అన్వేషించండి

Rare Earth-Free Motor: ఇక చైనా వైపు చూడక్కర్లేదు, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ లేని EV మోటార్‌తో చరిత్ర సృష్టించిన Simple Energy

Simple Energy EV: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ సింపుల్ ఎనర్జీ, ఒక సంచలనం సృష్టించింది. అరుదైన భూమి మూలకాలను ఉపయోగించకుండానే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును అభివృద్ధి చేసింది.

Simple Energy Rare Earth-Free Motor Innovation: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ "సింపుల్ ఎనర్జీ", ఆటోమొబైల్‌ రంగంలో చరిత్ర సృష్టించింది & కొత్త సంచలనానికి కారణమైంది. రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (అరుదైన భూమి మూలకాలు) ఉపయోగించకుండా, దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును ఈ EV కంపెనీ అభివృద్ధి చేసింది. దీని అర్థం.. EV మోటారు రూపకల్పన కోసం చైనా నుంచి దిగుమతి చేసుకునే అరుదైన లోహాలు అవసరం ఇకపై ఉండదు. కొన్ని నెలల క్రితం, చైనా భారతదేశానికి అరుదైన భూమి మూలకాల సరఫరాను నిలిపివేసింది, ఇది భారతీయ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అయితే, సింపుల్ ఎనర్జీ ఈ సవాలును అవకాశంగా మార్చుకుంది, అరుదైన భూమి మూలకాలు లేని మోటారు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ ఆటో కంపెనీగా అవతరించింది.

అరుదైన భూమి మూలకాలు అంటే ఏంటి, అవి ఎందుకు ముఖ్యం?
నియోడైమియం, డైస్ప్రోసియం వంటి ప్రత్యేక లోహాలను అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements) అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లుగానే ఇవి చాలా అదురుగా లభిస్తాయి, ప్రపంచంలోనే అత్యధికంగా చైనా భూమిలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్లను వేగంగా & మన్నికగా తయారు చేయడంలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు, ఈ లోహాలలో ఎక్కువ భాగం చైనా నుంచి భారత్‌లోకి వచ్చాయి. భారతదేశానికి అరుదైన భూమి మూలకాల సరఫరాపై చైనా ఆంక్షలు విధించినప్పుడు, మన ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే, సింపుల్ ఎనర్జీ ఈ సవాలును స్వీకరించింది. ఈ కంపెనీ అంతర్గత పరిశోధన & అభివృద్ధి (R&D) బృందం ప్రత్యామ్నాయ పదార్థాలు & స్మార్ట్ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేసింది. పనితీరులో ఏ మాత్రం రాజీ పడని EV మోటారును డెవలప్‌ చేసి, చైనీస్ లోహాలపై ఆధారపడే అవసరాన్ని తొలగించింది.

సింపుల్ ఎనర్జీ కొత్త EV మోటార్ ఫీచర్లు
ఈ మోటారులో దాదాపు 95% భారతదేశంలోనే తయారవుతుందని, దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. ఈ మోటారు సింపుల్ వన్ జెన్ 1.5 (248 కి.మీ. రేంజ్‌) & వన్ ఎస్ (181 కి.మీ. రేంజ్‌) వంటి సింపుల్ ఎనర్జీ పాపులర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బిగిస్తారు. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న 2,00,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీలో ఈ మోటారు ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మేక్ ఇన్ ఇండియా'ను వాస్తవ రూపంలోకి తెచ్చామని సింపుల్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. 

భారతదేశంలో EVల రేట్లు తగ్గుతాయా?
రేర్ ఎర్త్-ఫ్రీ మోటార్ ఆవిష్కరణతో, భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఇకపై చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది EV మోటార్ & బ్యాటరీ తయారీ ఖర్చును ప్రభావితం చేస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఛార్జింగ్ టెక్నాలజీ ధరలను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత తక్కువ ధరతో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి, సరికొత్త ఆవిష్కరణ సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో భారతదేశ స్వావలంబనకు బలమైన పునాది వేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Embed widget