Affordable CNG Cars: పెట్రోల్, డీజిల్ ఖర్చులకు గుడ్‌బై - రూ.10 లక్షల్లో వచ్చే టాప్-3 CNG కార్లు ఇవే!
Best CNG Cars 2025: రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ CNG కారు కొనాలని భావిస్తుంటే, మీరు వెతుక్కునే శ్రమ తగ్గించేందుకు, ఈ కథనంలో టాప్-3 మోడల్స్ గురించి వివరించాం.

CNG Cars Under Rs 10 Lakhs In India In 2025: పెట్రోల్ & డీజిల్ కార్ల ధరలు పెరగడమే తప్ప తరగడం లేదు. ముడి వస్తువులు & ఉత్పత్తి ఖర్చులు పెరిగాయన్న వంకతో కార్ కంపెనీలు ఏడాదికి రెండు, మూడుసార్లు ధరలు పెంచుతూనే ఉన్నాయి. ఒకవైపు పెరుగుతున్న సాంప్రదాయ ఇంజిన్ కార్ల ధరలు & మరోవైపు అధికంగా ఉన్న పెట్రోల్-డీజిల్ ఖర్చులను తట్టుకోలేక... ప్రజలు CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సెగ్మెంట్‌లోనూ, మీ బడ్జెట్‌లో వచ్చే CNG కార్లు ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు రూ. 10 లక్షలు అయితే, మీరు మంచి CNG కారు కొనవచ్చు.
రూ.10 లక్షల్లో వచ్చే చవక CNG కార్లు
మారుతి స్విఫ్ట్ (Maruti Swift CNG)
మారుతి స్విఫ్ట్ ఇటీవల CNG వేరియంట్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారులో Z-సిరీస్ ఇంజిన్ & S-CNG కలయిక ఉంది, ఈ కారణంగా ఈ కారు 32.85 km/kg మైలేజీ ఇస్తుంది. మారుతి స్విఫ్ట్ CNG మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దాని బేస్ & మిడ్ వేరియంట్లలో స్టీల్ వీల్స్ ఉపయోగించారు, టాప్-వేరియంట్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ కారులో... స్మార్ట్‌ప్లే ప్రోతో 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా, USB & బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. మారుతి స్విఫ్ట్ టాప్-వేరియంట్‌లో రియర్ AC వెంట్స్ కూడా ఇచ్చారు.
మారుతి స్విఫ్ట్ CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 9.75 లక్షలు అవుతుంది. విజయవాడలోనూ స్వల్పతేడాతో దాదాపు ఇదే రేటు ఉంది.
మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10 CNG)
ఆల్టో K10 ను భారత మార్కెట్లో అత్యంత చవకైన CNG కారుగా కొనుగోలు చేయవచ్చు. ఆల్టో K10 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. CNG మోడ్‌లో 56 hp & 82.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది. ఈ కారు 33.85 km/kg మైలేజీని కలిగి ఉంది.
మారుతి ఆల్టో K10 CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.01 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.02 లక్షలు.
టాటా పంచ్ (Tata Punch CNG)
టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ ALFA ఆర్కిటెక్చర్ ఆధారంగా పంచ్ Pure iCNG రూపొందింది. ఈ కారులో iCNG కిట్ ఉంది, ఇది కారును లీకేజీ నుంచి రక్షిస్తుంది. అంటే, కారులో ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే, ఈ టెక్నాలజీ సహాయంతో కారు ఆటోమేటిక్‌గా CNG మోడ్ నుంచి పెట్రోల్ మోడ్‌కు మారుతుంది.
టాటా పంచ్ CNG, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో 26.99 km/kg మైలేజీ ఇవ్వగలదు. ARAI (Automotive Research Association of India) సర్టిఫై చేసిన మైలేజ్ 26.99 km/kg. వాస్తవ పరీక్షలో, నగరంలో ఈ CNG కారు 20.7 km/kg &హైవేపై 31 km/kg మైలేజీ ఇచ్చిందన్న గణాంకాలు ఉన్నాయి.
టాటా పంచ్ CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.74 లక్షలు అవుతుంది. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.75 లక్షలు.





















