అన్వేషించండి

Year Ender 2023: 2023లో మారుతి లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు ఇవే - మూడిట్లో ఏది బెస్ట్!

2023 Maruti Suzuki: 2023లో మారుతి సుజుకి మనదేశంలో మూడు కొత్త కార్లను లాంచ్ చేసింది.

2023 Maruti Suzuki Cars: భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమకు 2023 సంవత్సరం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరం దేశంలో అనేక కార్లు లాంచ్ అయ్యాయి. కొన్ని కార్లు ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లను పొందాయి. అనేక కార్లకు సంబంధించి కొత్త వేరియంట్‌లు కూడా వచ్చాయి. భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మారుతి కంపెనీ మనదేశంలో మూడు కొత్త కార్లను లాంచ్ చేసింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Year Ender 2023: 2023లో మారుతి లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు ఇవే - మూడిట్లో ఏది బెస్ట్!

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
మారుతి సుజుకి దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ తయారీ సంస్థ. మారుతి సుజుకి ఈ ఏడాది భారతీయ మార్కెట్లో మూడు పెద్ద ఉత్పత్తులను లాంచ్ చేయడంతో పాటు ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. వీటితొ పాటు వీటిలో కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఫ్రాంక్స్, ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ జిమ్నీ, ప్రీమియం హైబ్రిడ్ ఎంపీవీ ఇన్విక్టో ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను కంపెనీ 2023 ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్‌లలో మార్కెట్లోకి వచ్చింది. ఫ్రాంక్స్ ధర రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్య ఉంటుంది. ఇంజిన్ గురించి చెప్పాలంటే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్లన్లు అందుబాటులో ఉన్నాయి.

Year Ender 2023: 2023లో మారుతి లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు ఇవే - మూడిట్లో ఏది బెస్ట్!

మారుతీ సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny)
మారుతీ జిమ్నీ 2023 జూన్‌లో లాంచ్ అయింది. జిమ్నీ జీటా, ఆల్ఫా అనే రెండు ట్రిమ్‌ల్లో అందుబాటులో ఉంది. వీరి ధరలు వరుసగా రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్య ఉండనుంది. అయితే ఈ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ ప్రస్తుతం కాస్త తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇటీవల ప్రారంభించిన ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 10.74 లక్షలకు అందుబాటులో ఉంది. పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే జిమ్నీ 105 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇందులో మాన్యువల్ (5-స్పీడ్), ఆటోమేటిక్ (4-స్పీడ్) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

Year Ender 2023: 2023లో మారుతి లాంచ్ చేసిన మూడు కొత్త కార్లు ఇవే - మూడిట్లో ఏది బెస్ట్!

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto)
ఈ సంవత్సరం కంపెనీ లాంచ్ చేసిన అతిపెద్ద ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టో. ఇన్విక్టో అనేది టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ రీ-బ్యాడ్జ్‌డ్ వెర్షన్. కంపెనీ జూలైలో దీని ధరలను ప్రకటించింది. దీని రేటు ప్రస్తుతం రూ. 24.82 లక్షల నుంచి రూ. 28.42 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. దీని కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్ 186 బీహెచ్‌పీగా ఉంది.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇన్విక్టో అనేది మారుతి సుజుకి మొట్టమొదటి హైబ్రిడ్ ఓన్లీ, ఆటోమేటిక్ ఓన్లీ కారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget