(Source: ECI/ABP News/ABP Majha)
Range Rover Velar Bookings: భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ బుకింగ్స్ షురూ, డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?
ఆటో మోబైల్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ బుకింగ్స్ మొదలు పెట్టింది. ఈ SUV డెలివరీలు సెప్టెంబర్ లో ప్రారంభం అవుతాయని కంపెనీ వెల్లడించింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లోకి సరికొత్త కారును తీసుకురాబోతోంది. రేంజ్ రోవర్ వెలార్ పేరుతో వినియోగదారుల చెంతకు చేర్చబోతోంది. తాజాగా ఈ కారు కోసం బుకింగ్స్ మొదలు పెట్టింది. సరికొత్త SUV బుకింగ్ కోసం ఆన్ లైన్ ద్వారా లేదంటే, JLR డీలర్లను సంప్రదించాలని కంపెనీ సూచించింది. వెలార్ డెలివరీలు సెప్టెంబర్ 2023 నుంచి మొదలవుతాయని ప్రకటించింది.
సరికొత్త మార్పులతో కొత్త వెలార్
కొత్త రేంజ్ రోవర్ వెలార్ రిఫ్రెష్ అప్పీల్ కోసం పలు రకాల మార్పులతో రూపొందింది. ఈ SUV బయటి లుక్ కోసం ఫ్రంట్ ఫాసియా తాజా గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త పిక్సెల్ LED హెడ్ లైట్లు, సిగ్నేచర్ డేటైమ్ రన్నింగ్ లైట్లను అద్భుతంగా పొందుపరిచింది. వెలార్ వెనుక భాగం కమాండింగ్ పొడవు, సమతుల్య ఉనికిని కలిగి ఉంటుంది. లోపలి వైపు కూడా సూపర్ స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటుంది. మూన్‌లైట్ క్రోమ్ యాక్సెంట్లు, షాడో గ్రే యాష్ వుడ్ వెనీర్ ట్రిమ్ ఫినిషర్లు, ఇంటీరియర్ ఎలిమెంట్ల క్యూరేటెడ్ సెలెక్షన్ తో పాటు రెండు న్యూ లెదర్ కలర్ ఆప్షన్లును కలిగి ఉంది. కార్వే, డీప్ గార్నెట్ తో రాబోతోంది. అదనంగా, మెటాలిక్ వారెసిన్ బ్లూ, ప్రీమియం మెటాలిక్ జాదర్ గ్రేలో అందుబాటులో ఉండనుంది.
అత్యధునిక ఫీచర్లు
వెలార్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. నెక్ట్స్ జెనెరేషన్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. చక్కటి 28.95 సెం.మీ (11.4-అంగుళాల) కర్వ్డ్ గ్లాస్ టచ్ స్క్రీన్‌తో రానుంది. పివి ప్రో సెంట్రలైజ్డ్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంటుంది. వైర్‌లెస్ డివైస్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తుంది. . దీనిని సెంటర్ కన్సోల్‌లోని ప్రత్యేక స్టోవేజ్ ఏరియాలో ఏర్పాటు చేశారు.
2 ఇంజిన్ ఎంపికల్లో కొత్త రేంజ్ రోవర్ వెలార్
కొత్త రేంజ్ రోవర్ వెలార్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. వెలార్ డైనమిక్ హెచ్‌ఎస్‌ఇలో అందుబాటులో ఉంటుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 184 kW (246 bhp)తో పాటు 365 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 150 kW శక్తిని అందించే 2.0 l ఇంజెనియం డీజిల్ ఇంజన్ (201 bhp), 420 Nm టార్క్ అందిస్తుంది.
సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ అత్యాధునికి డిజైన్ తో పాటు అద్భుతమైన లగ్జరీని అందిస్తున్నట్లు JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా వెల్లడించారు. "న్యూ రేంజ్ రోవర్ వెలార్ ట్రేడ్‌మార్క్ రేంజ్ రోవర్ రిఫైన్‌మెంట్ కు సంబంధించి సరికొత్త సాంకేతికత, కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. సంపూర్ణంగా ఆప్టిమైజ్ చేయబడిన అధునాతన సొబగులతో రాబోతుంది. వినియోగదారులకు మరింత చక్కటి ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది” అని తెలిపారు.
Read Also: వర్షంలో కారు నడుపుతున్నారా? అయితే, కచ్చితంగా ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial