Fuel Efficient 7 Seater: మధ్యతరగతి బడ్జెట్‌కు అందుబాటులో ఉన్న మంచి మైలేజీ ఇచ్చే 7 సీటర్ కార్లు ఇవే!
Fuel Efficient 7 Seater Cars: మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ప్రయాణించేందుకు తక్కువ బడ్జెట్‌లో కార్లు వెతుకుతున్నారు. అలాంటి వారు ఈ లిస్ట్ చూడండి.

Fuel Efficient 7 Seater Cars: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మధ్య కాలంలో 7 సీటర్ కార్ల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. కుటుంబమంతా కలిసి ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉండే వెహికల్స్‌ను చూస్తున్నారు. అలాంటి వారి కోసం మరిన్ని మోడల్స్ గురించి ఈ స్టోరీలో చూద్దాం. పెరుగుతున్న ఖర్చులు, ట్రాఫిక్ ఇబ్బందులు, అన్నింటినీ బేరీజు వేసుకొని ఖర్చు పెరిగిపోకుండా నెలవారి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండే బడ్జెట్‌లో కార్లను కొనేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. అందే టైంలో ఇంధనం ఖర్చును కూడా పొదుపు చేసేందునేందుకు మైలేజ్‌ను చూస్తున్నారు. ఏడుగురు కూర్చునేందుకు విశాలంగా ఉంటూ బడ్జెట్‌లో అందుబాటులో ఉండే ధరల్లో మీకు కొన్ని కార్ల మోడల్స్ ఇక్కడ ఇస్తున్నాం.
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)
మారుతి సుజుకి ఎర్టిగా మీకు 8.70 నుంచి 13.10 లక్షల రూపాయల బడ్జెట్‌లో వచ్చేస్తుంది. మీరు హై ఎండ్‌కు వెళ్లాలన్నా బడ్జెట్ పెద్దగా పెరగదు. హైదరాబాద్‌లోని ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ 10.20 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. ఎర్టిగా అన్ని వేరియంట్స్‌లో లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ అయితే మీకు ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ వేరియంట్ లీటర్‌కు 26కిలోమీటర్ల మైలీజ్ ఇస్తుందని సంస్థ చెబుతుంది. పెట్రోల్ వేరియంట్‌లో దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో మూడు వరుస సీట్లు కూర్చోవడానికి విశాలంగా ఉంటాయి. లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, బూస్‌స్పేస్ బాగుంటుంది. 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాక్‌లు, ఏబీఎస్‌తో ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మహీంద్రా బొలెరో (Mahindra Bolero)
మహీంద్రా బొలెరో కేవలం డీజిల్ వేరియంట్‌లోనే లభిస్తుంది. 11.86 లక్షల నుంచి 13.61 లక్షల వరకు ఆన్‌రోడ్ ప్రైస్‌కు లభిస్తుంది. ఇది లీటర్‌కు 16 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 7 సీటర్ డీజిల్ ఎస్‌వీయూల్లో ఇదే మంచిదని చెబుతారు. ఆఫ్ రోడ్ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అయితే లేటెస్ట్ ఫీచర్స్ ఉండవు. సీట్లు కూడా అంత కంఫర్ట్‌గా లేకపోవడం దీనికి పెద్ద మమైనస్.
రెనాల్డ్ ట్రైబర్ (Renault Triber)
బడ్జెట్‌లో, మంచి మైలేజ్‌తో 7 సీటర్ కార్ల కోసం చూస్తున్న వాళ్లకు ఇదో మంచి ఆప్షన్‌గా చెబుతారు. హైదరాబాద్‌లో రెనాల్డ్ ట్రైబర్ ఆన్‌రోడ్ ధర 6.80 నుంచి 11 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఇందులో కూడా మాన్యువల్ గేర్ , ఆటోమేటిక్ వెరియంట్స్ ఉన్నాయి. మాన్యువల్ అయితే 18.40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్ అయితే 18.30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ దాదాపు ఉన్నాయి.
కియా కారెన్స్ (Kia Carens)
కియా కారెన్స్ ధరలు 13 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 19 వేరియంట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆన్ రోడ్డు ధర 13 నుంచి మొదలై చివరి వేరియంట్ 24 లక్షల వరకు ఉంటుంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేందుకు ఈ సంస్థ ఇన్ని వేరియంట్స్ తీసుకొచ్చింది. ఈ వెహికల్ ఇచ్చే మైలేజ్‌ను పరిశీలిస్తే పెట్రోల్ మాన్యువల్ సిటీలో 15-16 kmpl ఉంటే హైవేపై 18-20 kmpl ఉంటుంది. పెట్రోల్ ఆటోమేటిక్ అయితే సిటీలో 13-14 kmpl ఉంటే హైవేపై 18-20 kmpl ఉంటుంది. డీజిల్ మాన్యువల్ సిటీలో 12-13 kmpl ఉంటే హైవేపై 18-20 kmpl ఉంటుంది. డీజిల్ ఆటోమేటిక్ సిటీలో యావరేజ్ 16 kmpl ఉంటుంది వినియోగదారులు చెబుతున్నారు.





















