అన్వేషించండి

Mahindra Vision S: టాటా సియెరాకు పోటీగా రానున్న మహీంద్రా విజన్ ఎస్.. స్ట్రాంగ్ SUV లుక్‌, ADAS సహా ఫీచర్లు ఇవే!

Mahindra Vision S To be launched India | మహీంద్రా విజన్ ఎస్ టాటా సియెరాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్ట్రాంగ్ ఎస్‌యూవీ లుక్, ADAS ఫీచర్లతో విజన్ ఎస్ మార్కెట్లోకి వస్తుంది.

మహీంద్రా తన కొత్త NU IQ మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన SUV లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి నెమ్మదిగా సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఒకటి మహీంద్రా విజన్ S. ఈ ఎస్‌యూవీ దాదాపుగా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మహీంద్రా SUV ఇటీవల రోడ్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. విజన్ S స్కార్పియో చిన్న, మరింత మోడ్రన్ లుక్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఇది కనుక మార్కెట్లోకి వస్తే కనుక టాటా సియెర్రా వంటి రాబోయే SUV లతో పోటీ పడవచ్చు.

డిజైన్ బలమైన SUV లుక్‌ చూపిస్తుంది
మహీంద్రా విజన్ S బలమైన, బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ముందు భాగం నిటారుగా కనిపిస్తుంది. విజన్ ఎస్ బోనెట్ ఫ్లాట్‌గా ఉంటుంది. మొత్తం లుక్ కఠినమైన SUV లాగా ఉంటుంది. ఇది రౌండ్ హెడ్‌లైట్‌లు, నిలువు గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఇది కస్టమర్లకు క్లాసిక్ SUV అనుభూతిని ఇస్తుంది. థార్ రాక్స్ లాగా, విజన్ ఎస్ LED DRL లను హెడ్‌లైట్‌లలో కలుపుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మోడల్ ఫ్రంట్ గ్రిల్ కింద ఒక రాడార్ యూనిట్‌ను కూడా చూపించింది. మహీంద్రా విజన్ ఎస్ ADAS లక్షణాలను కలిగి ఉంటుందని సూచిస్తుంది.

అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన సస్పెన్షన్
విజన్ S ఎస్‌యూవీ ముఖ్య లక్షణం దాని అధిక గ్రౌండ్ క్లియరెన్స్. పెద్ద చక్రాలు, మందపాటి టైర్లు, పొడవైన సస్పెన్షన్ సెట్ దీనిని కాస్త గుంతలుగా భూభాగాలకు సిద్ధంగా ఉంచుతాయి. నివేదికల ప్రకారం, ఇది 5-లింక్ వెనుక స్వతంత్ర సస్పెన్షన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. సైడ్ వ్యూ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెడల్పు ఉన్న వీల్ ఆర్చ్‌లు, స్ట్రెయిట్ రూఫ్‌లైన్‌ను చూపుతోంది. పెద్ద గ్లాస్ ఏరియా క్యాబిన్ లోపల మంచి విజిబిలీటీని అందిస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్స్ గ్లింప్స్
వెనుకవైపు, మహీంద్రా విజన్ S క్లాసిక్ SUV డిజైన్‌ను ప్రదర్శిస్తుంది. టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ దాని ఆఫ్-రోడ్ లుక్‌ను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ప్రాథమికంగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఇది ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. SUVలో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డాష్‌బోర్డ్‌లో రెండు పెద్ద స్క్రీన్‌లు, కొత్త డ్యూయల్ టోన్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండవచ్చు. క్యాబిన్ మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ ఉపయోగించనున్నారు.

ఇంజిన్ ఎంపికలు ఇవే...
మహీంద్రా కంపెనీ విజన్ ఎస్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ఇంజిన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. కానీ విజన్ S 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుందని మార్కెట్లో భావిస్తున్నారు. భవిష్యత్తులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ మహీంద్రా విజన్ ఎస్ మార్కెట్లోకి వస్తే కనుక, ఈ SUV టాటా సియెర్రాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధర ఎంత? విజయవాడలో ఎంత?.. పూర్తి లెక్కలివే!
Defender 110: ఇండియాలో తయారీతో రూ.34 లక్షలు తగ్గిన డిఫెండర్ 110 రేటు.. నవంబర్ 15 నుంచి డెలివరీలు
ఇండియాలో తయారీ వల్ల ఈ లగ్జరీ SUV ధర ఏకంగా రూ.34 లక్షలు తగ్గింది, మీరూ కొంటారా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget