Subsidiy On EVs: ఎలక్ట్రిక్ కార్లు, బైకులపై ఏ రాష్ట్రంలో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు?
EV Subsidies In India: దేశంలోని చాలా రాష్ట్రాల్లో FAME సబ్సిడీ పథకం కింద EV పాలసీలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల కింద, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన ప్రజలకు ప్రయోజనాలు అందిస్తున్నారు.

Subsidies On Purchases Of Electric Cars And Bikes In India: భారతదేశంలో, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల గాలి వీస్తోంది. డబ్బులు ఆదా చేసుకోవడం కోసమో లేదా పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతోనో ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొంటున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహన (EV) పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం వివిధ రకాల సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు, రోడ్ టాక్స్ మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తగ్గింపులు వంటి ప్రయోజనాలు అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ రాష్ట్రాన్ని బట్టి మారతాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు (కార్లు, SUVలు)
| రాష్ట్రం | సబ్సిడీ (ప్రతి kWhకి) | గరిష్ట సబ్సిడీ | రోడ్ టాక్స్ మినహాయింపు |
| మహారాష్ట్ర | ₹5,000 | ₹2,50,000 | 100% |
| అస్సాం | ₹10,000 | ₹1,50,000 | 100% |
| గుజరాత్ | ₹10,000 | ₹1,50,000 | 50% |
| పశ్చిమ బెంగాల్ | ₹10,000 | ₹1,50,000 | 100% |
| మేఘాలయ | ₹4,000 | ₹60,000 | 100% |
| బీహార్ | ₹10,000 | ₹1,50,000 | 100% |
| రాజస్థాన్ | లేదు | లేదు | NA |
| ఒడిశా | NA | ₹1,00,000 | 100% |
| పంజాబ్ | లేదు | ₹1,00,000 | 100% |
| తెలంగాణ | లేదు | లేదు | 100% |
| కేరళ | లేదు | లేదు | 50% |
| ఉత్తర ప్రదేశ్ | లేదు | లేదు | 75% |
| కర్ణాటక | లేదు | లేదు | 100% |
| ఆంధ్రప్రదేశ్ | లేదు | లేదు | 100% |
| తమిళనాడు | లేదు | లేదు | 100% |
| మధ్యప్రదేశ్ | లేదు | లేదు | 99% |
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు
| రాష్ట్రం | సబ్సిడీ (ప్రతి kWhకి) | గరిష్ట సబ్సిడీ | రోడ్ టాక్స్ మినహాయింపు |
| మహారాష్ట్ర | ₹5,000 | ₹25,000 | 100% |
| గుజరాత్ | ₹10,000 | ₹20,000 | 50% |
| పశ్చిమ బెంగాల్ | ₹10,000 | ₹20,000 | 100% |
| కర్ణాటక | లేదు | లేదు | 100% |
| తమిళనాడు | లేదు | లేదు | 100% |
| ఉత్తర ప్రదేశ్ | లేదు | లేదు | 100% |
| బీహార్ | ₹10,000 | ₹20,000 | 100% |
| పంజాబ్ | లేదు | లేదు | 100% |
| కేరళ | లేదు | లేదు | 50% |
| తెలంగాణ | లేదు | లేదు | 100% |
| ఆంధ్రప్రదేశ్ | లేదు | లేదు | 100% |
| మధ్యప్రదేశ్ | లేదు | లేదు | 99% |
| ఒడిశా | NA | ₹5,000 | 100% |
| రాజస్థాన్ | ₹2,500 | ₹10,000 | NA |
| అస్సాం | ₹10,000 | ₹20,000 | 100% |
| మేఘాలయ | ₹10,000 | ₹20,000 | 100% |
కీలకాంశాలు:
మహారాష్ట్ర: 2025 EV పాలసీ ప్రకారం, ప్రైవేట్ కార్లకు 10% సబ్సిడీ, టోల్ ఫ్రీ ట్రావెల్, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు.
గుజరాత్: కార్లకు ₹1.50 లక్షల వరకు & బైకులకు ₹20,000 వరకు సబ్సిడీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్: కార్లకు ₹1.5 లక్షల వరకు, బైక్‌లకు ₹20,000 వరకు రాయితీ, రోడ్ టాక్స్ మినహాయింపు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపు.
కేరళ: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఇ-రిక్షాలకు ₹10,000 నుంచి ₹30,000 వరకు సబ్సిడీ.
మధ్యప్రదేశ్: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 99% తగ్గింపు.
ఒడిశా: కార్లకు ₹1 లక్ష వరకు, బైక్‌లకు ₹5,000 వరకు రాయితీ + రోడ్ టాక్స్ మినహాయింపు.
రాజస్థాన్: కార్లకు సబ్సిడీలు లేవు, బైక్‌లకు ₹10,000 వరకు సబ్సిడీ.





















