(Source: ECI/ABP News/ABP Majha)
Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?
కియా కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో లాంచ్ అయింది. అదే కియా ఈవీ9 ఎస్‌యూవీ.
Kia Electric SUV Car: దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో నిమగ్నమై ఉంది. కంపెనీ తన విలాసవంతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ9ను లాంచ్ చేసింది. సరికొత్త, అధునాతన ఫీచర్లతో కియా ఈవీ9 కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUV కారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను 1.2 మిలియన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంకా చదవండి
ఈ కారు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, అయితే ఈ SUVలో అందించే ఫీచర్ల గురించి సమాచారం ఇచ్చింది. ప్రపంచంలోని ఎంపిక చేసిన దేశాల్లో 2023 ద్వితీయార్థంలో కంపెనీ ఈ కారు విక్రయాలను ప్రారంభించవచ్చు. వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఆటో షోలో కంపెనీ దీని గురించి మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
బేసిక్ ఫీచర్లు
కంపెనీ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై కియా EV9ని నిర్మించింది. దీని వీల్‌బేస్ 122 అంగుళాలు, పొడవు 197 అంగుళాలు. ఇది మార్కెట్లో ఉన్న ఇతర ఫుల్ సైజు ఎస్‌యూవీలతో సమానంగా ఉండనుంది.
డ్రైవింగ్ రేంజ్ ఎంత?
దీని డ్రైవింగ్ రేంజ్ గురించి మాట్లాడాలంటే, దాని రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ 541 కిలో మీటర్ల రేంజ్ వరకు అందిస్తుందని WLTP (వరల్డ్‌వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్) తెలిపింది. అదే సమయంలో కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం 150kW మోటార్‌తో ఈ కారు 9.4 సెకన్లలో, 160kW మోటార్‌తో 8.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.
ఇది కాకుండా, ఈ ఎలక్ట్రిక్ SUVతో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తుంది. దీని కారణంగా ఇది కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌లో 239 కిలో మీటర్ల దూరాన్ని కవర్ చేసే ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
డిజిటల్ సర్వీసులు
కియా త్వరలో కనెక్ట్ స్టోర్స్ పేరుతో స్టోర్లను ప్రారంభించనుంది. కస్టమర్‌లు తమకు నచ్చిన డిజిటల్ ఫీచర్‌లను ఈ స్టోర్‌లో కొనుగోలు చేయగలరు. దీంతో పాటు యాప్‌ని ఉపయోగించడం ద్వారా, మీరు వాహనంలో ఇచ్చిన ఫీచర్‌లను అప్‌గ్రేడ్ చేయగలుగుతారు. ఇది కాకుండా కస్టమర్లు కారు లైటింగ్, ఇతర ఫీచర్లను కూడా అప్‌గ్రేడ్ చేయగలరు. ఈ కియా ఎస్‌యూవీలో డిజిటల్ టైగర్ ఫేస్ ఫ్రంట్ గ్రిల్‌పై ఇవ్వబడింది. కియా ఈవీ9 వినియోగదారులకు దాని లైటింగ్ నమూనాలను మార్చే అనుమతి కూడా ఉంది.
క్యాబిన్ ఎలా ఉంది?
Kia EV9 క్యాబిన్ గురించి చెప్పాలంటే ఇందులో కర్వ్‌డ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది.. ఇది 7, 6 సీట్ల ఆప్షన్లను పొందుతుంది. దీని రెండో లేన్ సీటు 180 డిగ్రీల వరకు తిరిగేలా డిజైన్ చేయబడింది. తద్వారా ఇద్దరు వ్యక్తులు అవసరమైతే ఒకరితో ఒకరు హాయిగా మాట్లాడుకోవచ్చు. దీనితో పాటు కప్ హోల్డర్లు, ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్లు
Kia EV9లో ADAS రేంజ్ 3ని మెరుగైన సేఫ్టీ ఫీచర్‌గా అందిస్తుంది. దీనికి హైవే డ్రైవర్ పైలట్ అని పేరు పెట్టారు. దీని విక్రయాలను ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్రత్యేకంగా జరపనున్నారు. ఈ ఫీచర్ కోసం 15 సెన్సార్లు, రెండు లైడార్, రాడార్, 360 డిగ్రీ కెమెరాలను అందించారు. ఇది ఎలాంటి ప్రమాదాన్ని అయినా నిరోధించగలదు. టెస్లా కంటే మెరుగైన ఆటో పైలట్ ఇదే అని వినియోగదారులు అంటారు.
వీటిలో పోటీ?
కియా SUV ఎలక్ట్రిక్ కారు Kia EV9 ల్యాండ్ రోవర్ డిఫెండర్, BMW X5, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, BMW X7 వంటి కార్లతో పోటీపడుతుంది.