(Source: ECI/ABP News/ABP Majha)
Upcoming Cars: ఈ కార్లు కొనాలనుకుంటున్నారా? కొన్నాళ్లు ఆగండి - పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త మోడల్స్!
త్వరలో లాంచ్ కానున్న హ్యుండాయ్ కొత్త క్రెటా, వెర్నా, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ల్లో పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అందించనున్నారు.
Hyundai Cars Engine Update: ప్రముఖ వాహన తయారీదారు కంపెనీ హ్యుండాయ్ మోటార్ తన రాబోయే కొత్త తరం వెర్నా సెడాన్‌లో 160 PS పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అందించనుందని తెలిపింది. దీనితో పాటు ఇదే ఇంజన్ హ్యుండాయ్ కొత్త క్రెటా, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో కూడా కనిపిస్తుంది.
1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నిలిపివేత
హ్యుండాయ్ మోటార్ ఇప్పటికే తన కార్లలో కనిపించే 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది క్రెటా, కేరెన్స్, సెల్టోస్‌లలో కనిపిస్గుంది. BS6 స్టేజ్ 2కి సంబంధించిన ఆర్డీఈ (రియల్ డ్రైవింగ్ ఎమిషన్) నిబంధనలను అందుకోలేకపోవడమే ఈ ఇంజిన్‌ను నిలిపివేయడానికి కారణం. ఈ ఇంజన్ 140 PS, 242 Nm అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త 1.5L ఇంజిన్, 1.4L ఇంజిన్ కంటే శక్తివంతమైనది. 19PS/11Nm అధిక అవుట్‌పుట్‌ను పొందుతుంది. అలాగే ఈ ఇంజన్ ఫోక్స్‌వ్యాగన్ 1.5L TSI ఇంజన్ కంటే 9PS, 3Nm ఎక్కువ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. అయితే దాని ఇండియా స్పెక్ వెర్షన్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కనిపించదు. ఈ ఇంజన్‌తో 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తున్నారు. కొత్త వెర్నాలో 1.5L, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా లభిస్తుంది. ఇది 115PS, 145Nmను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్ వేరియంట్‌తో పెయిర్ చేయవచ్చు. IVT లేదా CVT ట్రాన్స్‌మిషన్ ఎంపిక చేసుకోవచ్చు.
కొత్త హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్
హ్యుండాయ్ మోటార్ తన క్రెటా ఎస్‌యూవీని కూడా అప్‌డేట్ చేయబోతుంది. ఇది 2024 ప్రారంభంలో విడుదల కానుందని భావిస్తున్నారు. కొత్త క్రెటా ADAS సిస్టమ్‌తో సహా చాలా పెద్ద అప్‌గ్రేడ్‌లతో రాబోతుంది. అదే సమయంలో కియా మోటార్స్ తన ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ SUVని కూడా మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ ఏడాది దీపావళి నాటికి వీటి లాంచింగ్ జరిగే అవకాశం ఉంది. సెల్టోస్ అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్‌తో కూడా మార్కెట్లోకి రావచ్చు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించవచ్చు.
హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2023 జనవరిలో 45,799 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 7,853 యూనిట్లు పెరిగింది. అంటే నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 20.69 శాతం వృద్ధి కనిపించింది. 2022 జనవరిలో కంపెనీ మొత్తంగా 37,946 యూనిట్లను విక్రయించింది.
Kia Motors India Pvt Ltd 2023 జనవరిలో 19,297 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 9,473 యూనిట్లు పెరిగింది. ఇది నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 96.42 శాతం వృద్ధి కనిపించింది. 2022 జనవరిలో కంపెనీ 9,824 యూనిట్లను విక్రయించింది.
హ్యుండాయ్ ఇటీవలే అయోనిక్ 5 అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కారు ఒక్క ఛార్జ్ తో 631 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తోంది. దీని బ్యాటరీని 350 KW డీసీ ఫాస్ట్ చార్జర్ తో ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు హ్యుండాయ్ అయోనిక్ 5 చార్జింగ్ అవుతుంది.