అన్వేషించండి

Kawasaki Z650: ధర, పవర్‌, ఫీచర్లు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌ రోడ్‌ ఖర్చు వరకు పూర్తి వివరాలు

Kawasaki Z650 బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఇంజిన్‌ పవర్‌, బరువు, సీట్‌ హైట్‌, ఫీచర్లు, ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పాటు హైదరాబాద్‌, విజయవాడ ఆన్‌ రోడ్‌ ధరలు తెలుసుకోండి.

Kawasaki Z650 Price And Specifications: కవాసాకి Z650... ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది దాని అగ్రెసివ్‌ డిజైన్‌. కవాసాకి ప్రసిద్ధి చెందిన Sugomi స్టైలింగ్‌తో రూపొందిన Z650 బైక్‌, Z900 లాంటి పెద్ద బైక్‌ స్థాయిలో అమ్మకాలు లేకపోయినా, పెర్ఫార్మెన్స్‌ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడదు. మీరు ఒక ప్రీమియం నేకడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కొనాలనుకుంటే, Z650ను షార్ట్‌లిస్ట్‌ చేసే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

1. ఇంజిన్‌ పవర్‌ ఎంత?

Kawasaki Z650లో 649cc లిక్విడ్‌ కూల్డ్‌, ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 8,000rpm వద్ద 68hp పవర్‌, 6,700rpm వద్ద 64Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ ఉండటంతో గేర్‌ షిఫ్టింగ్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీ రైడింగ్‌ అయినా, హైవే రైడింగ్‌ అయినా ఈ ఇంజిన్‌ నమ్మకంగా పనిచేస్తుంది.

2. బైక్‌ బరువు ఎంత?

Z650 కర్బ్‌ వెయిట్‌ 188 కిలోలు మాత్రమే. ఇది కవాసాకి 650cc సెగ్మెంట్‌లోనే అతి తక్కువ బరువు ఉన్న బైక్‌. ముఖ్యంగా పవర్‌ టు వెయిట్‌ రేషియో 361.70hp/tonne ఉండటంతో, ఈ ధర శ్రేణిలో ఇది చాలా శక్తిమంతమైన ఎంపికగా నిలుస్తుంది. కొత్తగా బిగ్‌ బైక్‌ రైడ్‌ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్లస్‌ పాయింట్‌.

3. సీట్‌ హైట్‌ ఎంత?

ఈ బైక్‌ సీట్‌ హైట్‌ 790mm. సీట్‌ డిజైన్‌ న్యారోగా ఉండటంతో, సగటు ఎత్తు ఉన్న రైడర్లు కూడా సులభంగా కాళ్లు నేలపై పెట్టగలుగుతారు. రోజువారీ వినియోగంలోనూ, లాంగ్‌ రైడ్స్‌లోనూ ఇది కంఫర్ట్‌ను అందిస్తుంది.

4. ఫీచర్లు ఏం ఉన్నాయి?

Kawasaki Z650లో 4.3 అంగుళాల ఫుల్‌ కలర్‌ TFT డిస్‌ప్లే ఉంది. Rideology యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాదు, ఆల్‌ LED లైటింగ్‌, మూడు స్థాయిల ట్రాక్షన్‌ కంట్రోల్‌, డ్యూయల్‌ ఛానల్‌ ABS వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లు బైక్‌ను మరింత ప్రీమియంగా మార్చాయి.

5. ధర ఎంత? ఆన్‌ రోడ్‌ ఖర్చు ఎంత?

Kawasaki Z650 ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) రూ.7.26 లక్షలు.

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర సుమారు రూ.8,92,839 కాగా, విజయవాడలో ఆన్‌ రోడ్‌ ధర సుమారు రూ.8,48,994గా ఉంటుంది. 

అంతర్జాతీయంగా Z650 S అనే కొత్త వేరియంట్‌ను కవాసాకి పరిచయం చేసింది. ఇది భవిష్యత్తులో భారత్‌లోకి వచ్చే అవకాశముంది.

మొత్తానికి, డిజైన్‌, పనితీరు, ఫీచర్లు, రైడింగ్‌ ఈజ్‌ అన్నింటిలోనూ బ్యాలెన్స్‌ ఉన్న నేకడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కావాలంటే Kawasaki Z650 ఒక గట్టి ఎంపికగా చెప్పుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget