అన్వేషించండి

Maruti e-Vitara సెప్టెంబర్ 3న విడుదల! మీ కోసం ధర, ఫీచర్ల ప్రత్యేక సమాచారం!

Maruti e-Vitara Launch Date: భద్రత విషయంలో మారుతి ఇ-విటారా ఏమాత్రం తక్కువ కాదు. దీనిలో లెవల్ 2 ADAS టెక్నాలజీలు అందిస్తున్నారు.

Maruti e-Vitara Launch Date And Price Details: భారత మార్కెట్లో అత్యంత పాపులర్‌ బ్రాండ్‌ మారుతి సుజుకీ, తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఈ ఏడాది సెప్టెంబర్‌ 3వ తేదీన (03 September 2025) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి, ఈ లాంచ్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేశారు, సాంకేతిక కారణాలు చెప్పి ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ ఎలక్ట్రిక్ SUV కోసం అనధికారిక బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే బుకింగ్స్‌ అనుమతిస్తున్నారు.  ఇకపై అధికారికంగా బుకింగ్స్‌కు కంపెనీ సిద్ధమవుతోంది. 

మధ్యతరగతి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ మారుతి సుజుకి ఇ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Maruti e-Vitara ex-showroom price) రూ. 17-18 లక్షలు ఉండవచ్చు. దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు. 

మారుతి ఇ-విటారా మోడల్‌ను 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025'లో ప్రదర్శించారు & దీనికంటే ముందు, 'ఆటో ఎక్స్‌పో 2023'లో కాన్సెప్ట్ మోడల్ EVXగా పరిచయం చేశారు. ఈ SUVని గుజరాత్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు, భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, జపాన్ & యూరప్‌ సహా ఇతర దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తారు.

మారుతి సుజుకి, ఈ-విటారాను మొత్తం 10 ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, వీటిలో 6 మోనో-టోన్ & 4 డ్యూయల్-టోన్ కలర్స్‌ ఉన్నాయి. మోనో-టోన్ కలర్‌ ఆప్షన్స్‌లో - నెక్సా బ్లూ, స్ల్పెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్ & ఒపులెంట్ రెడ్ వంటి రంగులు ఉన్నాయి.

మారుతి సుజుకి ఇ-విటారా ఫీచర్లు
కంపెనీ, e-Vitaraను ప్రీమియం కారుగా పరిచయం చేయడానికి కారులో హెడ్‌లైట్లు, DRLs & టెయిల్‌ల్యాంప్స్‌ అన్నింటికీ పూర్తిగా LED సెట్‌ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ SUVకి 18-అంగుళాల చక్రాలు బిగిస్తారు. యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ అందించవచ్చు, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు యాడ్‌ చేస్తారు. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

ఇ-విటారా భద్రత సాంకేతికతలు
మారుతి ఇ-విటారా భద్రత పరంగా ఏమాత్రం తక్కువ కాదు. ఈ కారుకు లెవల్ 2 ADAS టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. ఈ ప్యాక్‌లో - లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత కోసం ఈ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌ల ఫెసిలిటీ కలిగి ఉంటుంది. ఇతర భద్రత లక్షణాలలో- బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.

Hyundai Creta EV & MG ZS EV వంటి ఎలక్ట్రిక్ SUVలతో మారుతి సుజుకి ఇ-విటారా పోటీ పడుతుందని భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Embed widget