అన్వేషించండి

హార్డ్‌కోర్‌ ఆఫ్‌రోడ్‌ బైక్‌ KTM 390 Adventure R లాంచ్‌ - ధర తక్కువే, అడ్వెంచర్‌ లవర్స్‌కు పండగే!

KTM 390 Adventure R భారత్‌లో లాంచ్‌ అయ్యింది. 230mm సస్పెన్షన్‌ ట్రావెల్‌, 272mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో ఇది పూర్తి ఆఫ్‌రోడ్‌ బైక్‌గా నిలుస్తోంది, యువతకు గిలిగింతలు పెడుతోంది.

KTM 390 Adventure R Price And Specifications: అడ్వెంచర్‌ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో యువతను టార్గెట్‌ చేస్తూ KTM మరో దమ్మున్న బైక్‌ను తీసుకొచ్చింది. పూర్తిగా ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌ కోసం రూపొందించిన KTM 390 Adventure Rను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో నిశ్శబ్దంగా లిస్ట్‌ చేసింది. ఈ బైక్‌ ధరను రూ. 3.78 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ప్రకటించింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది స్టాండర్డ్‌ 390 Adventure కంటే కూడా తక్కువ ధరకు లభిస్తోంది.

ప్రస్తుతం స్పోక్‌డ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లతో వచ్చే సాధారణ KTM 390 Adventure ధర రూ. 3.97 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). అయితే కొత్త Adventure R మాత్రం హార్డ్‌కోర్‌ ఆఫ్‌రోడ్‌ సెటప్‌తో ఉండి కూడా తక్కువ ధరకు రావడం యువ రైడర్లను ఆకట్టుకుంటోంది.

సస్పెన్షన్‌, వీల్స్‌లో కీలక మార్పులు

KTM 390 Adventure Rలో ప్రధానంగా కనిపించే తేడాలు సస్పెన్షన్‌, వీల్స్‌. ఇండియాలో లాంచ్‌ చేసిన బైక్‌కు, గ్లోబల్‌ మార్కెట్‌లో ఉన్న KTM 390 Enduro R మోడల్‌కు ఉపయోగించిన సస్పెన్షన్‌ సెటప్‌ను అందించారు. దీనివల్ల ముందు, వెనుక రెండింటికీ 230mm సస్పెన్షన్‌ ట్రావెల్‌ లభిస్తుంది. సాధారణ 390 Adventureలో ఇది ముందు 200mm, వెనుక 205mm వరకు మాత్రమే ఉంటుంది.

వీల్స్‌ విషయంలో కూడా Adventure R మరింత ఆఫ్‌రోడ్‌ స్పూర్తితో తయారైంది. ఇందులో 21 ఇంచ్‌ ఫ్రంట్‌, 18 ఇంచ్‌ రియర్‌ వీల్స్‌ ఉన్నాయి. వీటిపై ట్యూబ్‌డ్‌ Mitas Enduro Trail టైర్లు అమర్చారు. స్టాండర్డ్‌ మోడల్‌లో మాత్రం 21/17 ఇంచ్‌ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్‌ Apollo Tramplr టైర్లు వస్తాయి.

ఎత్తైన సీట్‌, భారీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌

ఈ ఆఫ్‌రోడ్‌ సెటప్‌ కారణంగా KTM 390 Adventure R సీట్‌ హైట్‌ 870mmగా ఉంది. ఇది కొంచెం ఎత్తుగా అనిపించినా, ట్రైల్స్‌, రఫ్‌ రోడ్లపై రైడ్‌ చేయాలనుకునే వారికి ఇది పెద్ద ప్లస్‌. అంతేకాదు, ఈ బైక్‌కు 272mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండటం వల్ల రాళ్లు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా నమ్మకంగా రైడ్‌ చేయొచ్చు.

ఇంజిన్‌, ఫీచర్లు, పవర్‌

ఇంజిన్‌ విషయానికి వస్తే, KTM ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే 399cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 46hp శక్తి, 39Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, బైడైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌, రైడింగ్‌ ఎయిడ్స్‌ అన్నీ కూడా స్టాండర్డ్‌ 390 Adventureలాగే ఉంటాయి.

డిజైన్‌, బాడీవర్క్‌, ఛాసిస్‌ విషయంలో పెద్ద మార్పులు లేవు. అయితే Adventure R మాత్రం వైట్‌-ఆరెంజ్‌ కలర్‌ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

బరువు, బుకింగ్స్‌ వివరాలు

UK స్పెసిఫికేషన్‌ ప్రకారం, 14 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ను పూర్తిగా నింపాక ఈ బైక్‌ బరువు 176 కిలోలు (కెర్బ్‌ వెయిట్‌). ఇది ఇండియా-స్పెక్‌ స్టాండర్డ్‌ 390 Adventure కంటే సుమారు 6 కిలోలు తక్కువ. అయితే భారత మార్కెట్‌కు తప్పనిసరిగా అమర్చాల్సిన నంబర్‌ ప్లేట్‌ హోల్డర్‌, శారీ గార్డ్‌ వంటి భాగాలు బరువును కొంత పెంచే అవకాశం ఉంది.

KTM ఇండియా వెబ్‌సైట్‌ ప్రకారం, కేవలం రూ. 1,999 టోకెన్‌ అమౌంట్‌తో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఈ మొత్తం పూర్తిగా రిఫండబుల్‌ కావడం విశేషం.

తక్కువ ధరకు ఎక్కువ ఆఫ్‌రోడ్‌ ఫోకస్‌

రూ. 3.78 లక్షల ధరకు KTM 390 Adventure R అందించే ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం చూసుకుంటే, ఇది అడ్వెంచర్‌ రైడింగ్‌ను సీరియస్‌గా తీసుకునే యువతకు బాగా నచ్చే అవకాశం ఉంది. ట్యూబ్‌డ్‌ టైర్లు, ట్యూబ్‌లెస్‌ స్పోక్‌డ్‌ వీల్స్‌ లేకపోవడమే తక్కువ ధరకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కొత్త కారు కొనేవాళ్లు పండగ చేసుకోండి.. మహీంద్రా కార్లపై రూ.లక్షన్నర వరకు డిస్కౌంట్లు
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget