అన్వేషించండి

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీని కంపెనీ లాంచ్ చేసింది.

టాటా మోటార్స్ భారతీయ ఈవీ రిజల్యూషన్‌లో పెద్ద మార్పును తీసుకువచ్చింది. గతంలో నెక్సాన్ ఈవీని 2020 జనవరిలో లాంచ్ చేసింది. ఆ తర్వాత 2021లో టిగోర్ ఈవీని తీసుకువచ్చింది. ఇప్పుడు మొదటిసారి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీని లాంచ్ చేసింది.

ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఈవీ టియాగోనే. దీని ధర మనదేశంలో రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఈవీ ప్యాసింజర్ కారు ఇదే కానుంది. టియాగో రెగ్యులర్ వెర్షన్ ఆధారంగానే దీన్ని రూపొందించారు. అయితే ఎలక్ట్రిక్‌కు తగ్గట్లు దీనికి మార్పులు చేశారు. 

ఈ కారులో రెండు వెర్షన్లు ఉన్నాయి. వీటిలో 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇక 24 కేడబ్ల్యూహెచ్ మోడల్ అయితే 315 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించనుంది. బ్యాటరీ ప్యాక్‌కు 8 సంవత్సరాలు/1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందించనున్నారు. ఇక వాహనానికి 3 సంవత్సరాలు/1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ లభించనుంది.

టియాగో ఈవీలో రెండు రకాల చార్జర్ ఆప్షన్లు ఉన్నాయి. 3.3 కిలో వాట్ కాంపాక్ట్ ఏసీ చార్జర్ ద్వారా కారు పూర్తిగా చార్జ్ కావడానికి మూడు గంటల 36 నిమిషాలు పట్టనుంది. అదే 7.2 కిలో వాట్ ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.

ఇందులో 8 స్పీకర్ల హర్మాన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం అందించారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను ఇది సపోర్ట్ చేయనుంది. లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ట్రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డ్ ఉన్న ఎలక్ట్రిక్ ఓవీఆర్ఎమ్స్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందించనున్నారు. దీనికి సంబంధించిన డెలివరీలు 2023 జనవరిలో ప్రారంభం కానున్నాయి.

టాటా టియాగో ఈవీ ధర
టియాగో ఈవీ 19.2 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్ఈ వేరియంట్ - రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 19.2 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌టీ వేరియంట్ - రూ.9.09 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌టీ వేరియంట్ - రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ వేరియంట్ - రూ.10.79 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ - రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 7.2 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ వేరియంట్ - రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 7.2 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ - రూ.11.79 లక్షలు (ఎక్స్-షోరూం)

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV
2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ - పాత మోడల్‌తో పోలిస్తే కొత్తగా వచ్చిన మార్పులేంటి?
XP100, Power100, Speed100పై కేంద్రం కీలక ప్రకటన - E20ని మించిన ఇంధనంపైనా క్లారిటీ
ప్రీమియం పెట్రోల్ వాడేవారికి గుడ్ న్యూస్ - ఇథనాల్ ఒక్క చుక్క కూడా ఉండదని కేంద్రం క్లారిటీ!
Nissan Tekton కొనాలా, వద్దా? పూర్తి విశ్లేషణ - కొనడానికి 3 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు
Nissan Tekton కొనడం తెలివైన పనేనా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget