీ ఇస్తుంది.

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో నిస్సాన్‌ టచ్‌

గ్రావైట్‌ సబ్‌-4 మీటర్‌ పొడవుతో వస్తుంది. సైడ్‌ ప్రొఫైల్‌ చూస్తే ట్రైబర్‌ సిల్యుయెట్‌ గుర్తుకు వచ్చినా, ఫ్రంట్‌ డిజైన్‌లో మాత్రం నిస్సాన్‌ స్టైలింగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఆకర్షణగా V-Motion ఫ్రంట్‌ గ్రిల్‌, స్పోర్టీ లుక్‌ ఉన్న లోయర్‌ బంపర్‌, సిల్వర్‌ హైలైట్స్‌, కార్నర్లలో అమర్చిన ఫాగ్‌ ల్యాంప్స్‌ కనిపిస్తాయి. బోనెట్‌పై బోల్డ్‌గా GRAVITE బ్రాండింగ్‌ ఉండగా, హెడ్‌ల్యాంప్స్‌లో ట్విన్‌ స్ట్రిప్‌ LED DRLs ఇస్తారు.

వెనుక భాగంలో పార్ట్‌-LED టెయిల్‌ ల్యాంప్స్‌, బ్లాక్‌ ప్లాస్టిక్‌తో కూడిన స్పోర్టీ బంపర్‌, సిల్వర్‌ గార్నిష్‌ ఉంటాయి. టాప్‌ వేరియంట్‌లో టూ-టోన్‌ అలాయ్‌ వీల్స్‌, సిల్వర్‌ రూఫ్‌ రైల్స్‌ కూడా ఇచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లు & ఇంటీరియర్‌

గ్రావైట్‌ ఫీచర్ల లిస్ట్‌ ట్రైబర్‌కు దగ్గరగానే ఉంటుంది. టాప్‌ ట్రిమ్‌లో 7 ఇంచుల డిజిటల్‌ క్లస్టర్‌, 8 ఇంచుల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto వంటి ఫీచర్లు ఆశించవచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, క్రూజ్‌ కంట్రోల్‌, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌, టూ-టోన్‌ ఇంటీరియర్‌ థీమ్‌ కూడా ఉండొచ్చు.

ఇది 5+2 సీటింగ్‌ లేఅవుట్‌తో మూడు వరుసల సీట్లలో వస్తుంది. అన్ని వరుసల్లో రియర్‌ AC వెంట్స్‌, మల్టిపుల్‌ ఛార్జింగ్‌ పోర్ట్స్‌, కప్‌ హోల్డర్స్‌, స్టోరేజ్‌ పాకెట్లు ఇవ్వాలని నిస్సాన్‌ ప్లాన్‌ చేస్తోంది.

భద్రతపై ఫోకస్‌

భద్రత విషయంలో కూడా గ్రావైట్‌ బలంగా ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ యాంకర్స్‌, ముందు-వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, రివర్సింగ్‌ కెమెరా వంటి ఫీచర్లు అందించనున్నారు.

ఇంజిన్‌ & ధర అంచనాలు

గ్రావైట్‌లో రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఉన్న అదే 1.0 లీటర్‌ మూడు సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 72hp శక్తి, 96Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌, 5 స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు లభించొచ్చు. డీలర్‌ ఫిట్‌ CNG కిట్‌ కూడా ఇవ్వవచ్చని సమాచారం.

ధర విషయానికి వస్తే, నిస్సాన్‌ గ్రావైట్‌ రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండొచ్చని అంచనా.

భవిష్యత్‌ ప్లాన్స్‌

నిస్సాన్‌ 2027 నాటికి భారత మార్కెట్‌లో ఇంకా రెండు కొత్త కార్లు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తోంది. అందులో గ్రావైట్‌ కీలక పాత్ర పోషించనుంది.

మొత్తం మీద, కుటుంబ అవసరాలకు సరిపడే బడ్జెట్‌ 7 సీటర్‌ MPV కోసం చూస్తున్న వారికి నిస్సాన్‌ గ్రావైట్‌ ఒక ఆసక్తికరమైన కొత్త ఎంపికగా మారనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

కొత్త నిస్సాన్ గ్రావైట్ ఎప్పుడు విడుదల కానుంది?

కొత్త నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17, 2026న ప్రపంచానికి పరిచయం కానుంది. ఈ విషయాన్ని నిస్సాన్ అధికారికంగా ధృవీకరించింది.

నిస్సాన్ గ్రావైట్ ఏ కారుతో సమానంగా ఉంటుంది?

నిస్సాన్ గ్రావైట్ రెనాల్ట్ ట్రైబర్ తో ప్లాట్ఫామ్ మరియు ఇంజిన్ పరంగా చాలా సమానంగా ఉంటుంది. ఇది ట్రైబర్ కి నేరుగా పోటీ ఇస్తుంది.

నిస్సాన్ గ్రావైట్ లో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు?

గ్రావైట్ లో 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండవచ్చు.

నిస్సాన్ గ్రావైట్ లో ఏ ఇంజిన్ ఉంటుంది?

గ్రావైట్ లో రెనాల్ట్ ట్రైబర్ లో ఉన్న 1.0 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget