అన్వేషించండి

S Cross Discontinued: గ్రాండ్ విటారా రాకతో ఆ కారు నిలిపివేత, మారుతి సుజుకి కీలక నిర్ణయం!

మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో S-క్రాస్ అమ్మకాలను నిలిపివేసింది. 7 ఏండ్ల పాటు మార్కెట్ లో సత్తా చాటిన ఈ కారు.. గ్రాండ్ విటారా రాకతో తన ప్రస్థానాన్ని ముగించింది.

ఆటో దిగ్గజం మారుతి సుజుకి S-క్రాస్‌ తయారీని నిలిపివేసింది. గ్రాండ్ విటారా లాంచ్ తర్వాత, S-క్రాస్‌ కాల్ ఆఫ్‌ ను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ కారుకు సంబంధించిన వివరాలను  కంపెనీ తన వెబ్‌ సైట్ నుంచి తొలగించింది.

2015లో మారుతి సుజుకి S-క్రాస్ విడుదల

మారుతి S-క్రాస్ 2015లో విడుదల అయ్యింది. Nexa డీలర్‌ షిప్ ద్వారా రిటైల్ చేయబడిన మొట్టమొదటి ప్రీమియం క్రాస్ ఓవర్ గా గుర్తింపు పొందింది. ఈ మోడల్ దేశంలోని మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ లో బలంగా నిలబడింది. ఇతర ప్రత్యర్థి కంపెనీల కార్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకుని సత్తా చాటింది. ఈ కారు రెండు డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 89hp, 1.3-లీటర్ మల్టీ జెట్ ఇంజిన్,  117 hp, 1.6-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ తో విడుదల అయ్యింది.  

2017లో ఫేస్ లిఫ్ట్ పొందిన S-క్రాస్

ఫస్ట్ జెనెరేషన్ S-క్రాస్ 2017లో ఫేస్‌ లిఫ్ట్ ను పొందింది. ఈ కారులో పలు మార్పుల చేర్పులు చేశారు. ఈ కారు BMW లుక్ తో వచ్చింది. ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లైట్ల ఆకారం BMW X1ని పోలి ఉంటాయి. అయినప్పటికీ, 1.6 లీటర్ ఇంజన్ ను నిలిపివేసింది.  1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ 'స్మార్ట్ హైబ్రిడ్'గా మారింది. 2015లో ప్రారంభించబడిన S-క్రాస్ దాదాపు 1.69 లక్షల యూనిట్లను అమ్మింది.  భారతీయ ఆటో పరిశ్రమ గణాంకాలను పరిశీలిస్తే ఇది పెద్ద సంఖ్య ఏమీ కాదు. డీజిల్-ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ లేకపోవడం, పెద్ద హ్యాచ్‌ బ్యాక్ వంటి డిజైన్ కూడా దీనికి అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అమ్మకాల పరంగా ఎస్​ క్రాస్​కు అంత ఆదరణ రావడం లేదు. ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని ఈ మోడల్ కారుతో తట్టుకోలేకపోతుంది.  అందుకే పోటీని తట్టుకునేలా కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారణంగానే మారుతి సుజుకి S-క్రాస్ ను నిలిపివేసింది.

S-క్రాస్ వారసుడిగా గ్రాండ్విటారా

ఇక S-క్రాస్ వారసుడిగా గ్రాండ్​ విటారా మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఎక్కువ ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది.  ఇందులో ఆలయ్​ వీల్ డ్రైవ్ వేరియంట్, రెండు ఎలక్ట్రిఫైడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఒకటి తేలికపాటి హైబ్రిడ్, మరొకటి   బలమైన హైబ్రిడ్ను కలిగి ఉంది. ఈ మిడ్ రేంజ్ తరహా SUV లాంచ్‌తో వినియోగదారులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ కారు మంచి ఫీచర్లతో పాటు స్పోర్ట్ డిజైన్‌ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారును  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటాతో కలిసి అభివృద్ధి చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget