Mahindra Waiting Period: మహీంద్రా ఎస్‌యూవీల వెయిటింగ్ పీరియడ్‌లో మార్పులు - కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్!
మహీంద్రా స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ 700 వెయిటింగ్ పీరియడ్లను కంపెనీ తగ్గించిందని వార్తలు వస్తున్నాయి.
Mahindra XUV 700 and Scorpio N: ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్ సహా తన కీలక మోడళ్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి మహీంద్రా తన ఉత్పత్తిని పెంచనుందనే వార్తలో ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. మీరు బుక్ చేసే సిటీని బట్టి ఈ రెండు ఎస్‌యూవీల వెయిటింగ్ దాదాపు సంవత్సరం వరకు ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్‌ల వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలలకు తగ్గిందని తెలుస్తోంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మహీంద్రాలో అత్యంత డిమాండ్ ఉన్న వాహనం స్కార్పియో-ఎన్. దీని జెడ్2 పెట్రోల్‌పై ఆరు నుంచి ఏడు నెలలు, డీజిల్ వేరియంట్‌పై ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని జెడ్4, జెడ్6 వేరియంట్ విషయంలో అయితే 12 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాల్సిదే. జెడ్8ఎల్ ఏటీ పెట్రోల్ వేరియంట్ విషయంలో మూడు నెలల వరకు, జెడ్8ఎల్ ఏటీ డీజిల్ మోడల్‌పై ఎనిమిది నెలల వరకు, అత్యధికంగా అమ్ముడవుతున్న జెడ్8 వేరియంట్‌పై 13 నెలల వరకు ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఉంది.
టాప్ స్పెక్ జెడ్8ఎల్ ఎంటీ పెట్రోల్ మోడల్‌కు ఏడు నెలలు, డీజిల్ మోడల్‌కు ఎనిమిది నెలల పాటు వెయిటింగ్ చేయాల్సిందే. అయితే ఇటీవలి కాలంలో దాదాపు అన్ని వేరియంట్‌లకు వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలల వరకు తగ్గింది. గతేడాది నవంబర్‌లో మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 ట్రిమ్‌పై ఏకంగా 22 నుంచి 25 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 SUV బేస్ మోడల్ ఎంఎక్స్, ఏఎక్స్3 పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై నాలుగు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే ఏఎక్స్5 ట్రిమ్ కోసం ఆరు నెలల వరకు, ఏఎక్స్7 ట్రిమ్, టాప్ కోసం ఎనిమిది నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక టాప్ ఎండ్ ఏఎక్స్7ఎల్ ట్రిమ్ కోసం అయితే తొమ్మిది నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం టాప్ ఎండ్ వేరియంట్ ఏఎక్స్7ఎల్ ట్రిమ్ వెయిటింగ్ పీరియడ్ గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఆరు నెలలు తగ్గింది. అయితే ఎంట్రీ లెవల్ ఎంఎక్స్, ఏఎక్స్3 పెట్రోల్ వేరియంట్‌ల కోసం మాత్రం వెయిటింగ్ పీరియడ్ దాదాపు రెండు నెలలు పెరిగింది. దీనికి సంబంధించిన డీజిల్ మోడల్ వెయిటింగ్ పీరియడ్ దాదాపు ఆరు నెలలు తగ్గింది. 2024 మార్చి వరకు ప్రతి నెలా దాదాపు 10,000 ఎక్స్‌యూవీ700 యూనిట్లను ఉత్పత్తి చేయాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ నెలకు 6,000 యూనిట్లను రూపొందిస్తుంది.
When you arrive with an unmissable presence, even the pink city rolls out a red carpet. Sharing a glimpse of the #XUVRush in Jaipur.#XUV700 #HelloXUV700 #XUV700Tribe pic.twitter.com/q9EsPjQn6b
— MahindraXUV700 (@MahindraXUV700) June 13, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial