Mahindra Bolero Neo టాప్ వేరియంట్ కోసం ₹3 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, ఆ తర్వాత నుంచి ఎంత EMI చెల్లించాలి?
Mahindra Bolero Neo EMI: మహీంద్రా కార్లకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో బొలెరో నియో కూడా ఉంది. లోన్‌పై ఆ కారును కొనాలనుకుంటే, కనీసం కొంత డౌన్ పేమెంట్ చేయాలి.

Mahindra Bolero Neo Price, Down Payment, Car Loan and EMI Details: మహీంద్రా బొలెరో నియోలో టాప్ వేరియంట్ N10 (O). దీని లుక్స్ చాలా స్టైలిష్‌గా, ఆధునిక SUV తరహాలో ఉంటాయి. ముందు భాగంలో ఉన్న షార్ప్ హెడ్‌ల్యాంప్స్ & అగ్రెసివ్ గ్రిల్ రోడ్డుపై ఈ బండికి బలమైన ఇమేజ్ ఇస్తాయి. బాడీ క్లాడింగ్, అల్లాయ్ వీల్స్ వాహనానికి బాడీ బిల్డర్ లాంటి అప్పీల్ తెస్తాయి. వెనుక భాగంలో ఉన్న స్మార్ట్ డిజైన్ టెయిల్‌ల్యాంప్స్ ప్రీమియం ఫీలింగ్ కలిగిస్తాయి.
రోడ్ ప్రెజన్స్, స్టైల్, పవర్ & అందుబాటు ధర కారణంగా, Mahindra Bolero Neo SUV, దూకుడును ఇష్టపడే కస్టమర్ల మొదటి ఎంపికగా మారింది. ఈ దసరా-దీపావళి పండుగల నాటికి మీరు దాని టాప్ N10 (O) వేరియంట్‌ను ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటే, కార్ లోన్‌పై కూడా ఈ కారును కొనవచ్చు. దీనికోసం, ముందుగా కనీసం రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి.
మహీంద్రా బొలెరో నియో ధర
తెలుగు రాష్ట్రాల్లో మహీంద్రా బొలెరో నియో టాప్ వేరియంట్‌ను కంపెనీ రూ. 12.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తోంది. హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 2.09 లక్షల RTO ఛార్జీ & దాదాపు రూ. 78,000 బీమా, ఇతర అవసరమైన ఖర్చులు యాడ్ అవుతాయి. ఇవన్నీ కలిపితే, భాగ్యనగరంలో ఈ SUV ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15.17 లక్షలు అవుతుంది. బెజవాడలోనూ ఇదే ఎక్స్-షోరూమ్ రేటు ఉంది, అక్కడ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15.16 లక్షలు అవుతుంది.
రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత EMI ఆప్షన్స్
మీరు, మహీంద్రా బొలెరో నియో N10 (O) వేరియంట్ కొనడానికి విజయవాడలో రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 12.16 లక్షలకు బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్ ఈ మొత్తాన్ని 9% వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. ఈ రేటు దగ్గర EMI ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
7 సంవత్సరాల రుణ కాలానికి తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 19,552 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే మీరు ప్రతి నెలా రూ. 21,905 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే మీరు ప్రతి నెలా రూ. 25,226 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేసే ఉద్దేశం ఉంటే మీరు ప్రతి నెలా రూ. 30,241 EMI చెల్లించాలి.
పైన చెప్పిన లోన్ టెన్యూర్స్‌లో, మీకు బెస్ట్ అనిపించే ఒక ఫైనాన్స్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తం, విధించే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి.
బొలెరో నియో ఫీచర్లు
మహీంద్రా బొలెరో నియోను ప్రత్యేకంగా భారతదేశంలోని రోడ్లు & భారతీయ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీనికి శక్తిమంతమైన ఇంజిన్, గొప్ప గ్రౌండ్ క్లియరెన్స్ & సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ ఉన్నాయి. ఈ SUVని సిటీ డ్రైవింగ్ & హైవేలపై దూర ప్రయాణాల కోసం నమ్మకంగా వాడుకోవచ్చు.
మార్కెట్‌లో గట్టి పోటీ
మహీంద్రా బొలెరో నియోకు ఇండియన్ మార్కెట్లోని చాలా పాపులర్ SUVలు నేరుగా పోటీ ఇస్తున్నాయి. వాటిలో... Maruti Grand Vitara, Hyundai Creta, Kia Seltos & Honda Elevate వంటి మోడళ్లు ఉన్నాయి.




















