అన్వేషించండి

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460km దూరం జర్నీ.. 7 ఎయిర్‌బ్యాగ్స్‌తో కియా కొత్త PV7 ఎలక్ట్రిక్ వ్యాన్!

కియా కొత్త PV7 ఎలక్ట్రిక్ వ్యాన్‌ను ఆవిష్కరించింది. 11 సీటర్ సామర్థ్యం, 460 కి.మీ. రేంజ్, 7 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్ 2 ఏడీఏఎస్‌తో వస్తోంది.

Kia PV7 Electric Van: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కియా మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. కియా PV7 ఎలక్ట్రిక్ వ్యాన్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. ఇది ఈ సంస్థ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ వ్యాన్. ఇప్పటికే PV5ను తీసుకొచ్చిన కియా.. ఇప్పుడు దాని కంటే పెద్దదైన PV7ను పరిచయం చేసింది.

రెండు వెర్షన్లు

PV7ను రెండు ప్రధాన వెర్షన్లలో అందిస్తోంది, అవి: ప్యాసింజర్ వెర్షన్ & కార్గో వెర్షన్‌. ప్యాసింజర్ వెర్షన్‌లో మార్కెట్‌ను బట్టి 9 మంది లేదా 11 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే 11 సీటర్ వెర్షన్‌ను కొరియా మార్కెట్‌కు పరిమితం చేయనుంది. ఇతర మార్కెట్లలో గరిష్ఠంగా 9 సీట్లతో వస్తుంది. టూర్లు, కుటుంబ ప్రయాణాలు, గ్రూప్ ట్రావెల్‌కు పెద్ద వాహనం అవసరమయ్యే వారికి ఈ వ్యాన్ ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. 

కార్గో వెర్షన్‌ను వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో గరిష్ఠంగా 1,200 కిలోల వరకు సరుకును తరలించవచ్చు.

PV7లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 71.5 కిలోవాట్ అవర్ ‍‌(71.5kWh) & 96.2 కిలోవాట్ అవర్ ‍‌(96.2kWh) బ్యాటరీలను అందిస్తున్నారు. వీటికి ముందు చక్రాలను నడిపించే ‍‌(FWD) ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. ఈ మోటార్ 268 హెచ్‌పీ శక్తిని, 400 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

460km రేంజ్‌ 

పెద్ద బ్యాటరీని ‍‌(96.2kWh) ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కియా చెబుతోంది. ఇది WLTP ప్రమాణాల ప్రకారం వెల్లడించిన రేంజ్. 350kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసేందుకు 25-30 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ వ్యాన్‌లో 800 వోల్ట్ (800V) ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. ముందు భాగంలో AC/DC ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. అదనంగా వెనుక వైపు AC ఛార్జింగ్ పోర్టును కూడా ఎంపికగా అందిస్తున్నారు. భవిష్యత్తులో ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌ను (AWD) కూడా తీసుకురానున్నారు.

డిజైన్ పరంగా PV7లో PV5 పోలికలు కనిపిస్తాయి. అయితే, PV7 మరింత పొడవుగా ఉంటుంది. ముందు భాగంలో C ఆకారంలో LED DRLs, సన్నని LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. నలుపు రంగు ట్రిమ్‌తో ముందు భాగానికి ప్రత్యేక రూపం ఇచ్చారు.

రెండు వెర్షన్లలోనూ పవర్‌తో పనిచేసే స్లైడింగ్ డోర్లు ఉంటాయి. కార్గో వెర్షన్‌లో మాన్యువల్ స్లైడింగ్ డోర్లను కూడా ఎంచుకోవచ్చు. ప్యాసింజర్ వెర్షన్‌లో పెద్ద గాజు ప్రాంతం ఉంటుంది. వెనుక భాగంలో సన్నని టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: బ్రేక్ వేయడం నుంచి లేన్ మార్చే వరకు.. కారులో ADAS ఉంటే భద్రత మరింత పెరుగుతుందా?

PV7 పొడవు 5,350 మిల్లీమీటర్లు. వెడల్పు 1,995 మిల్లీమీటర్లు. ఎత్తు 1,990 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 3,500 మిల్లీమీటర్లు. పరిమాణంలో ఇది కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటుంది.

లోపల కూడా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 14.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే ప్లియోస్ కనెక్ట్ వ్యవస్థను పొందుతుంది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది.

7-సీటర్‌ వేరియంట్ 

ప్యాసింజర్ వెర్షన్‌లో ఏడు సీట్ల వేరియంట్ కూడా ఉంటుంది. ఇందులో కొన్ని సీట్లను తొలగించి లగేజీకి అదనపు స్థలం కల్పించవచ్చు. ముందు వరుస మినహా మిగతా వరుసలకు రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. 100 వాట్ల USB టైప్ C ఛార్జింగ్ పోర్టులు కూడా ఉంటాయి.

భద్రత విషయంలోనూ PV7పై కియా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. రూఫ్‌లో కో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. లెవల్ 2 ADAS సదుపాయం ఉంటుంది. ఇది డ్రైవర్‌కు వివిధ సందర్భాల్లో సహాయం చేస్తుంది.

కియా PV7ను కొరియా & యూరప్ మార్కెట్లలో 2027 ద్వితీయార్థంలో విడుదల చేయనుంది. తర్వాత ఇతర మార్కెట్లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Hyundai Bayon ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.10 లక్షలు.. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్ ధర ఎంతవుతుందంటే?
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధర ఎంత? విజయవాడలో ఎంత?.. పూర్తి లెక్కలివే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget