అన్వేషించండి

Driving Safe Tips: హిల్ స్టేషన్లలో డ్రైవింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే ప్రమాదాలు తప్పవు

Driving in Mountains | కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త ఓపికతో, అధిక వేగం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ నియమాలను పాటిస్తే, మీ ప్రయాణం సురక్షితంగా పూర్తవుతుంది.

Summer Driving Tips | ఈ వేసవి కాలంలో స్కూల్, కాలేజీ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో ఇంటర్, టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి. మరోవైపు స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సెలవులు ఎంజాయ్ చేయడానికి కొండ ప్రాంతాల వైపు వెళ్లేటప్పుడు రోడ్ ట్రిప్ మజాయే వేరు ఉంటుంది. చల్లని గాలి, అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అయితే మైదాన ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసినంత ఈజీగా కొండ ప్రాంతాలలో ఉండదు. ఇక్కడి ఇరుకైన రోడ్లు, ప్రమాదకరమైన టర్నింగ్స్, అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలు డ్రైవింగ్‌ను సవాలుగా మారుస్తాయి. కనుక మీరు కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. దాంతో మీ ప్రయాణం సురక్షితంగా, తీపి గుర్తులు మిగిల్చేలా సాగుతుంది. లేకపోతే ప్రమాదాలు, లేనిపోని ఇబ్బందులు తప్పవు. 

ఈ ముఖ్యమైన చిట్కాలు పాటించండి.. 
అన్నింటికంటే ముఖ్యమైన, తొలి విషయం ఏంటంటే, కొండ ప్రాంతాలలో ఎప్పుడూ స్పీడ్‌గా డ్రైవింగ్ చేయకూడదు. చాలా మంది త్వరగా చేరుకోవాలనో, లేక టైం లేదనో వేగాన్ని పెంచుతారు. కానీ కొండ మార్గాలు ఇరుకుగా, మెలికలు తిరిగి ఉంటాయని తెలిసిందే. ఈ జర్నీలో జరిగే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అందువల్ల హిల్ స్టేషన్లలో నెమ్మదిగా, స్పీట్ కంట్రోల్‌లో ఉండేలా డ్రైవ్ చేయండి.

రెండవ ముఖ్యమైన విషయం.. సరైన గేర్‌ను ఉపయోగించాలి. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వాడే గేర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రెండవ లేదా మూడవ గేర్‌లో డ్రైవింగ్ చేయడం మరింత సురక్షితం. దీనివల్ల వాహనంపై మీకు కంట్రోల్ ఉంటుంది. వాహనం ఇంజన్‌పై కూడా ఎక్కువ ఒత్తిడి పడదు.

మూడవ విషయం ఏంటంటే ఓవర్‌టేక్ చేయాలని తొందరపడకండి. కొండలపై రోడ్లు ఇరుగ్గా, టర్నింగ్స్‌తో ఉంటాయి. ఎదురుగా ఏం వస్తుందో చాలా సార్లు మీకు స్పష్టంగా కనిపించదు. అలాంటి పరిస్థితిలో మీరు ఇవేమీ ఆలోచించకుండా ఓవర్‌టేక్ చేస్తే, ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ఎదురుగా వచ్చే మార్గం పూర్తిగా స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాలి.

మలుపుల వద్ద హారన్ కొట్టాలి 

కొండ మార్గాలలో చాలా బ్లైండ్ టర్న్‌లు (ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని మలుపులు) చాలా ఉంటాయి. ఆ పరిస్థితిలో హారన్ కొట్టడం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్‌కు మరో వెహికల్ రాక గురించి ముందుగా తెలుస్తుంది. దాంతో అప్రమత్తమై ప్రమాదం జరగకుండా నివారించవచ్చు.

 సరైన లైట్ల వాడకం కూడా అవసరమే. కొండ ప్రాంతాలలో ఎప్పుడూ లో-బీమ్ (Low beam) పైనే డ్రైవింగ్ చేయాలి. దాంతో ఎదురుగా వచ్చే వాహనదారుడికి ఇబ్బంది ఉండదు. ఇద్దరూ ఒకరినొకరు స్పష్టంగా చూసుకుని వెళ్తారు.

ఈ విషయాలు కూడా గుర్తుంచుకోవాలి.. 
బ్రేక్‌లను అనాలోచితంగా ఉపయోగించరాదు. ముఖ్యంగా లోతైన వాలులలో పదే పదే బ్రేకులు వేయడం వల్ల బ్రేకులు వేడెక్కి, వాటి పనితీరు తగ్గిపోవచ్చు. అందువల్ల వాహనం వేగాన్ని కొన్నిసార్లు గేర్ల ద్వారా నియంత్రించడం చాలా సురక్షితం.

కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరపాటుతో కాకుండా సహనం, జాగ్రత్తే ముఖ్యమని గ్రహించాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే, కొండ ప్రాంతాలు హిల్ స్టేషన్లలో మీ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా, మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ జర్నీని ఎంజాయ్ చేయగలరు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget