News
News
X

Mahindra: మ‌హీంద్రా కార్ల‌పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు.. ఏకంగా రూ.2.58 ల‌క్ష‌ల వ‌ర‌కు!

మ‌హీంద్రా త‌న కార్ల‌పై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్ల‌ను అందించింది.

FOLLOW US: 
Share:

మ‌హీంద్రా త‌న కార్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను అందించింది. వీటిలో ఎక్స్ యూవీ500పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌గా, దీంతోపాటు ఎస్ యూవీ ఎక్స్ యూవీ300, స్కార్పియోల‌పై కూడా మంచి ఆఫ‌ర్లే ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో లిస్ట్ అయ్యాయి. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌హీంద్రా త్వ‌ర‌లో ఎక్స్ యూవీ700ను లాంచ్ చేయ‌నుంది. ఇప్పుడు వీటిపై ఆఫ‌ర్లు అందించ‌డానికి ఇది కూడా కార‌ణం కావ‌చ్చు.

మ‌హీంద్రా ఎక్స్ యూవీ500 ఆఫ‌ర్లు
డ‌బ్ల్యూ11, డ‌బ్ల్యూ11 ఏటీ వేరియంట్ల‌పై రూ.1,79,800 క్యాష్ డిస్కౌంట్, రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్ ను కంపెనీ అందించ‌నుంది. దీంతోపాటు ఎక్స్ చేంజ్ పై రూ.50 వేల వ‌ర‌కు అద‌న‌పు ఎక్స్ చేంజ్ బోన‌స్ కూడా ల‌భించనుంది. రూ.20 వేల విలువైన యాక్సెస‌రీస్ కూడా కంపెనీ వీటితోపాటు అందించ‌నుంది.

ఇక డ‌బ్ల్యూ7, డ‌బ్ల్యూ7 ఏటీ, డ‌బ్ల్యూ9, డ‌బ్ల్యూ9 ఏటీ వేరియంట్ల‌పై రూ.1,28,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుండ‌గా, దీంతోపాటు రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.50,000 అద‌నపు ఎక్స్ చేంజ్ బోన‌స్, రూ.20 వేల విలువైన యాక్సెస‌రీస్ కూడా దీంతోపాటు అందించ‌నున్నారు.

పై మోడ‌ళ్ల‌తో పాటు డ‌బ్ల్యూ5 వేరియంట్ స‌హా మొత్తంగా రూ.2,58,000 వ‌ర‌కు లాభాల‌ను అందిస్తున్నారు.

Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కార‌ణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవ‌కాశం!

మ‌హీంద్రా ఎక్స్ యూవీ300 ఆఫ‌ర్లు
ఇందులో అన్ని వేరియంట్ల‌పై రూ.44,500 వ‌ర‌కు లాభాల‌ను అందించ‌నున్నారు. వీటిలో క్యాష్ డిస్కౌంట్, అద‌నపు ఎక్స్ చేంజ్ బోన‌స్, యాక్సెస‌రీల‌పై ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి.

మ‌హీంద్రా స్కార్పియో డిస్కౌంట్లు
ఇందులో ఎస్3 ప్ల‌స్, ఎస్3 ప్ల‌స్ 9 సీట‌ర్ పై రూ.4,000 కార్పొరేట్ అందించ‌నున్నారు. దీంతోపాటు రూ.5,000 వ‌ర‌కు ఉచిత యాక్సెస‌రీలు కూడా ల‌భించ‌నున్నాయి. ఇక ఎస్11, ఎస్9, ఎస్7ల‌పై రూ.4,000 త‌గ్గింపు ల‌భించ‌నుంది. ఎస్5 వేరియంట్ పై రూ.4,000 డిస్కౌంట్, యాక్సెస‌రీల‌పై రూ.15,000 త‌గ్గింపు అందించ‌నున్నారు.

Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచ‌ర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వ‌చ్చేసింది!
Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!
Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవ‌సీ ప‌టిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త‌ ఫీచ‌ర్లు ఇవే!
Also Read: రూ.15 వేల‌లోపే భార‌తీయ బ్రాండ్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచ‌ర్లు!

Published at : 12 Sep 2021 06:21 PM (IST) Tags: Mahindra XUV500 Mahindra XUV300 Mahindra Scorpio Mahindra Offers Mahindra Discounts Mahindra

సంబంధిత కథనాలు

Upcoming SUVs: వచ్చేస్తున్నాయ్ కొత్త కార్లు - రూ.15 లక్షలలోపు రాబోయే 4 SUVలు ఇవే!

Upcoming SUVs: వచ్చేస్తున్నాయ్ కొత్త కార్లు - రూ.15 లక్షలలోపు రాబోయే 4 SUVలు ఇవే!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!

Bikes For Beginner Riders: మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? - అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!

Bikes For Beginner Riders: మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? - అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!

Chetak Electric Scooter: ఒక్క చార్జ్ తో 108 కిలో మీటర్ల ప్రయాణం, చేతక్ నుంచి అప్డేటెడ్ వెర్షన్

Chetak Electric Scooter: ఒక్క చార్జ్ తో 108 కిలో మీటర్ల ప్రయాణం, చేతక్ నుంచి అప్డేటెడ్ వెర్షన్

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా