Kia Tasman: కియా మొట్టమొదటి పికప్ ట్రక్ త్వరలో - ఏకంగా గ్లోబల్ ఎంట్రీ!
Kia Tasman Pickup Truck: కియా టాస్మాన్ తన మొట్టమొదటి పికప్ ట్రక్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
Kia Tasman First Pick Up Truck: కార్లతో పాటు కియా పికప్ ట్రక్కుల తయారీని కూడా ప్రారంభించింది. 2025 సంవత్సరంలో కియా పికప్ ట్రక్ విభాగంలోకి ప్రవేశించబోతోంది. కియా ఈ కొత్త పికప్ ట్రక్‌కి టాస్మాన్ అని పేరు పెట్టింది. కియా ఈ కొత్త ట్రక్‌తో పికప్ ట్రక్ సెగ్మెంట్‌లో గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనుంది. కొరియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో కంపెనీ ఈ కొత్త ట్రక్కును విడుదల చేయనుంది.
పవర్‌ఫుల్ ఇంజిన్‌తో...
కియా మొదటి పికప్ ట్రక్కులో 2 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉండవచ్చు. అంతేకాకుండా కంపెనీ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా అందించగలదు. ఈ కంపెనీ ఈ ట్రక్కును ఆల్-వీల్ డ్రైవ్ లేదా 4*4 ఆఫర్‌తో తీసుకురావచ్చు. భవిష్యత్తులో ఈ ట్రక్ పెర్ఫార్మెన్స్‌పై పని చేస్తున్నప్పుడు, కియా వీ6 పవర్‌ట్రెయిన్‌ను కూడా ఇందులో ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ట్రక్ గురించి కంపెనీ ఎక్కువ సమాచారాన్ని షేర్ చేయలేదు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
వీటితో పోటీ...
పికప్ ట్రక్ సెగ్మెంట్‌లో కియా టాస్మాన్ అరంగేట్రం చేయడంతో చాలా పెద్ద కంపెనీల నుండి పోటీ ఉంటుంది. ఫోర్డ్ రేంజర్, హ్యుందాయ్ శాంటా క్రజ్, ఫోక్స్‌వ్యాగన్ అమరోక్‌లతో కియా టాస్మాన్ పోటీ పడనుంది. ఇటీవల కియా తన పికప్ ట్రక్కును ఆస్ట్రేలియా రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. భారతదేశంలోకి ఈ కియా ట్రక్ రాకకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.
కియా వద్ద పిక్ అప్ ట్రక్ లేదు. కానీ కంపెనీ తన కొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కియా కొత్త ఎస్‌యూవీ క్లావిస్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. కియా తన మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ9ని కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈవీ 2024 సంవత్సరంలో భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది.