అన్వేషించండి

రూ.10 లక్షల లోపులో బలెనో - రూ.10.75 లక్షల ఆల్ట్రోజ్‌.. టెక్నాలజీ, ఫీచర్లలో ఏ కారు బెటర్‌?

మారుతి బలెనో ఆల్ఫా(O), టాటా ఆల్ట్రోజ్‌ అకాంప్లిష్డ్‌+S టాప్‌ వేరియంట్ల ఫీచర్లు, భద్రత, టెక్నాలజీ & ధరల మధ్య పూర్తి పోలిక ఇదే.

Maruti Baleno Top Trim Details In Telugu: హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకునే వారికి మారుతి బలెనో & టాటా ఆల్ట్రోజ్‌ రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కార్లలో టాప్‌ వేరియంట్లు అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. Maruti Baleno Alpha(O) & Tata Altroz Accomplished+S వేరియంట్లలో అందించే ఫీచర్లను పరిశీలిస్తే కొన్ని అంశాల్లో రెండూ సమానంగా ఉన్నాయి. మరికొన్ని సదుపాయాల్లో మాత్రం తేడాలు కనిపిస్తున్నాయి.

ఇంజిన్‌ 
బలెనో ఆల్ఫా(O)లో 1.2 లీటర్‌ మూడు సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. దీనికి 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5 స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఎంపికలు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌ అకాంప్లిష్డ్‌+Sలో 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. దీనికి 6 స్పీడ్‌ DCA ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జత చేశారు.

బయటి ఫీచర్లు 
రెండు కార్లలోనూ LED ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంపులు, LED DRLలు, LED ఫాగ్‌ ల్యాంపులు & LED టెయిల్‌ ల్యాంపులు ఉన్నాయి. 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునే ORVMలు, వెనుక వైపర్‌ & వాషర్‌ కూడా రెండింటిలో ఉన్నాయి.

ఆల్ట్రోజ్‌లో ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ & డ్యూయల్‌ టోన్‌ రూఫ్‌ ఉన్నాయి. బలెనోలో పుల్‌ టైప్‌ డోర్‌ హ్యాండిల్స్‌తో పాటు UV కట్‌ గ్లాస్‌ లభిస్తుంది.

ఇంటీరియర్‌ 
ఆల్ట్రోజ్‌ పెద్ద స్క్రీన్లతో ముందుంది. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ & 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉన్నాయి. బలెనోలో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో అనలాగ్‌ డయల్స్‌తో పాటు TFT MID ఉంటుంది.

అయితే, బలెనోలో వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు & హెడ్‌ అప్‌ డిస్‌ప్లే ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లో ఇవి లేవు. ఆల్ట్రోజ్‌లో సన్‌రూఫ్‌, వెనుక ఆర్మ్‌రెస్ట్‌ & కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌ ఉన్నాయి. రెండు కార్లలో వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెనుక AC వెంట్స్‌ & వైర్‌లెస్‌ ఛార్జర్‌ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: రూ.3.60 లక్షల స్పాట్‌ క్యాష్‌తో Mahindra XUV 7XO మీదే! ఈజీ EMI ప్లాన్‌ ఎంచుకుంటే చాలు

టెక్నాలజీ విషయానికి వస్తే బలెనోలో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ ఉంది. ఇది లెవల్‌ 2 ADAS ప్యాకేజీలో భాగం. ఆల్ట్రోజ్‌లో బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ & SOS కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు కార్లలోనూ 360 డిగ్రీ కెమెరా & వాయిస్‌ అసిస్టెంట్‌ ఉన్నాయి.

భద్రత 
రెండు కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, TPMS, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, ABSతో EBD & ISOFIX మౌంట్స్‌ ఉన్నాయి. బలెనోలో లెవల్‌ 2 ADAS ప్రత్యేకతగా ఉంది. ఇందులో లేన్‌ కీప్‌ అసిస్ట్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ & హై బీమ్‌ అసిస్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ధర 
బలెనో ఆల్ఫా(O) ధర రూ.9.50 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. ఆల్ట్రోజ్‌ అకాంప్లిష్డ్‌+S ధర రూ.10.75 లక్షలు. అంటే ఆల్ట్రోజ్‌ కంటే బలెనో ధర సుమారు రూ.76 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు తక్కువగా ఉంటుంది.

ఫీచర్ల పరంగా రెండు కార్లకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లో పెద్ద డిస్‌ప్లేలు, సన్‌రూఫ్‌ & కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌ ఉన్నాయి. బలెనోలో వెంటిలేటెడ్‌ సీట్లు, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, లెవల్‌ 2 ADAS & రెండు గేర్‌బాక్స్‌ ఎంపికలు ఉన్నాయి. ధర, ఫీచర్లు & ఇంజిన్‌ ఎంపికలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలుదారులు తమ అవసరానికి తగిన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ప్రయాణాల్లో మీ కుటుంబం భద్రతకు మహీంద్రా భరోసా! XUV 7XOకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget