అన్వేషించండి

ఇప్పుడు ఈజీగా Hyundai Creta Electric కొనండి - రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, EMI వివరాలు ఇవిగో

Hyundai Creta Electric EMI Options: మీరు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే, కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చేసి ఈ కారును మీ ఇంటికి సులభంగా తీసుకురావచ్చు.

Hyundai Creta Electric Price, Down Payment, Car Loan EMI Details: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది, ప్రీమియం SUV ఫీలింగ్‌ ఇస్తుంది. కారు ముందు భాగంలో క్లోజ్డ్‌ గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, డే‌టైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌ (DRLs) ఫ్యూచరిస్టిక్‌ లుక్‌ అందిస్తున్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో ఏరోడైనమిక్‌ డిజైన్‌, అల్లాయ్‌ వీల్స్‌ ఈ SUV కి స్పోర్టీ అట్రాక్షన్‌ ఇస్తున్నాయి. వెనుక భాగంలో స్లీక్‌ టెయిల్‌ ల్యాంప్స్‌, క్లీన్‌ లైన్స్‌ వంటివి క్రెటా ఎలక్ట్రిక్‌ డిజైన్‌ను మరింత మోడ్రన్‌గా చూపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV 'క్రెటా' బేస్‌ వేరియంట్‌ (Executive 42KWh) ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.02 లక్షలు. విజయవాడలో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 12,000 RTO ఛార్జీలు, దాదాపు రూ. 77,000 బీమా, దాదాపు రూ. 19,000 ఇతర ఛార్జీలు చెల్లించాలి. ఇవన్నీ కలిపితే, ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 19.10 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 19.12 లక్షలు అవుతుంది.

మీరు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటే, కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తాన్ని కార్‌ లోన్‌గా తీసుకుని, ప్రతి నెలా EMI కట్టుకుంటే వెళితే సరిపోతుంది.

2 లక్షల డౌన్ పేమెంట్‌పై EMI ఎంత అవుతుంది?
ఉదాహరణకు, మీరు విజయవాడలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారులో  Executive 42KWh వేరియంట్‌ కొనాలనుకుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, రూ. 17.10 లక్షలకు కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌, మీకు ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్లు చూద్దాం.

7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 27,504 అవుతుంది. ఈ ఏడేళ్లలో మీరు మొత్తం రూ. 6,00,812 వడ్డీ చెల్లించాలి.

6 సంవత్సరాల కాల పరిమితితో అప్పు తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 30,815 అవుతుంది. ఈ ఆరేళ్లలో మొత్తం రూ. 5,09,156 వడ్డీ చెల్లించాలి.

5 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, మీ నెలవారీ EMI రూ. 35,486 అవుతుంది. ఈ ఐదేళ్లలో మొత్తం రూ. 4,19,636 వడ్డీ చెల్లించాలి.

4 సంవత్సరాల్లో లోన్‌ మొత్తం క్లియర్‌ చేయాలనుకుంటే, మీ నెలవారీ EMI రూ. 42,541 అవుతుంది. ఈ నాలుగేళ్లలో మొత్తం రూ. 3,32,444 వడ్డీ చెల్లించాలి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ పోటీ కార్లు 
క్రెటా ఎలక్ట్రిక్, ప్రస్తుతం, MG Windsor Pro EV & Tata Curvv EV తో నేరుగా పోటీ పడుతోంది. రాబోయే కాలంలో, ఇది Maruti Suzuki E Vitara, Toyota Electric Hyryder & Tata Harrier EV వంటి ఎలక్ట్రిక్ SUVల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. 

మీరు ఎలక్ట్రిక్ SUV కొనాలని ఆలోచిస్తుంటే, ప్రస్తుతం ఉన్న కార్లలో, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మీకు మంచి ఎంపిక. ఈ కారు ధర కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ... ఫీచర్లు & ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ SUV ప్రాక్టికల్‌ & ప్రీమియం ఆప్షన్‌గా నిలుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget