అన్వేషించండి

Automobile Sector: పాత కార్లకు బదులు కొత్త కార్లు, కోట్లలో ఉద్యోగాలు - సెప్టెంబర్‌ 22 నుంచి ఆటోమొబైల్‌ రంగంలో పెను మార్పులు!

Automobile Sector After September 22nd: ఆటోమొబైల్‌ రంగం కొత్త మార్గంలో అడుగుపెట్టనుంది. GST స్లాబ్‌లు తగ్గుతాయి, కొత్త కార్లపై 10% వరకు ఆదా అవుతుంది, కోట్లలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

Automobile Sector After GST 2.0 Reforms: సెప్టెంబర్‌ 22 నుంచి, భారత ఆటోమొబైల్‌ రంగం పెద్ద ఎత్తున మార్పులు చూడబోతుంది. ఆ రోజు నుంచే కొత్త జీఎస్‌టీ సంస్కరణలు (GST Reforms 2.0) అమలులోకి వస్తాయి. కొత్త GST హేతుబద్ధీకరణతో వాహన ధరలు తగ్గడం, పాత వాహనాలను కొత్త వాటితో రీప్లేస్‌ చేసే ప్రణాళికలు, ఈ రంగంలో పని చేస్తున్న 3.5 కోట్ల మందికి మద్దతు వంటి అంశాలు ఆటో ఇండస్ట్రీకి కొత్త వేగాన్ని అందిస్తాయి.

భారత ప్రభుత్వం ప్రకటించిన GST 2.0 రూల్స్‌ ఆటో రంగానికి & దాని సంబంధిత అన్ని పరిశ్రమలకు గేమ్-ఛేంజర్ అవుతుంది. కొత్త GST నిర్మాణం కింద, టూవీలర్లు, చిన్న కార్లు, ట్రాక్టర్లు, బస్సులు & వాణిజ్య వాహనాలపై పన్నులు తగ్గుతాయి. ఇది వాహన ధరలు తగ్గిస్తుంది, డిమాండ్‌ పెంచుతుంది & కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సంస్కరణ మేక్ ఇన్ ఇండియా, PM గతి శక్తి & క్లీన్ మొబిలిటీ వంటి కార్యక్రమాలను కూడా సపోర్ట్‌ చేస్తుంది.

సామాన్యుడి కార్లు 10% వరకు చౌక
నిజానికి, GST రేట్ల తగ్గింపు వల్ల వచ్చే మొదటి & అతి పెద్ద ప్రభావం కామన్‌ మ్యాన్‌పైనే ఉంటుంది. ద్విచక్ర వాహనాలు & చిన్న కార్లు 10% వరకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. GST స్లాబ్‌ల తగ్గింపుతో పాటు కంపెనీలు అదనంగా డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ & పట్టణ ప్రాంతాలలోనూ ఆటోమొబైల్ రంగానికి డిమాండ్‌ పెరుగుతుంది. ఇది లాజిస్టిక్స్ & సేవా రంగాలలో కూడా వృద్ధికి దారితీస్తుంది. ఇంకా, బ్యాంకులు, NBFCలు & ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా లోన్‌ తీసుకుని వెహికల్స్‌ కొనుగోలు చేయడం సులభం అవుతుంది, EMI భారం తగ్గుతుంది.

3.5 కోట్ల ఉద్యోగాలకు మద్దతు
GST సంస్కరణల లక్ష్యం కేవలం వాహనాల ధరలను తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఉపాధిపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. నివేదికల ప్రకారం, GST 2.0 ఆటో & సంబంధిత పరిశ్రమలలో 35 మిలియన్లకు (3.5 కోట్లు) పైగా ఉద్యోగాలకు మద్దతు ఇస్తుంది. టైర్లు, బ్యాటరీలు, ఉక్కు, ప్లాస్టిక్‌, గాజు & ఎలక్ట్రానిక్స్ వంటి చిన్న పరిశ్రమలను బలోపేతం చేస్తుంది. డ్రైవర్లు, మెకానిక్‌లు, గిగ్ వర్కర్లు & సేవా రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

పాత వాహనాలకు గుడ్‌బై - కొత్త వాహనాలకు వెల్‌కమ్‌!
GST సంస్కరణ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, ప్రజలు ఇప్పుడు తమ పాత & కాలుష్య కారకాల వాహనాల నుంచి కొత్త, ఇంధన-సమర్థవంతమైన, EV-ఆధారిత వాహనాలకు మారతారు. ఇది రోడ్డు కాలుష్యం & ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సాయపడుతుంది. బస్సులు వంటి ప్రజా రవాణా వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, భారత ప్రభుత్వం వాహనాల స్క్రాప్‌ పాలసీని మరింత బలోపేతం చేస్తోంది. రోడ్లపై నడుస్తున్న పాత, కాలుష్య కారక వాహనాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

GST హేతుబద్ధీకరణ - రెండు ప్రధాన రేట్లు మాత్రమే
ఇప్పుడు GST నాలుగు స్లాబ్‌లుగా ఉంది అవి - 5%, 12%, 18% & 28%. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి నాలుగు కాస్తా రెండు అవుతాయి. అంటే, రెండు ప్రధాన GST రేట్లు (5% & 18%) మాత్రమే అమలవుతాయి. దీని వల్ల ఆటోమొబైల్‌ రంగంలో పన్నుల భారం తగ్గి, వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. లగ్జరీ & సిన్‌ గూడ్స్‌ మీద మాత్రం ప్రత్యేకంగా 40% పన్ను విధిస్తారు. ప్రభుత్వం దీనిని తదుపరి తరం GST హేతుబద్ధీకరణ అని చెబుతోంది.

వాహన రంగానికి భవిష్యత్ దశ &దిశ
ఈ మార్పులన్నీ కలిసి ఆటోమొబైల్‌ రంగానికి ఒక కొత్త దశను &దిశను నిర్దేశిస్తాయి. వాహన విక్రయాలు పెరగడం, ఉత్పత్తి వృద్ధి, కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ - అన్నీ కలిసి పరిశ్రమను బలోపేతం చేస్తాయి. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్‌ 22 తర్వాత ఆటోమొబైల్‌ రంగం ఇటు సామాన్య ప్రజలకు, అటు పరిశ్రమకు అందరికీ లాభదాయకంగా మారబోతోంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే
కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!
మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
మీరు బ్రేక్ వేయకముందే మీ కారు అలర్ట్.. భారత్‌లోకి వస్తున్న V2V సేఫ్టీ సిస్టమ్ ఇదే!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget