అన్వేషించండి

Toyota Hyryder SUV: హైదరాబాద్‌, విజయవాడ లేదా వైజాగ్‌ - టయోటా హైరైడర్ SUVని ఎక్కడ తక్కువకు కొనవచ్చు?

Toyota Urban Cruiser Hyryder SUV: పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ కారు 1 లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టయోటా పేర్కొంది. అదే సమయంలో, CNG వేరియంట్ మైలేజ్ కిలోగ్రాముకు 26.6 కిలోమీటర్లు.

Toyota Hyryder SUV Price And Features In Telugu: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనేది హైబ్రిడ్ SUV. ఇంధన సామర్థ్యం & ఆకర్షణీయమైన రూపం కారణంగా ఈ కారును ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. మీరు ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తక్కువ ధరకు పొందవచ్చో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది.

దిల్లీ & ముంబైలో ధర ఎంత? 

దిల్లీలో టయోటా హైరైడర్ బేస్‌ వేరియంట్‌ "E NeoDrive మైల్డ్ హైబ్రిడ్" వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 13.27 లక్షలు. ఇందులో RTO టాక్స్‌, బీమా & ఇతర ఛార్జీలు కూడా ఉన్నాయి. 
ముంబైలో దీని ఆన్‌-రోడ్‌ ప్రైస్‌ రూ. 13.48 లక్షలు. అంటే, ఈ SUV బేస్‌ వేరియంట్‌ను ముంబైలో కంటే దిల్లీలో రూ. 21 వేల తక్కువ ధరకు కొనవచ్చు, ఈ డబ్బు మీకు ఆదా అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర

హైదరాబాద్‌లో టయోటా హైరైడర్ బేస్‌ వేరియంట్‌ "E NeoDrive మైల్డ్ హైబ్రిడ్" వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 13.94 లక్షలు. దీనిలో ఎక్స్‌-షోరూమ్‌ ధరకు అదనంగా RTO టాక్స్‌ దాదాపు 1.98 లక్షలు, బీమా దాదాపు రూ. 51,000 & ఇతర ఛార్జీలు దాదాపు రూ. 12,000 కలిసి ఉన్నాయి.

వరంగల్‌లో, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 13.97 లక్షలు. RTO టాక్స్‌లో స్వల్ప తేడా వల్ల, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ నగరంలో ఆన్‌-రోడ్‌ రేటు రూ. 3,000 పెరిగింది.

విజయవాడలోనూ ఈ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలే అయినప్పటికీ, ఆన్‌-రోడ్‌ ధర మాత్రం దాదాపు రూ. 14.59 లక్షలు అవుతుంది. దీనిలో ఎక్స్‌-షోరూమ్‌ ధరకు అదనంగా RTO టాక్స్‌ దాదాపు 2.10 లక్షలు, బీమా దాదాపు రూ. 1.02 లక్షలు & ఇతర ఛార్జీలు దాదాపు రూ. 12,000 కలిసి ఉన్నాయి.

విశాఖపట్నంలో, ఇదే వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు కాగా, ఆన్‌-రోడ్‌ ధర మాత్రం దాదాపు రూ. 14.64 లక్షలు అవుతుంది. RTO టాక్స్‌, బీమా ప్రీమియం పెరగడం వల్ల, విజయవాడతో పోలిస్తే, ఈ సముద్ర తీర నగరంలో ఈ కారు రేటు రూ. 5,000 పెరిగింది. 

దీనిని బట్టి, ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణలో, టయోటా హైరైడర్ SUVని హైదరాబాద్‌లో కాస్త తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు, డబ్బు మిగిల్చుకోవచ్చు.  

టయోటా హైరైడర్ SUV ఫీచర్లు
హైరైడర్ SUVలో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ & 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు & 360-డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ SUV మూడు ఇంజిన్ ఎంపికలలో (1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) & 1.5-లీటర్ CNG ఇంజిన్) అందుబాటులో ఉంది.

మైలేజ్ 
దీని ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలలో... 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & e-CVT ఉన్నాయి. పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ 1 లీటరుకు 27.97 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. CNG వేరియంట్ మైలేజ్ కిలోగ్రాముకు 26.6 కి.మీ.గా కంపెనీ వెల్లడించింది. 

మీరు ఈ కారును కార్‌ లోన్‌పై కూడా కొనవచ్చు. బ్యాంక్‌ లోన్ & వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం, మీరు సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget