GST Slab Decrese For Small Cars: చిన్న కార్లు కొనుగోలుదారులకు ఊరట..! జీఎస్టీ స్లాబ్ ల సవరింపు..!! ఆ పండుగ నుంచే అమలు
కార్ల అమ్మకాల వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జీఎస్టీ స్లాబుల సవరింపు ద్వారా కార్ల ధరలను తగ్గించే అవకాశముంది. ముఖ్యంగా చిన్నకార్లు చాలా లాభపడుతాయని తెలుస్తోంది.

GST Slabs Latest News: చిన్న కార్లను కొనాలిఅనుకునే వారికి త్వరలోనే తీపి కబురు అందనున్నట్లు తెలుస్తోంది. ఈసెగ్మెంట్ లోని కార్ల జీఎస్టీ స్లాబును తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. భారత ప్రభుత్వం చిన్న కార్లపై వస్తు సేవల పన్ను (GST)ని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని తాజాగా వెల్లడైంది. బీమా ప్రీమియంలపై గరిష్టంగా 5 శాతం GSTని కూడా అధికారులు ప్రతిపాదించారు. దీపావళి నాటికి ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో గత దశాబ్దంలో ఆటోమొబైల్ రంగానికి అతిపెద్ద పన్ను సవరణగా ఇది నిలవ నుందని తెలుస్తోంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 4.3 మిలియన్ కార్లలో మూడింట ఒక వంతు చిన్న కార్లే ఉన్నాయి.
GST just got an update! 🎉 The tax on small cars is now 18% (down from 28%), and there's a proposal to reduce the GST on health insurance. Good news for everyone!
— contangoacademy (@contangoacademy) August 20, 2025
Follow us on Instagram👇 https://t.co/BvWAMz94WU pic.twitter.com/NtxNW0sVAh
ప్రధాని మోడీ ప్రకటనతో..
స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిఎస్‌టి సంస్కరణల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే . తాము తదుపరి తరం జిఎస్‌టి సంస్కరణలను తీసుకువస్తున్నామని, సామాన్యులకు అవసరమైన పన్నులు గణనీయంగా తగ్గుతాయని ఆయన అన్నారు, అయితే ఒక నిర్దిష్ట రంగాన్ని ప్రస్తావించలేదు. అయితే చిన్నకార్లకు బెనిఫిట్ ఉండనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తం అమ్మకాల్లో 1200cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల కార్లనే 60 శాతానికి పైగా అమ్ముతున్నట్లు మారుతి సుజుకి, టాటా మోటార్స్ మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో ముడి సరుకు ధర, భద్రత పెంపు తదితర కారణాల వల్ల కార్ల ధరలను పెంచాయి.
వృద్ధి ఆందోళనకరం..
గత 6 సంవత్సరాలలో కేవలం 4.4 శాతం మాత్రమే కార్ల అమ్మకాలలో వృద్ధి నమోదైందని, దానిని సులభతరం చేసే ప్రభుత్వ విధానాలు కావాలని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ ఇటీవల పేర్కొన్నరు. కార్ల పరిశ్రమ వృద్ధి రేటు చాలా ఆందోళన కలిగించే విషయంగా మారిందని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, దేశీయ ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 2 శాతం మాత్రమే పెరిగాయని, ప్రస్తుత సంవత్సరానికి, పరిశ్రమ 1-4 శాతం వృద్ధిని ఆశిస్తోందని పేర్కొన్నారు. ఇక పెద్ద కార్ల జీఎస్టీ రేటును కూడా సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం పన్నులో 28 శాతం GST మరియు 22 శాతం వరకు సెస్సు ఉంది. త్వరలో దీన్ని 40 శాతం స్లాబ్ కేటగిరీలోకి చేర్చవచ్చు. మొత్తం పన్నును 43-50 శాతం పరిధిలో ఉంచడానికి అదనపు సుంకాలు జోడించబడవచ్చని తెలుస్తోంది.





















