అన్వేషించండి

Driving Licence Update: డ్రైవింగ్‌ లైసెన్స్‌లో మొబైల్‌ నంబర్‌ మార్చుకోవాలా?, సింపుల్‌ ఆన్‌లైన్‌ ప్రాసెస్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో మీ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయకపోతే చలాన్లు, రెన్యువల్‌ అలర్ట్స్‌, సస్పెన్షన్‌ నోటీసులు మిస్‌ అవుతాయి. Parivahan ద్వారా నంబర్‌ అప్‌డేట్‌ చేసే సులభమైన ప్రాసెస్‌ ఈ కథనంలో.

Update Mobile Number On Driving Licence Online: చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ మీ దగ్గర ఉన్నప్పటికీ, అందులో ఉన్న మీ మొబైల్‌ నంబర్‌ పాతది లేదా తప్పుగా ఉందా?. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఆ నంబర్‌ మీదే ట్రాఫిక్‌ చలాన్లు, రెన్యువల్‌ రిమైండర్లు, లైసెన్స్‌ సస్పెన్షన్‌ అలర్ట్స్‌ వంటివి వస్తాయి. పాత మొబైల్‌ నంబర్‌ ఉంటే ఇవన్నీ మీకు రాకపోవచ్చు & మీకు తెలియకపోవచ్చు. దీనివల్ల, లైసెన్స్‌ గడువు మిస్‌ అవ్వడమో, చలాన్లు టైమ్‌లో క్లియర్‌ చేయకపోవడమో జరిగే ప్రమాదం ఉంది.

మొబైల్‌ నంబర్‌ ఎందుకు అప్‌డేట్‌ చేయాలి?
ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ అన్ని కమ్యూనికేషన్లను మొబైల్‌ నంబర్‌ ఆధారంగా పంపిస్తోంది. లైసెన్స్‌కు లింక్‌ అయి ఉన్న నంబర్‌ తప్పు అయితే మీకు ముఖ్యమైన నోటీసులు రాకపోవచ్చు. ఇది ముఖ్యంగా పాత డ్రైవర్లకు సమస్య అవుతోంది. అందుకే, అందరికీ మొబైల్‌ నంబర్‌ వెరిఫై చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

మొబైల్‌ నంబర్‌ ఎక్కడ అప్‌డేట్‌ చేయాలి?
మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయడం చాలా సులభం. ఇందుకోసం మీరు Parivahan.gov.in వెబ్‌సైట్‌ లేదా మీ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌ (ఉదాహరణకు TS Transport లేదా AP Transport) ఓపెన్‌ చేయాలి.

స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌

1. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి Driving Licence Services సెక్షన్‌లోకి వెళ్లండి.
2. “Update Mobile Number” అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయండి.
3. లైసెన్స్‌ వివరాలు ఎంటర్‌ చేసి, OTP ద్వారా వెరిఫై చేయండి.
4. కొత్త మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, సబ్మిట్‌ చేయండి.
5. కన్ఫర్మేషన్‌ పేజీని సేవ్‌ చేసుకోండి లేదా స్క్రీన్‌ షాట్‌ తీసుకోండి.

చాలా మంది సీనియర్‌ డ్రైవర్లు, తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు పాత నంబర్లు లింక్‌ చేసుకొని ఉన్నారు. వాళ్లందరికీ ఈ ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ తెలియకపోవచ్చు. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న పెద్దవారికి లేదా స్నేహితులకు కూడా ఈ అప్‌డేట్‌ చేయడంలో సహాయం చేయండి.

నంబర్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఏమవుతుంది?
అధికారులు చెప్పిన ప్రకారం, పాత నంబర్‌ వల్ల చలాన్లు లేదా లైసెన్స్‌ రీన్యువల్‌ అలర్ట్స్‌ రాకపోతే, లైసెన్స్‌ తాత్కాలికంగా సస్పెండ్‌ అవ్వడం కూడా జరగవచ్చు. ఈ విషయం తెలియక మీరు బండి తీసుకుని రోడ్డుపైకి వెళ్లినప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడతారు. ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి ముందుగానే మీ మొబైల్‌ నంబర్‌ సరి చేసుకోవడం మంచిది.

యువతకు ప్రత్యేక సూచన
యువ డ్రైవర్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ సర్వీసులు వాడుతున్నా, చాలా మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లో పాత నంబరే ఉంది. కొత్త సిమ్‌ తీసుకున్నా, మారినా లైసెన్స్‌లో అప్‌డేట్‌ చేయడం మర్చిపోవద్దు. ఇది కొన్ని నిమిషాల్లో పూర్తి చేసుకునే సింపుల్‌ ఆన్‌లైన్‌ స్టెప్‌.

మీ లైసెన్స్‌ వివరాలు అప్‌డేట్‌గా ఉంటేనే రవాణా శాఖ నుంచి వచ్చే మెసేజ్‌లు, అలర్ట్స్‌ సకాలంలో మీకు చేరతాయి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు వెంటనే Parivahan పోర్టల్‌లోకి వెళ్లి మీ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేసుకోండి, డ్రైవింగ్‌లో ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget