Maruti Brezza Finance Plan: బ్రెజ్జా కొనడానికి బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, ఎంత జీతం ఉండాలి?
Maruti Brezza On Loan EMI: మారుతి బ్రెజ్జా కొనడానికి మీ దగ్గర పూర్తి డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నుంచి రుణం లభిస్తుంది, ఈజీ EMI ఆప్షన్‌లో లోన్ తీర్చేయవచ్చు.

Maruti Brezza Price, Down Payment, Loan and EMI Details: మెరుగైన మైలేజీ కార్ అంటే మారుతి కార్ పేరునే మొదట చెబుతారు. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన కాంపాక్ట్ SUV బ్రెజ్జా. ఈ కారు ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంది. బ్రెజ్జా కారు పెట్రోల్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది తక్కువ ధరకు ఎక్కువ మైలేజీ ఇచ్చే ఫ్యామిలీ ఫోర్‌వీలర్.
తెలుగు నగరాల్లో మారుతి బ్రెజ్జా ధర
మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర (Maruti Brezza ex-showroom price) రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.14 లక్షల వరకు ఉంటుంది. తెలుగు నగరాల్లో ఈ కారు బేస్ Lxi (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర (Maruti Brezza on-road price) రూ. 9.31 లక్షల వరకు ఉంటుంది. మీకు ఈ కారు నచ్చినప్పటికీ, మీ చేతిలో కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నా కూడా మీరు ఈ కారును కొనవచ్చు. కార్ లోన్ ద్వారా మీ కలల బ్రెజ్జాను మీ సొంతం చేసుకోవచ్చు.
బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, EMI ఎంత అవుతుంది?
మారుతి బ్రెజ్జా బేస్ మోడల్ కొనడానికి మీ దగ్గర ఉన్న రూ. 50,000 లను మారుతి షోరూమ్‌లో డౌన్ పేమెంట్ చేయండి. మిగిలిన రూ. 8.81 లక్షలను బ్యాంక్ మీకు లోన్ రూపంలో ఇస్తుంది. ఉదాహరణకు, బ్యాంక్ మీకు ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటు చొప్పున మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, EMI ఎంత అవుతుందో చూద్దాం.
7 సంవత్సరాల్లో అప్పు తీర్చేయాలని పెట్టుకుంటే ప్రతి నెలా రూ. 14,174 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 15,881 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
5 సంవత్సరాల్లో రుణం మొత్తం తిరిగి చెల్లించాలనుకుంటే నెలనెలా రూ. 18,288 EMI కట్టాలి.
4 సంవత్సరాల కాలం కోసం మీరు అప్పు తీసుకుంటే ప్రతి నెలా రూ. 21,924 EMI చెల్లించాలి.
బ్యాంక్ నుంచి పొందే రుణం మొత్తం, బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలా తక్కువ వడ్డీ రేటుకే కార్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెట్ చేయగలిగితే, బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తం వడ్డీ అంత తగ్గుతుంది.
మారుతి బ్రెజ్జా కొనాలంటే జీతం ఎంత ఉండాలి?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్‌ను కార్ లోన్ ద్వారా కొనాలనుకుంటే మీ జీతం నెలకు రూ. 60,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండాలి. అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి బ్రెజ్జా మోడల్ కోసం రుణం తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. వివిధ బ్యాంకుల విధానాల ప్రకారం EMI గణాంకాలలో తేడా ఉండవచ్చు.






















