Hyundai Cars: హ్యుందాయ్ కార్లు కొనాలనుకుంటున్నారా - అయితే జులై బెస్ట్ - రూ.లక్ష వరకు తగ్గింపు!
జులైలో హ్యుందాయ్ మోటార్స్ కార్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది.
Hyundai Motor: హ్యుందాయ్ మోటార్ జూలైలో ఎంపిక చేసిన కార్ల కొనుగోలుపై తన వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. కస్టమర్లు ఈ ఆఫర్‌పై నగదు తగ్గింపు, కార్పొరేట్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్ కింద మీరు రూ. ఒక లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
కోనా ఎలక్ట్రిక్ కొనుగోలుపై మీరు ఈ నెలలో రూ. లక్ష వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారును ఎంజీ జెడ్ఎస్ ఈవీ, బీవైడీ అట్టో 3 తరహాలో తయారు చేశారు. ఈ కారులో 39.2 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. 136 హెచ్‌పీ పవర్, 395 ఎన్ఎం ఎలక్ట్రిక్ మోటార్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. మీరు 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ ద్వారా ఈ ఈవీని 57 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 452 కిలోమీటర్ల రేంజ్‌ను పొందుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.23.84 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
ఈ నెలలో కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై మొత్తం రూ.38,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 83 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.73 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య ఉంది.
హ్యుందాయ్ ఆరా
హ్యుందాయ్ ఆరాలో కూడా గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే ఇంజిన్‌ను అందించారు. ఈ నెలలో ఈ కారుపై రూ. 33,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. సంవత్సరం ప్రారంభంలోనే కారుకు ఒక ప్రధాన అప్‌డేట్ వచ్చింది. ఇది మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ వంటి కార్లతో పోటీపడుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.33 లక్షల నుంచి రూ.8.90 లక్షల మధ్య ఉంది.
హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ ఐ20 ఈ నెలలో రూ.20,000 వరకు తగ్గింపును పొందుతోంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను పొందుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.46 లక్షల నుంచి రూ.11.88 లక్షల మధ్య ఉంది. ఇది ఒక ప్రీమియం ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కారు.
హ్యుందాయ్ అల్కజర్
హ్యుందాయ్ అల్కజార్ ఈ నెలలో రూ.20,000 వరకు తగ్గింపును పొందుతోంది. ఇది 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను పొందుతుంది. రెండు ఇంజన్లు ప్రామాణికంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతాయి. ఇది కాకుండా పెట్రోల్‌లో 7 స్పీడ్ డీసీటీ, డీజిల్‌లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 16.77 లక్షల నుంచి రూ. 21.13 లక్షల మధ్య ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial