New Maruti Suzuki Wagon R: వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ తీసుకురానున్న కంపెనీ - లాంచ్ ఎప్పుడంటే?
Maruti Suzuki New Car: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు త్వరలో లాంచ్ కానుంది.
Maruti Suzuki Wagon R Flex Fuel: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ దాని బడ్జెట్ ధర, మంచి మైలేజ్ కారణంగా దేశీయ విపణిలో చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు కంపెనీ దీన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో తీసుకురావడం ద్వారా మరింత పాకెట్ ఫ్రెండ్లీగా మార్చబోతోంది. మారుతి దీనిని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తిరిగి పరిచయం చేసింది. దీన్ని ఇప్పటికే గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. ఈ హ్యాచ్‌బ్యాక్ ఎందుకు మరింత ప్రత్యేకంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, ఇథనాల్ మిశ్రమం. మారుతి తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ ఆర్‌లో మళ్లీ మార్పులు చేసింది. ఇది పాకెట్ ఫ్రెండ్లీగా, కాలుష్యం పరంగా మెరుగ్గా ఉండేలా చేస్తుంది. అయినప్పటికీ దాని డిజైన్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అలాగే ఉంచారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో వస్తున్న మారుతి వ్యాగన్ ఆర్ 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 88.5 బీహెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గేర్ బాక్స్‌తో మార్కెట్లోకి రానుంది. ఇది ఇథనాల్ పెట్రోల్ మిక్స్ ఇంధనంతో పని చేస్తుంది. దీని కారణంగా పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది.
2025లో లాంచ్
మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ వచ్చే ఏడాది నాటికి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఇది ధర పరంగా ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఖరీదైనది కావచ్చు. మారుతి వ్యాగన్ ఆర్ ఇప్పటికే దాని విభాగంలోని ఇతర వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది. ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.