అన్వేషించండి

రూ.16.85 లక్షలకే మహీంద్రా థార్ రాక్స్‌ Star Edition లాంచ్‌ - కొత్త కలర్‌, బ్లాక్‌ థీమ్‌తో హైలైట్‌

Mahindra Thar Roxx Star Edition రూ.16.85 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరకు లాంచ్‌ అయింది. బ్లాక్‌డ్‌ అవుట్‌ డిజైన్‌, కొత్త Citrine Yellow కలర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో వచ్చింది.

Mahindra Thar Roxx Star Edition Price And Specifications: మహీంద్రా, తన పాపులర్ SUV లైనప్‌లో మరో కొత్త ఆకర్షణను జోడించింది. తాజాగా Mahindra Thar Roxx Star Editionను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ రూ.16.85 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి అందుబాటులోకి వచ్చింది. థార్ Roxxకు మరింత స్టైల్‌, ప్రీమియం టచ్‌ ఇవ్వడమే లక్ష్యంగా ఈ Star Editionను తీసుకొచ్చింది మహీంద్రా.

ఈ కొత్త ఎడిషన్‌ టాప్‌ స్పెక్‌ AX7L ట్రిమ్‌పై ఆధారపడి రూపొందింది. అయితే, మెకానికల్‌ అంశాల్లో మార్పులు చేయకుండా, ప్రధానంగా బ్లాక్‌డ్‌ అవుట్‌ ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ ఎలిమెంట్స్‌తో విజువల్‌ అప్‌గ్రేడ్‌ ఇచ్చింది. అంతేకాదు, థార్ Roxx కలర్‌ లైనప్‌లోకి కొత్త ‘Citrine Yellow’ షేడ్‌ను కూడా పరిచయం చేసింది.

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ హైలైట్స్‌

Star Editionను సాధారణ థార్ Roxx నుంచి వేరు చూపించే విషయాల్లో... గ్లాస్‌ బ్లాక్‌ ఫినిష్‌ గ్రిల్‌, బ్లాక్‌ అలాయ్ వీల్స్‌. రెగ్యులర్ మోడల్‌లో బాడీ కలర్ గ్రిల్‌, సిల్వర్ అలాయ్స్ ఉంటాయి. ఇప్పుడు Star Editionలో బ్లాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం వల్ల SUVకి మరింత అగ్రెసివ్‌, మస్కులర్ లుక్‌ వచ్చింది.

కొత్త Citrine Yellow కలర్‌తో పాటు, ఈ ఎడిషన్‌ Tango Red, Everest White, Stealth Black రంగుల్లో కూడా లభిస్తుంది. C పిలర్‌పై ప్రత్యేకమైన Star Edition బ్యాడ్జ్‌ కూడా ఇచ్చారు.

ఇంటీరియర్‌ మార్పులు

కేబిన్‌లోకి వెళ్తే, లైట్‌ కలర్ థీమ్‌ను తొలగించి ఆల్‌ బ్లాక్‌ ఇంటీరియర్‌ థీమ్‌ అందించారు. ఇందులో బ్లాక్‌ లెదరెట్ అపోల్స్టరీ, సూయెడ్ యాక్సెంట్స్‌ ఉన్నాయి. ఇది కేబిన్‌కు మరింత ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. 

ఫీచర్లు ఏంటంటే

ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. AX7 ట్రిమ్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఇక్కడ కూడా కొనసాగుతున్నాయి. ఈ Star Editionలో ఆల్‌ LED లైటింగ్‌, రెండు 10.25 అంగుళాల స్క్రీన్లు (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్), ముందు వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, పనోరమిక్ సన్‌రూఫ్‌, 9 స్పీకర్ల Harman Kardon సౌండ్ సిస్టమ్‌, టెర్రెయిన్ మోడ్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ వివరాలు

మెకానికల్‌గా Thar Roxx Star Editionలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ (177hp, 380Nm), 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ (175hp, 400Nm) ఆప్షన్లు ఉన్నాయి.

పెట్రోల్ వెర్షన్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. డీజిల్‌లో మాత్రం మాన్యువల్‌, ఆటోమేటిక్ రెండూ ఉన్నాయి. 

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... Star Editionలో 4x4 ఆప్షన్ లేదు. ఇది రియర్ వీల్ డ్రైవ్‌ (RWD)గా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ధరల వివరాలు (ఎక్స్‌-షోరూమ్‌)

Star Edition Diesel MT - రూ.16.85 లక్షలు

Star Edition Diesel AT - రూ.18.35 లక్షలు

Star Edition Petrol AT - రూ.17.85 లక్షలు

మొత్తానికి, స్టైల్‌, ప్రీమియం లుక్‌, ఫీచర్లతో థార్ Roxx కోరుకునేవారికి Star Edition మంచి ఎంపికగా నిలుస్తోంది. అయితే, 4x4 లేకపోవడాన్ని ఆఫ్‌ రోడ్ అభిమానులు గమనించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget