అన్వేషించండి

భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు

Skoda Kushaq Facelift 2026 | స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. దీని డిజైన్, ఇంజిన్, ధరలకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

స్కోడా కంపెనీ తన పాపులర్ SUV కుషాక్ (Skoda Kushaq) కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ SUV 5 వేర్వేరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కస్టమర్లకు మాన్యువల్,  ఆటోమేటిక్ అనే రెండు ఆప్షన్లు లభిస్తాయి. స్కోడా కంపెనీ ఈసారి కారును గతంలో కంటే మోడ్రన్‌గా, ఫీచర్-లోడెడ్‌గా మార్చడంపై ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఇప్పుడు కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గతంలో కంటే స్టైలిష్ లుక్

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తే, దీని డిజైన్‌పై ప్రత్యేకంగా పని చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముందు భాగంలో కొత్త బంపర్, సన్నని హెడ్‌ల్యాంప్స్, DRLలతో కూడిన కనెక్టెడ్ లైట్ బార్ ఇచ్చారు. ఇది దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ కొత్త 17 అంగుళాల అలాయ్ వీల్స్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వెనుక భాగంలో కొత్త LED టెయిల్‌లైట్లు, సీక్వెన్షియల్ ఇండికేటర్లు, మెరిసే స్కోడా లోగో (Skoda Logo) ఇచ్చారు.

ఇంటీరియర్, ఫీచర్లు

ఈ స్కోడా SUV లోపలి డిజైన్ చాలా వరకు గతంలోలాగే ఉంది. కానీ ఇందులో కొన్ని కొత్త అప్‌డేట్‌లు ఇచ్చారు. కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్, బేజ్ ఇంటీరియర్ దీనికి ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. అతిపెద్ద మార్పు పనోరమిక్ సన్‌రూఫ్ (Panoramic Sunroof) ఈ కారులో చేర్చారు. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డిస్ప్లే, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, AI అసిస్టెంట్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇవి కాకుండా వెంటిలేటెడ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇచ్చారు. 

సేఫ్టీ, ఇంజిన్ వివరాలు

భద్రత విషయంలో స్కోడా కంపెనీ ఎక్కడా తగ్గలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV డ్రైవర్, ప్రయాణీకులు ఇద్దరికీ సురక్షితమైనదని కంపెనీ చెబుతోంది. ఇంజిన్ ఆప్షన్లు గతంలో ఉన్నట్లే ఉన్నాయి. ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 1.5 లీటర్ ఇంజిన్‌తో 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇది మెరుగైన పవర్, పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

ఏ కార్లకు పోటీ ఇస్తుంది

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ (Kia Seltos), హోండా ఎలివేట్, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. ఇవే కాకుండా వోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) కూడా దీనికి పెద్ద పోటీదారుగా మారింది.

1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్:

పవర్: 115 PS | టార్క్: 178 Nm

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మాన్యువల్ / 8-స్పీడ్ ఆటోమేటిక్

మైలేజీ: సుమారు 18.0 - 19.5 kmpl

1.5-లీటర్ TSI టర్బో పెట్రోల్:

పవర్: 150 PS | టార్క్: 250 Nm

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మాన్యువల్ / 7-స్పీడ్ DSG (DCT)

మైలేజీ: సుమారు 17.5 - 18.8 kmpl (ఇందులో యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ ఉండటంటో మైలేజీ మెరుగ్గా ఉంటుంది).

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!
కారు చిన్నదైనా ధర మాత్రం రూ.53.9 లక్షలు! మినీ కూపర్ SEలో అంత స్పెషల్ ఏముంది?
ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్‌ లాంచ్‌, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బిగ్‌ బైక్‌' హిమాలయన్ 750 లాంచ్.. ధర రూ.4.89 లక్షల నుంచి ప్రారంభం
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget