కియా సోరెంటో ధర 29 లక్షల నుండి 40 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. ఇది ప్రీమియం SUV సెగ్మెంట్‌లో లభిస్తుంది.
అద్భుతమైన స్పేస్, బెస్ట్ ఫీచర్లు ఉన్న Kia Sorento Hybrid SUV.. హైదరాబాద్‌లో ధరెంతో తెలుసా
Kia Sorento SUV | భారత్‌లో పవర్‌ఫుల్, సైజ్, లగ్జరీ కేబిన్, 1.6 లీటర్ టర్బో హైబ్రిడ్ ఇంజిన్‌తో కియా సోరెంటో హైబ్రిడ్ వచ్చింది. ఈ ప్రీమియం SUV పూర్తి వివరాలు తెలుసుకోండి.

- కియా సోరెంటో ప్రీమియం ఎస్‌యూవీగా రూ.29-40 లక్షలకు లభిస్తుంది.
- 1.6 లీటర్ టర్బో-హైబ్రిడ్ ఇంజిన్, నగరంలో 10 కి.మీ మైలేజ్.
- లగ్జరీ క్యాబిన్, ఏఐ అసిస్టెంట్, వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లు ఉన్నాయి.
- విశాలమైన స్థలం, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో సమతుల్య ఎస్‌యూవీ.
భారత్‌లో గత కొన్నేళ్లుగా ప్రజలలో ప్రీమియం SUVలకు డిమాండ్ పెరిగింది. దాంతో కార్ల కంపెనీలు ఇలాంటి సెగ్మెంట్ వాహనాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మీరు కూడా లుకింగ్‌లో ప్రీమియం, సైజ్‌లో పెద్దదిగా ఉండే SUV కోసం చూస్తున్నారా.. కియా సోరెంటో మీకు సరైన ఆప్షన్ కాగలదు. కియా కంపెనీ దీనిని 29 లక్షల నుంచి40 లక్షల రూపాయల ధరల పరిధిలో లాంచ్ చేసింది. ఈ హైబ్రిడ్ SUV పెద్ద నగరాల్లో జర్నీకి సెట్ అవుతుందని కస్టమర్లు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధరలు ప్రారంభ వేరియంట్ 36.55 లక్షల నుంచి టాప్ మోడల్ రూ.51 లక్షల వరకు ఉన్నాయి.
ముఖ్యంగా పెట్రోల్, హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ వాహనం రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందంటే ఇది కోటి రూపాయల ఏదో ఒక లగ్జరీ SUVలా కనిపిస్తుంది. ఇందులో పెద్ద బాడీ, బలమైన గ్రిల్, మస్క్యులర్ డిజైన్‌తో ఇది రోడ్డుపై తనదైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, లగ్జరీగా మార్చే ఒక మంచి ఫ్యామిలీ కార్ మీకు కావాలనుకుంటే కియా సోరెంటో ప్రత్యేకతలు మీరు తెలుసుకోవాలి.
హైబ్రిడ్ ఇంజిన్ డబుల్ మజా
చాలా వరకు హైబ్రిడ్ వాహనాల్లో సాధారణ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. కానీ కియా సోరెంటోలో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు. ఈ ఇంజిన్ ఒక్కటే 180 bhp పవర్‌ను ఇస్తుంది. దీనికి 65 bhp ఎలక్ట్రిక్ మోటార్ చేర్చినప్పుడు ఈ SUV ఎంతో పవర్ ఫుల్, వేగంగా వెళ్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్.. ఇది గేర్లు మార్చే సమయంలో చాలా స్మూత్‌గా, రెస్పాన్సివ్‌గా ఉంటుంది. స్టార్ట్ చేయగానే ఇది సైలెంట్, ఎలక్ట్రిక్ మోడ్‌పై నడుస్తుంది.యాక్సిలరేటర్ నొక్కినప్పుడు ఇంజిన్ జెర్క్ లేకుండా పవర్‌ను నిలకడగా అందుకుంటుంది.
మైలేజ్ ఎంత ఇస్తుంది
ఇంత పెద్ద సైజ్ SUV అయినప్పటికీ కియా సోరెంటోను సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా డ్రైవ్ చేయవచ్చు.ఎందుకంటే, దీని స్టీరింగ్ వీల్ చాలా తేలికగా ఉంటుంది.ఇరుకైన ప్రదేశాల్లో కూడా ఇది సులభంగా టర్న్ అవుతుంది.తక్కువ స్పీడ్‌లో గుంతలపై దీని డ్రైవింగ్ కాస్త కఠినంగా అనిపిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే సిటీలో ఇది దాదాపు లీటరుకు 10 కి.మీ మైలేజ్ ఇచ్చింది. హైవేపై దీని మైలేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది కేవలం పెట్రోల్‌పై మాత్రమే నడిచే ఏ ఇతర పెద్ద SUVతో పోల్చినా పొదుపైన వెహికల్.
ఎన్నో హైటెక్ ఫీచర్లు
కియా సోరెంట్ కేబిన్ లోపలికి అడుగు పెట్టగానే మీకు ప్రీమియం,లగ్జరీ ఫీల్ అవస్తుంది. ఇందులో డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం పెద్ద ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, ఆన్-బోర్డ్ ఏఐ (AI) అసిస్టెంట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇచ్చారు.
రెండో వరుసలో క్యాప్టెన్ సీట్లు లభిస్తాయి. ఇవి వెంటిలేటెడ్ ఫంక్షన్, కప్‌హోల్డర్లు, రీక్లైన్ ఫీచర్‌తో వస్తాయి. లాంగ్ జర్నీలో ఎండ నుండి రక్షణ పొందేందుకు సన్‌బ్లైండ్స్, ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడానికి కనెక్టింగ్ పోర్టులు ఇచ్చారు. మూడో వరుసకు వెళ్లడం సులభమే అయినప్పటికీ అక్కడ మోకాళ్లు పైకి మడిచి కూర్చోవాలి. అది పిల్లలకు మాత్రమే సెట్ అవుతుంది.
మొత్తంగా చూస్తే కియా సోరెంటో తన సెగ్మెంట్‌లో పర్ఫెక్ట్, బ్యాలెన్స్‌డ్ SUVగా నిరూపించుకుంటోంది. ఈ కార్ అద్భుతమైన స్పేస్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, మంచి రోడ్ ప్రెజెన్స్ తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. మీరు 30 నుంచి 40 లక్షల బడ్జెట్‌లో ఫుల్-సైజ్ లగ్జరీ హైబ్రిడ్ SUV కోసం చూస్తుంటే ఈ కారు మీ అంచనాలను అందుకోగలదు.
Frequently Asked Questions
కియా సోరెంటో ధర ఎంత?
కియా సోరెంటోలో ఎలాంటి ఇంజిన్ ఉపయోగించారు?
ఇందులో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 65 bhp ఎలక్ట్రిక్ మోటార్ కలిపి హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌గా పనిచేస్తాయి. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
కియా సోరెంటో ఎంత మైలేజ్ ఇస్తుంది?
సిటీలో కియా సోరెంటో దాదాపు లీటరుకు 10 కి.మీ మైలేజ్ ఇస్తుంది. హైవేపై దీని మైలేజ్ మరింత ఎక్కువ ఉంటుంది.
కియా సోరెంటోలోని ముఖ్య ఫీచర్లు ఏమిటి?
డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, ఆన్-బోర్డ్ ఏఐ అసిస్టెంట్ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. రెండో వరుసలో వెంటిలేటెడ్ క్యాప్టెన్ సీట్లు లభిస్తాయి.
ట్రెండింగ్ వార్తలు























