అన్వేషించండి

ఇక హైవేపై కంఫర్ట్‌గా డ్రైవ్ చేయండి! తక్కువ ధరలో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న 5 కార్లు ఇవే!

హైవే డ్రైవింగ్ కంఫర్ట్ కోసం క్రూయిజ్ కంట్రోల్ కావాలా? రూ.7 లక్షల నుంచి లభించే టాటా, హ్యుందాయ్ కార్ల వివరాలు, హైదరాబాద్ & విజయవాడ ఎక్స్‌-షోరూమ్ ధరలతో తెలుసుకోండి.

Affordable Cars India 2026: మీరు హైవే మీద ఎక్కువగా ప్రయాణం చేస్తారా? ఒకే వేగంతో కారు నడపడం కాస్త అలసటగా అనిపిస్తుందా? అలాంటి సందర్భాల్లో మీకు ఎంతో ఉపయోపడుతుంది "క్రూయిజ్ కంట్రోల్" ఫీచర్‌. ఒకప్పుడు ఇది రూ.10 లక్షల పైబడిన కార్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రూ.7 లక్షల లోపే కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం, క్రూయిజ్ కంట్రోల్‌ ఫీచర్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 5 కార్ల వివరాలు మీ కోసం:

5) Tata Tigor

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.7.32 లక్షల నుంచి

మన దేశంలో క్రూయిజ్ కంట్రోల్ అందించే అత్యంత చవక సెడాన్ ఇదే. టాప్ వేరియంట్లు XZ+, XZA+, XZ+ Lux లో ఈ ఫీచర్ ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 86hp శక్తిని ఇస్తుంది. CNG వెర్షన్‌లో 76hp శక్తి అందుతుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది. హైదరాబాద్, విజయవాడలో ఆన్‌రోడ్‌ ధరల్లో పెద్దగా వ్యత్యాసం ఉండదు.

4) Tata Altroz

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.7.04 లక్షల నుంచి

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న ఈ కారు ఎంట్రీ వేరియంట్ మినహా అన్ని వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్ అందిస్తుంది. 88hp పెట్రోల్, 90hp డీజిల్, 74hp CNG ఎంపికలు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో AMT, DCT ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక డీజిల్ ఆప్షన్ ఇది.

3) Tata Punch

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.7 లక్షల నుంచి

SUV తరహాలో ఉండే ఈ మోడల్‌లో Pure+ వేరియంట్ నుంచి క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులోకి వస్తుంది. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు 120hp టర్బో పెట్రోల్ ఎంపిక ఉంది. CNG వెర్షన్ కూడా లభిస్తుంది. ఈ లిస్ట్‌లో అత్యధిక వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న మోడల్‌ ఇదే.

2) Hyundai Grand i10 Nios

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.6.84 లక్షల నుంచి

మిడ్ వేరియంట్ Sportz నుంచి క్రూయిజ్ కంట్రోల్ లభిస్తుంది. 83hp 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. Sportz AMT వేరియంట్ రూ.7.36 లక్షల ఎక్స్‌-షోరూమ్ ధరతో, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో క్రూయిజ్ కంట్రోల్ అందించే అత్యంత చౌకవకైన కారు.

1) Tata Tiago

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.6.77 లక్షల నుంచి

మన దేశం మొత్తంలో, ప్రస్తుతం, క్రూయిజ్ కంట్రోల్ అందించే అత్యంత చవక కారు ఇదే. అయితే ఈ ఫీచర్ టాప్ వేరియంట్ XZ+ లో మాత్రమే లభిస్తుంది. 86hp పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ వేరియంట్లలో AMT, CNG ఎంపికలు కూడా ఉన్నాయి.

హైవే ప్రయాణాల్లో కంఫర్ట్‌గా, స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయాలనుకునేవారికి ఇప్పుడు బడ్జెట్‌లోనే మంచి ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా టాటా ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చూపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ సహా అన్ని తెలుగు నగరాల్లో కూడా ఈ కార్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget