జవా, యేజ్దీ బైక్‌లకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. కస్టమర్‌లు బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రారంభ డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. 100 శాతం ఆన్ రోడ్ ఫండింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Zero Down Payment | పండుగల సీజన్‌లో జవా, యేజ్దీ బైక్‌లపై జీరో డౌన్ పేమెంట్ అనే అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, సులువైన EMI ఫైనాన్స్ స్కీమ్ పూర్తి వివరాలను తెలుసుకోండి.

- నవరాత్రి పండుగల సందర్భంగా జవా, యేజ్దీ జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు.
- 100% ఆన్ రోడ్ ఫండింగ్, బీమా, RTO ఖర్చులు చేర్చబడ్డాయి.
- తక్కువ వడ్డీతో సులభ EMI, 1-5 సంవత్సరాల లోన్ ఎంపికలు.
- అన్ని ప్రముఖ మోడళ్లపై పరిమిత కాలం ఆఫర్ అందుబాటులో.
Yezdi Bikes | భారత్‌లో నవరాత్రి పండుగల సమయంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో అనేక రకాల ఆఫర్లు కనిపిస్తుంటాయి. ఈ ఆఫర్లు దసరా నుంచి దీపావళి వరకు కొనసాగుతాయి. ఈ మధ్యకాలంలో పలు కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇచ్చి సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు జవా, యేజ్దీ కంపెనీల బైక్స్ కూడా తన వినియోగదారులకు అలాంటి ఆఫర్ అందిస్తోంది.
ఈ ఫెస్టివల్ ఆఫర్ కింద బైక్ లవర్స్ తమ క్లాసిక్ లేదా అడ్వెంచర్ బైక్‌ను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే కంపెనీ పలు ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్సింగ్ భాగస్వాములతో చర్చలు జరిపింది. జవా, యేజ్దీ బైక్‌లపై ఎలాంటి ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయో, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జీరో డౌన్ పేమెంట్ ఆఫర్
జవా, యేజ్దీ మోటార్ సైకిల్స్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫెస్టివ్ ఫైనాన్స్ ప్లాన్ కస్టమర్లకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ అందిస్తున్నాయి. మీరు బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రారంభ డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ 100 శాతం ఆన్ రోడ్ ఫండింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందులో బైక్ ఎక్స్ షోరూమ్ ధరతో పాటు ఇన్సూరెన్స్, RTO రిజిస్ట్రేషన్ ఖర్చులు ఈజీ లోన్ ప్రక్రియలో చేర్చుతారు.
ఈజీ EMI అవకాశం
మరోవైపు వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ పండుగ సీజన్‌లో తక్కువ వడ్డీ రేటు, అత్యంత చౌకైన EMI స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ సౌకర్యాన్ని బట్టి 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు వెహికల్ లోన్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా లోన్ అప్లై చేసుకునే వినియోగదారులకు ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు, పేపర్ లెస్ వర్క్ (డాక్యుమెంటేషన్) వంటి సౌకర్యాలు ఇస్తాయి. దీనివల్ల లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగంగా, సులభంగా అవుతుంది.
ఈ మోడల్స్‌పై ఆఫర్
జవా, యేజ్దీ బ్రాండ్‌లకు చెందిన దాదాపు అన్ని ప్రముఖ బైక్ కంపెనీలపై ఈ ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్ లిమిటెడ్ టైం వరకు ఇస్తారు. ఇందులో జవా 350, జవా పెరాక్, జవా 42, 42 బాబర్ వంటి మోడళ్లు బైక్ లవర్స్‌కు ఉన్నాయి. ఈ మోడల్స్ తమ రెట్రో డిజైన్‌తో ఫేమస్ అయ్యాయి. ఇక ఆఫ్‌రోడింగ్, లాంగ్ జర్నీ ఇష్టపడే వారి కోసం యేజ్దీ అడ్వెంచర్, యేజ్దీ రోడ్‌స్టర్, యేజ్దీ స్క్రాంబ్లర్ వంటి పవర్ ఫుల్ వాహనాలపై కూడా జీరో డౌన్ పేమెంట్, స్పెషల్ EMI డీల్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ ఆఫర్ ఎప్పటి వరకు..
కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న జవా, యేజ్దీ డీలర్‌షిప్‌లలో లిమిటెడ్ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్న వినియోగదారులు షోరూమ్‌కు వెళ్లి బైక్ కొనవచ్చు. పండుగ సమయంలో వాహనాల డిమాండ్, వెయిటింగ్ పీరియడ్ దృష్టిలో ఉంచుకుని, సమయానికి డెలివరీ రావడానికి వినియోగదారులు సరైన సమయానికి తమకు నచ్చిన మోడల్, కలర్ ఆప్షన్‌ను బుక్ చేసుకోవాలని సూచించారు.
Frequently Asked Questions
జవా, యేజ్దీ బైక్‌ల ప్రధాన పండుగ ఆఫర్ ఏమిటి?
ఈ ఆఫర్ కింద EMI సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
కంపెనీ తక్కువ వడ్డీ రేటు, అత్యంత చౌకైన EMI స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ సౌకర్యాన్ని బట్టి 1 ఏడాది నుండి 5 సంవత్సరాల వరకు వెహికల్ లోన్ ఆప్షన్ తీసుకోవచ్చు.
ఈ ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్ ఏ బైక్ మోడల్స్‌పై వర్తిస్తుంది?
జవా 350, పెరాక్, 42, 42 బాబర్ వంటి జవా మోడల్స్‌పై ఈ ఆఫర్ లభిస్తుంది. అలాగే యేజ్దీ అడ్వెంచర్, రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్ మోడల్స్‌పై కూడా ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ పండుగ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుంది?
ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న జవా, యేజ్దీ డీలర్‌షిప్‌లలో లిమిటెడ్ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండుగ సీజన్ డిమాండ్ దృష్ట్యా ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు























