అన్వేషించండి

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ గైడ్: లక్షల్లో లాభాలు.. తక్కువ టైమ్‌లో పెట్టిన పెట్టుబడి వెనక్కి! 

భారత్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ రంగం ఇప్పుడిప్పుడే వేగంగా ఎదుగుతుంది. దీని ఏర్పాటుకు అయ్యే ఖర్చు, అనుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. అలాగే లాభాల గణాంకాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. దీనివల్ల ఛార్జింగ్ స్టేషన్ల డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఈవీ ఛార్జింగ్ కేవలం ప్లగ్గులు, సాకెట్ల వ్యవహారం మాత్రమే కాదు. ఇదొక మంచి పబ్లిక్ సర్వీస్ తో కూడిన లాభదాయక వ్యాపారం. ఈ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఛార్జర్ల రకాలు - అయ్యే ఖర్చు
ప్రధానంగా మూడు రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. హోమ్ లేదా ఆఫీసు పార్కింగ్ కోసం 3.3kW నుండి 7kW సామర్థ్యం గల స్లో ఛార్జర్లు సరిపోతాయి. వీటి ధర రూ. 30,000 నుండి రూ. 1,00,000 వరకు ఉంటుంది. మాల్స్, హోటళ్లలో వాడే 7-22 kW ఫాస్ట్ ఏసీ (AC) ఛార్జర్ల ధర రూ. 1 - 2 లక్షల మధ్య ఉంటుంది. హైవే ప్లాజాలు, ఫ్లీట్ డిపోల వద్ద వాడే 30-60 kW డీసీ (DC) ఫాస్ట్ ఛార్జర్ల కోసం రూ. 7 - 12 లక్షల వరకు ఖర్చవుతుంది. 120 kW అంతకంటే ఎక్కువ పవర్ ఉండే ఛార్జర్ల ధర రూ. 20 లక్షలు దాటవచ్చు.

కావలసిన అర్హతలు - అనుమతులు
ఈ వ్యాపారానికి సౌకర్యవంతమైన ల్యాండ్ లేదా పార్కింగ్ స్పేస్ ఉండాలి. లోకల్ డిస్కం (DISCOM) నుండి కనెక్షన్ తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక మీటర్, లోడ్ శాంక్షన్ అవసరం. ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణకు ఓసీపీపీ (OCPP) సాఫ్ట్‌వేర్ ఉండాలి. దీనివల్ల బిల్లింగ్, పేమెంట్స్ ఈజీ అవుతాయి. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదు. కేవలం టెక్నికల్ స్టాండర్డ్స్ పాటిస్తే సరిపోతుంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు:
భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) వంటి పథకాల ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు సబ్సిడీలు ఇస్తోంది. ముఖ్యంగా హైవేల వద్ద ఫాస్ట్ ఛార్జర్లు పెట్టేవారికి క్యాపిటల్ సబ్సిడీ లభిస్తుంది. రాష్ట్రాల వారీగా ఈ ప్రోత్సాహకాలు మారుతూ ఉంటాయి. పెట్టుబడి రిస్క్ తగ్గించడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.

నిర్వహణ ఖర్చులు
కరెంట్ బిల్లు మీ ప్రధాన ఖర్చు అవుతుంది. ఏసీ ఛార్జింగ్‌కు యూనిట్‌కు రూ. 6-12, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు రూ. 16-25 వరకు కస్టమర్ల నుండి వసూలు చేయవచ్చు. ఇవి కాకుండా సిబ్బంది జీతాలు, సాఫ్ట్‌వేర్ ఫీజులు, మెయింటెనెన్స్ కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పెట్టుబడి వెనక్కి వచ్చేది ఎప్పుడు? (ROI Example):
ఒక 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ పెట్టడానికి రూ. 10 లక్షలు ఖర్చయ్యిందని అనుకున్న‌ట్ల‌యితే, కస్టమర్ ధర: రూ. 24 / kWh ఉండ‌గా, మీకు పడే కరెంట్ ఖర్చు, రూ. 8 / kWhగా ఉంటుంది. రోజుకు 100 యూనిట్ల అమ్మకం జరిగితే.. నెలవారీ లాభం: రూ. 48,000 (సుమారుగా) ఉంటుంది. ఈ లెక్కన సుమారు 21 నెలల్లో అంటే 1.75 ఏళ్లలోనే మీ అసలు పెట్టుబడి తిరిగి వస్తుంది. లొకేషన్ బాగుంటే 1.5 ఏళ్లలోనే లాభాలు మొదలవుతాయి.

జాగ్రత్తలు - సూచనలు:
గ్రిడ్ అప్‌గ్రేడ్ ఖర్చులను ముందే అంచనా వేయాలి. లోకల్ డిస్కంతో ముందే మాట్లాడి పవర్ లోడ్ చెక్ చేసుకోవాలి. కస్టమర్ల కోసం నీడ, లైటింగ్, ఈజీ పేమెంట్ ఆప్షన్లు కల్పిస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ వాడటం వల్ల కరెంట్ ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయి.

 

టాప్ హెడ్ లైన్స్

TVS ఎన్‌టార్క్ 125 పూర్తి వివరాలు - ధర, మైలేజ్, ఫీచర్లు, వేరియంట్లు ఎలా ఉన్నాయి?
TVS ఎన్‌టార్క్ 125 కొనేవాళ్లకు అలెర్ట్‌! ఇవి తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి!
పెట్రోల్‌ లాగే CNG లోనూ కల్తీ సాధ్యమా ? వాహనదారులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
పెట్రోల్‌ లాగే CNG లోనూ కల్తీ సాధ్యమా ? వాహనదారులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
సెకండ్‌హ్యాండ్‌ EV కొనేవారికి గుడ్‌న్యూస్ - బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌తో అందుబాటులోకి MG ఎలక్ట్రిక్ కార్లు
ఇక ఈజీగా సెకండ్‌హ్యాండ్‌ EV కొనొచ్చు, అమ్మొచ్చు! స్పిన్నీ నుంచి బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
Embed widget