2024 Kia Cars: 2024లో హ్యుందాయ్, కియా లాంచ్ చేయనున్న ఎస్‌యూవీలు ఇవే - ఎన్ని ఉన్నాయంటే?
2024 Hyundai Cars: 2024లో హ్యుందాయ్, కియా కొన్ని ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేయనున్నాయి.
Kia Motors and Hyundai: హ్యుందాయ్, కియా కంపెనీలు 2024లో ఎన్నో కార్లు, ఎస్‌యూవీలు లాంచ్ చేయనున్నాయి. ఇవి భారత మార్కెట్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. 2024లో హ్యుందాయ్ ఇండియా తీసుకురానున్న కార్లలో అప్‌డేట్ చేసిన మోడల్స్ ఉంటాయి. దాని ప్రసిద్ధ ఎస్‌యూవీలు, కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అదేవిధంగా కియా 2024లో దేశంలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ 2024 చివరిలోపు భారతీయ మార్కెట్లో క్రెటా, అల్కాజార్, టక్సన్‌లకు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌లను పరిచయం చేస్తుంది. కంపెనీ మొదటగా క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 జనవరి 16వ తేదీన లాంచ్ చేస్తుంది. అయితే అల్కజార్ ఫేస్‌లిఫ్ట్, టక్సన్ ఫేస్‌లిఫ్ట్ 2024 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో క్రెటా డిజైన్, ఇంటీరియర్ మార్పులతో రానుంది. అదనంగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఇందులో అందించనున్నారని తెలుస్తోంది.
హ్యుందాయ్ అయోనిక్ 6
అయోనిక్ 5 విజయం తర్వాత హ్యుందాయ్ ఇప్పుడు అయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్‌ను 2024లో దేశంలో విడుదల చేయనుంది. దీన్ని అయోనిక్ 5కు చెందిన ఈ-జీఎంపీ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. ఇది కాకుండా కంపెనీ కొత్త తరం కోనాను కూడా విడుదల చేయవచ్చు. 2024లో గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందుతుంది. అవి 48.4 కేడబ్ల్యూహెచ్, 65.4 కేడబ్ల్యూహెచ్ ఆప్షన్లు. ఇవి వరుసగా 155 పీఎస్, 218 పీఎస్ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
హ్యుందాయ్ వచ్చే ఏడాది క్రెటా ఈవీని కూడా విడుదల చేయనుంది. దీన్ని భారతీయ రోడ్లపై అనేకసార్లు పరీక్షించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి రాబోయే ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పోటీపడుతుంది. ఇది 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి రానుంది. గ్లోబల్ స్పెక్ కోనా ఈవీలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో అందించనున్నారు.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్
2024 జనవరిలో కియా మన దేశంలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. వినియోగదారులు రూ. 20,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్ లేదా డీలర్‌షిప్‌లో ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. ఈ నవీకరించబడిన మోడల్ ఏడీఏఎస్ లెవెల్ 1 సిస్టమ్‌తో పాటు అనేక ప్రధాన డిజైన్, ఇంటీరియర్ మార్పులతో వస్తుంది. ఇది కాకుండా ఎస్‌యూవీలో డీజిల్ మాన్యువల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో డీజిల్‌తో రానుంది.
కియా కార్నివాల్, ఈవీ6
కియా నాలుగో తరం కార్నివాల్ ఎంపీవీని 2024 ద్వితీయార్ధంలో విడుదల చేయనుంది. కొత్త మోడల్ మునుపటి మోడల్ కంటే కొంచెం పొడవుగా, వెడల్పుగా ఉంది. ఎంసీవీ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో అందించబడుతుంది. అదనంగా కంపెనీ 3 వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ9ని 2024లో మార్కెట్లో విడుదల చేస్తుంది. కొత్త మోడల్‌ను స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. ఇది వేరియంట్‌ను బట్టి మల్టీ సీటింగ్ లేఅవుట్‌లతో వస్తుంది. కియా ఈవీ9 గ్లోబల్ మార్కెట్‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లను కూడా కలిగి ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!