అన్వేషించండి

Most Used Engines: ఇండియన్‌ కార్లలో అత్యధికంగా వాడుతున్న ఇంజిన్లు: ఏ కంపెనీ ఏ మోడల్‌లో ఏ ఇంజిన్ ఉపయోగిస్తోంది?

భారత మార్కెట్లో ₹30 లక్షల లోపు కార్లలో ఎక్కువగా వాడుతున్న ఇంజిన్ల జాబితా ఇది. మారుతి, హ్యుందాయ్‌, కియా, మహీంద్రా, టయోటా, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ తయారు చేసిన ప్రముఖ పవర్‌ట్రైన్ల వివరాలు.

Most shared engines in indian cars: మన కార్ల మార్కెట్లో, ఇంజిన్ల అభివృద్ధి ఒక ఖరీదైన పని. ఒక ఇంజిన్‌ను పూర్తిగా కొత్తగా రూపకల్పన చేయడానికి కంపెనీలు ఏళ్ల సమయాన్ని, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాయి. అందుకే ఒకే బ్రాండ్‌లోని పలు మోడళ్లలో ఒకే ఇంజిన్‌ను ఉపయోగించడం సాధారణం. అంతేకాదు, రెండు కంపెనీలు ఒక ఒప్పందానికి వచ్చి, ఒకే ఇంజిన్‌ను వాటి మోడళ్లలో వినియోగించుకోవడం (పంచుకోవడం) కూడా కొన్నిసార్లు జరుగుతోంది. ₹30 లక్షల లోపు మాస్‌ మార్కెట్ కార్లలో ఎక్కువగా పంచుకున్న ఇంజిన్ల జాబితాను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1. Maruti Suzuki K15C - అత్యధికంగా షేర్‌ చేసిన ఇంజిన్‌లలో ఒకటి

Brezza, Grand Vitara, Victoris, Ertiga, XL6, Toyota Hyryder, Toyota Rumion - మొత్తం 7 మోడళ్లు ఈ ఇంజిన్‌పై నడుస్తాయి.

1,462cc నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ ఇది. పెట్రోల్‌ & CNG రెండింటిలో అందుబాటులో ఉంటుంది.
పెట్రోల్‌ వేరియంట్‌: 103hp, 139Nm
CNG వేరియంట్‌: 88hp, 122Nm
మైలేజ్ విషయంలో Victoris ముందు ఉంటుంది.
5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT, కొన్ని మోడళ్లలో AWD కూడా లభ్యం.

2. Maruti Suzuki K12N - చిన్న కార్లలో అత్యంత ప్రజాదరణ

Wagon R, Baleno, Fronx, Eeco, Toyota Glanza, Taisor - మొత్తం 6 మోడళ్లు ఈ 1.2L ఇంజిన్ వాడుతున్నాయి.

పెట్రోల్‌: 91hp, 114Nm
CNG: 71hp, 106Nm
మైలేజ్‌ 24.43kpl వరకు.
5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి.

3. Fiat 2.0 Multijet - SUV సెగ్మెంట్‌లో రాజు

MG Hector, Hector Plus, Tata Harrier, Safari, Jeep Compass - 6 మోడళ్ల హార్ట్ ఇదే.

170hp, 350Nm పవర్‌ ఇచ్చే ఈ 2.0L టర్బో డీజిల్‌ భారత SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంజిన్.
6MT, 6AT, 9AT గేర్‌బాక్స్‌లు లభ్యం.
Compass‌లో AWD కూడా లభిస్తుంది.

4. Hyundai - Kia 1.5L T-GDI - టర్బో పెట్రోల్‌ లైనప్‌లో స్టార్

Hyundai Verna, Creta, Alcazar, Kia Seltos, Carens Clavis - మొత్తం 5 మోడళ్లు.

160hp, 253Nm ఇచ్చే ఈ ఇంజిన్ స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి.
6MT, IVT, 7DCT ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

5. Hyundai - Kia 1.5L Smartstream NA

Verna, Creta, Kia Seltos, Carens Clavis - 4 మోడళ్లు.

115hp, 144Nm ఇచ్చే స్మూత్‌ & రిలయబుల్ ఇంజిన్‌.
MT, IVT ట్రాన్స్‌మిషన్‌లు లభ్యం.

6. Hyundai - Kia U2 CRDI 1.5L డీజిల్‌

Creta, Alcazar, Seltos, Sonet - 4 మోడళ్లు.

116hp, 250Nm.
డీజిల్‌ ప్రేమికులకు ఈ ఇంజిన్ ఇంకా బలమైన ఎంపిక.

7. Mahindra 2.2L mHawk - బలమైన డీజిల్ ఇంజిన్

Scorpio N, Scorpio Classic, Thar, Thar Roxx - 4 మోడళ్లు.

అత్యధికంగా 172hp, 400Nm వరకు పవర్‌.
RWD, 4WD రెండు లభ్యం.

8. Volkswagen - Skoda TSI Engines (1.0 & 1.5)

Slavia, Virtus, Kushaq, Taigun - 4 మోడళ్లు.

1.0 TSI: 115hp, 178Nm
1.5 TSI: 150hp, 250Nm

స్మూత్ పెర్ఫార్మెన్స్ & క్విక్ రెస్పాన్స్ వీటి ప్రత్యేకత.

9. Mahindra 2.0L mStallion

Thar, Roxx, Scorpio N - 3 మోడళ్లు.

150 - 200hp వరకు భారీ పవర్‌.
ఆఫ్‌-రోడింగ్ అభిమానులకు ఫేవరెట్‌ ఇంజిన్‌లలో ఒకటి.

10. Maruti Suzuki K10C - చిన్న కార్లకు సరిగ్గా సరిపోయే ఇంజిన్

Wagon R, S-Presso, Celerio - 3 మోడళ్లు.

998cc ఇంజిన్‌ 69hp వరకు పవర్‌.
మెత్తని డ్రైవింగ్‌, అత్యుత్తమ మైలేజ్‌ ప్రత్యేకత.

11. Maruti Suzuki Z12E 

Swift & Dzire - 2 మోడళ్లు.

82hp, 112Nm ఇచ్చే ఈ ఇంజిన్‌ పెట్రోల్‌ వేరియంట్‌లో మంచి పనితీరు అందిస్తుంది.
AMT కూడా లభ్యం.

12. Toyota 1.5L TNGA Hybrid

Grand Vitara Hybrid, Hyryder Hybrid - 2 మోడళ్లు.

అద్భుతమైన మైలేజ్‌, సైలెంట్ డ్రైవ్.

13. Toyota 2.0L TNGA Hybrid

Invicto, Innova Hycross - 2 మోడళ్లు.

189hp పవర్‌, 22.16kpl వరకు మైలేజ్‌.

14. Maruti 1.0L K-Series Turbo

Fronx, Taisor - 2 మోడళ్లు.

100hp, 148Nm పెట్రోల్‌ టర్బో ఇంజిన్.
ఫన్-టు-డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌.

ఈ ఇంజిన్‌ల షేరింగ్‌ కారణంగా కంపెనీలకు చాలా ఖర్చు మిగులుతుంది. దీనివల్ల ప్రజలకు అందుబాటు ధరలోనే మంచి మైలేజ్‌, పవర్‌ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget