అన్వేషించండి

FASTag Rule: హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!

FASTag Rule: ఏప్రిల్ 10 నుంచి జాతీయ రహదారులపై నగదు రహిత టోల్ వసూళ్లు ప్రారంభం కానున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనదారులకు యూపీఐ ద్వారా అదనపు ఛార్జీలు, కొత్త నిబంధనల పూర్తి వివరాలు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేస్తారు.
  • ఫాస్టాగ్ తప్పనిసరి, లేకుంటే యూపీఐ ద్వారా అధిక రుసుము చెల్లించాలి.
  • చెల్లింపులు నిరాకరిస్తే, ప్రవేశం నిరాకరించి, రెట్టింపు జరిమానా విధిస్తారు.
  • ప్రైవేట్ వాహనాలకు ID కార్డుల ద్వారా టోల్ మినహాయింపు రద్దు చేస్తారు.

FASTag Rule: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సమాచారం అందించింది. ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరం చేయడానికి ఈ డిజిటల్ విప్లవాన్ని తీసుకువస్తోంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

నగదు చెల్లింపులు ఇక చెల్లవు..

ఏప్రిల్ 10 నుంచి టోల్ బూత్‌ల వద్ద కరెన్సీ నోట్లను తీసుకోరు. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి. ఒకవేళ మీ కారుకు ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా యూపీఐ (UPI) ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, ఇది మీకు ఖరీదైన వ్యవహారం కానుంది. ఫాస్టాగ్ లేకుండా యూపీఐ ద్వారా టోల్ కడితే, సాధారణ ధర కంటే 25 శాతం అదనపు బాదుడు ఉంటుంది. అంటే ఫాస్టాగ్ ఉంటేనే మీకు తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగుతుంది.

చెల్లించకపోతే రెట్టింపు జరిమానా..

ఒకవేళ వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ రెండింటి ద్వారా కూడా చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తే, వారికి టోల్ ప్లాజాలోకి ప్రవేశం నిరాకరించబడుతుంది. అదనంగా సదరు వాహనానికి ఈ-నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. మూడు రోజుల లోపు ఆ బకాయిలు చెల్లించకపోతే, జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఐడీ కార్డుల వెయివర్లకు చెక్..

ఇప్పటివరకు చాలామంది ప్రభుత్వ ఐడీ కార్డులు చూపించి ప్రైవేట్ వాహనాల్లో టోల్ మినహాయింపు పొందే ప్రయత్నం చేసేవారు. ఏప్రిల్ 10 నుండి అటువంటి పద్ధతులకు స్వస్తి పలకనున్నారు. కేవలం అధికారికంగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' (Exempted FASTag) కలిగిన వాహనాలకు మాత్రమే టోల్ మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద జరిగే అనవసర వాగ్వాదాలు తగ్గుతాయని ఎన్‌హెచ్ఏఐ భావిస్తోంది.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (Annual Pass) అప్డేట్..

తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం రూ. 3,075 ధరతో యాన్యువల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ పాస్ ద్వారా ఏడాది కాలంలో లేదా 200 సార్లు టోల్ ప్లాజాల నుండి వెళ్లవచ్చు. వ్యక్తిగత నాన్-కమర్షియల్ వాహనదారులకు ఇది ఎంతో పొదుపుగా ఉంటుంది. దీనిని రాజ్‌మార్గ్ యాత్ర యాప్ (Rajmarg Yatra App) లేదా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు. పేమెంట్ చేసిన 24 గంటల్లోనే ఈ పాస్ మీ ఫాస్టాగ్‌కు లింక్ అవుతుంది. హైవే ప్రయాణం చేసే ముందు మీ ఫాస్టాగ్ రిఛార్జ్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏప్రిల్ 10 నుండి చిల్లర దొరకలేదనే ఇబ్బందులు ఉండవు, కానీ డిజిటల్ పేమెంట్ సిద్ధంగా ఉంచుకోవాలని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలు నిలిపివేయడం వెనుక కారణం ఏమిటి?

హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద సమయం ఆదా అవుతుంది.

ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ఎలా చెల్లించాలి?

ఫాస్టాగ్ లేకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా, యూపీఐ (UPI) ద్వారా టోల్ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, దీనికి సాధారణ ధర కంటే 25% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు నిరాకరిస్తే ఏమవుతుంది?

చెల్లింపులు నిరాకరిస్తే, టోల్ ప్లాజాలోకి ప్రవేశం నిరాకరించబడుతుంది. మూడు రోజుల్లోపు చెల్లించకపోతే, జరిమానా రెట్టింపు అవుతుంది.

ఐడీ కార్డుల చూపించి టోల్ మినహాయింపు పొందే విధానం కొనసాగుతుందా?

ఏప్రిల్ 10 నుండి ఈ పద్ధతి నిలిచిపోతుంది. కేవలం 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' కలిగిన వాహనాలకు మాత్రమే టోల్ మినహాయింపు లభిస్తుంది.

తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి ఏమైనా ఆదా మార్గాలున్నాయా?

అవును, రూ. 3,075 ధరతో వార్షిక పాస్ అందుబాటులో ఉంది. ఇది ఏడాది కాలంలో 200 సార్లు టోల్ ప్లాజాల నుండి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget